బిజినెస్

జోరుగా బెట్టింగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 23: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే దానిపై గురువారం జరుగుతున్న రెఫరెండంపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, బెట్టింగ్ పరిశ్రమకు మాత్రం ఇది పెద్ద వరంగా పరిణమించింది. సాధారణంగా ఫుట్‌బాల్, క్రికెట్ లాంటి ఆటల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు వాటిన్నిటినీ ఈ ‘బ్రెగ్జిట్’ మించిపోయింది. ‘బుక్‌మేకింగ్ పరిశ్రమ ఇప్పటివరకు చూడని అతిపెద్ద నాన్ స్పోర్టింగ్ ఈట్ ఇదే.. ఇయు రెఫరెండం గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలు, స్కాట్లాండ్ స్వాతంత్య్రంకోసం నిర్వహించిన రెఫరెండంలను అధిగమించి అతి పెద్ద రాజకీయ సంఘటనగా నిలిచిపోయింది’ అని బ్రిటన్‌లో ప్రముఖ బుక్‌మేకర్ సంస్థల్లో ఒకటైన లాడ్‌బ్రోక్స్ సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
ఈ రెఫరెండంలో ఫలితం ఊహించడానికి వీలులేనంతగా నువ్వా, నేనా అన్నట్లుగా ఉంటుందని ఒపీనియన్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నప్పటికీ బుక్‌మేకర్లు మాత్రం బ్రిటన్ ఇయులోనే కొనసాగుతుందనే గట్టినమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గురువారం రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి దీనిపై బెట్టింగ్ అన్ని రికార్డులను బద్దలుకొట్టి పది కోట్ల పౌండ్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. నిజానికి గత ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ రెఫరెండంను ప్రకటించినప్పటినుంచి కూడా బుకీస్ బ్రిటన్ ఇయులోనే కొనసాగుతుందనే బలంగా నమ్ముతున్నారు. గత నెలలో వాళ్లు తమ అంచనాలను భారీగా తగ్గించుకున్నప్పటికీ గత వారం రోజులుగా మళ్లీ బ్రిటన్ ఇయులోనే కొనసాగుతుందనే దానికి అనుకూలంగా బెట్టింగ్‌ను పెంచేశారు. ఇప్పుడది ఎంతవరకు వచ్చేసిందంటే బ్రిటన్ ఇయులోనే కొనసాగడానికి 82 శాతం అవకాశముందని వారు నమ్ముతున్నారు. అదే తీరులో వారు బెట్టింగ్‌లను కూడా అనుమతిస్తున్నారు. అయితే ఫలితం ఎలా ఉన్నప్పటికీ తాము పెద్దగా నష్టపోమని బడా బుక్‌మేకర్లందరూ చెబుతూ ఉండడం గమనార్హం. రెఫరెండం ఓటింగ్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఇయులోనే కొనసాగాలనే అంశంపై గెలుపు మార్జిన్ ఎంత ఉంటుందనే దానిపైన కూడా అందరి దృష్టీ మొదలైంది. అయితే ఓటింగ్ శాతాన్ని బట్టి ఇది 50.01 శాతంనుంచి 55 శాతం మధ్య ఉండవచ్చనని బుక్ మేకర్లు అంచనా వేస్తున్నారు.