భక్తి కథలు

హరివంశం 163

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొడ, పాదాల దగ్గర, పిక్కల దగ్గర నెత్తురులు, ఎముకలు అంటుకుని ఉన్నాయి. పాదాలు వెనుదిరిగి ఉన్నాయి. వేళ్ళు వంకరలు తిరిగి ఉన్నాయి. భయంకరమై శూలాలు చేతులతో తిప్పతున్నాయి ఈ పిశాచాలు. వాళ్ళ మధ్య మధ్య ఏదో చెప్పుకుంటూ కహకహ నవ్వుతున్నారు.
శ్రీకృష్ణ స్తుతిపరమైన పాటలు పాడుకుంటూ ఆయన కోసం గవేషిస్తున్నట్లుగా ఉన్నాయి ఆ పాటలు. శ్రీకృష్ణుడి కోసమే ఆరాటపడుతూ సంచరిస్తున్నట్లు వాళ్ళ నడక వైఖరి చెపుతున్నది. అందులో నాయకుడు ఇట్లా ఆక్రోశిస్తున్నాడు.
‘అయ్యో! ఏ జన్మలో ఏ పాపం చేశానో! ఇపుడీ పిశాచ జన్మ వచ్చింది. నరమాంసాశనులమైనాము. రక్తపానం చేస్తున్నాము. ప్రాణులను పొట్టన బెట్టుకుంటున్నాము. ఈ తృష్ణకు అంతూ దరీ కనపడటంలేదు. ఈ జన్మకు పుణ్యం చేసుకునే అవకాశం లేదు. అందువల్ల మంచి జన్మ రాదు. ఒకవేళ మానవ జన్మ ఎత్తినా బాల్య కౌమార వ్వన వార్థక లంపటాలతో వళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ జన్మ నిరర్థకమైపోతుంది. ఈ సుడి గుండం నుంచి బయటపడాలంటే వాసుదేవుడే దిక్కు అని ఆ పిశాచ ముఖ్యుడు తన వాళ్ళకు చెపుతూ ఆర్తితో దేనికోసమో, ఎవరికోసమో వెతుకుతున్నట్లు పరిభ్రమిస్తున్నాడు.
ఇంతలో ఆ పెద్ద పిశాచానికి నీల మేఘ నిభముల, పద్మనాభ సంజనిత జగజ్జనకము, సర్వపాపహర సందర్శన సమర్థమూ, పూర్ణ చంద్రాస్యమూ అయిన ఒక తేజోరూపము ఎట్టఎదుట కన్పించింది. ఆ పెద్ద పిశాచి ఆయన దగ్గరకు వెళ్లి ఈ కారడవిలో ఒక్కడవూ నీవు ఎందుకున్నావయ్యా! ఘోర మృగ సంచార ప్రాంతం కదా ఇది! నిన్ను చూస్తుంటే విష్ణుమూర్తివేమోననిపిస్తున్నది.
దేవేంద్రడవో, దిక్పాలకులలో ఒకడివో, పరమ పురుషుడివో, ఇక్కడేదో యోగసాధన చేస్తున్నట్లు కనపడుతున్నావు?! అని శ్రీకృష్ణుణ్ణి అడిగింది ఆ పిశాచం. అప్పుడు శ్రీకృష్ణుడు ‘నేను యదు వంశంలో జన్మించినవాణ్ణి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు పూనుకునేవాణ్ణి.
ఇప్పుడు పరమ శివుణ్ణి సందర్శించటానికి కైలాస పర్వతానికి వెళుతున్నాను అని చెప్పి ‘మీరెవరు? ఇక్కడ సాధు సచ్చరిత్రులైన మునులు, ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా- రాక్షస కృత్యాల విహరించేవారికి ఇక్కడ ప్రవేశార్హత లేదు. ఈ వేట కుక్కలేమిటి? ఈ మాంసాశన, రుధిర పానప్రవృత్తి ఏమిటి? వద్దు వద్దు ఇక్కడ ఉండవద్దు అని కృష్ణుడు ఆ గుంపువారిని హెచ్చరించాడు. అప్పుడా పిశాచ నాయకుడు, నేను ఆదిదేవుడు, జగన్నాథుడైన శ్రీకృష్ణ దర్శనం కోసం అలమటించిపోతున్నాను.
ఈ మృగయా విహారం కూడా నేను విష్ణుపూజగానే పరిగణిస్తాను. నా స్వామి ద్వారకాపురవాసి. ఆర్తశరణ్యుడు. వసుదేవుడి కూర్మినందనుడుగా జన్మించాడని తెలుసుకున్నాను. ఆనందకహస్తుణ్ణి దర్శించాలన్నదే నా ఆరాటం. ఆ ముకుందుడు నన్ను అనుగ్రహిస్తే నా నీచ జన్మం తొలగిపోతుంది.
సృష్టి స్థితి లయ కర్త అయిన కమలోదరుణ్ణి నేను ఆశ్రయిస్తాను. పుండరీకాక్షుణ్ణి నా నీచ జన్మ పరిహరింపజేయవలసిందిగా వేడుకుంటాను. నేను ఘంటాకర్ణుడనే పిశాచ నాయకుణ్ణి. వీడు నా సోదరుడు. మేము ఘోర క్రూర కృత్యాలు చేస్తూ జీవిస్తున్నాము. నాకు శ్రీకృష్ణ సందర్శనం వల్ల శాపావశాన సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణ మహాత్మ్యాన్ని ఇంకా కొంచెం సేపు కీర్తించాడు ఘంటాకర్ణుడు.
ఇది అర్థరాత్రి అపరాత్రి సమయం. మావంటి క్రూరకర్ములకు సంచార యోగ్యమైన కాలం కాని మీ వంటి మానవులు ఇటువంటి చోట్ల మెసలే కాలం కాదు. నాకు కూడా కొన్ని వ్రతాచారణ నియమాలున్నాయి.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు