రివ్యూ

పేరు గొప్ప..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు-- కుందనపు బొమ్మ

తారాగణం:
చాందినీ చౌదరి, సుధీర్‌వర్మ, సుధాకర్ కొమాకుల
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: జాన్
నిర్మాతలు:
జి అనిల్‌కుమార్ రాజు, జి వంశీకృష్ణ
దర్శకత్వం: వరా ముళ్లపూడి

నిర్మాత, రచయిత ముళ్లపూడి రమణ తనయుడు వర ముళ్ళపూడి దర్శకుడిగా ఒకటి రెండు సినిమాలు చేశారు. అవి పెద్దగా కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేదు. దీంతో కుందనపుబొమ్మతో హిట్ అందుకోవడానికి చేసిన మరో ప్రయత్నమే ఇది. షార్ట్ ఫిల్మ్స్‌తో యూత్‌లో పాపులారిటీ సంపాదించిన చాందినిచౌదరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ కొమాకుల, సుధీర్‌వర్మల కాంబినేషన్‌తో తెరకెక్కింది.
కథ: విజయనగరానికి సమీపంలోని ఓ చిన్న ఊరికి పెద్దమనిషి మహదేవరాజు (నాగినీడు). అతని కుమార్తె సుచిత్ర (చాందిని చౌదరి). కూతురుని అల్లారుముద్దుగా పెంచుతాడు మహదేవరరాజు. మేనల్లుడైన గోపి (సుధాకర్) తన ఇంటల్లుడని ప్రకటించుకుంటాడు. అయితే గోపీకి సుచిని పెళ్లాడటం ఇష్టముండదు. ఇలాంటి తరుణంలో కథలోకి వాసు (సుధీర్‌వర్మ) ఎంటరవుతాడు. మహదేవరరాజు ఇంట్లో కారు రిపేర్ చేయడానికి వచ్చిన ఇంజనీర్ వాసు, సుచిత్రతో ప్రేమలో పడతాడు. సుచిత్ర సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో -ప్రేమాయణం మొదలవుతుంది. గోపీయే తన అల్లుడని ప్రకటించుకున్న మహదేవరరాజుకి వాసు, సుచిలు తమ ప్రేమను ఎలా చెప్పుకున్నారు? అసలు గోపీకి సుచిత్రను పెళ్లాడటం ఎందుకు ఇష్టంలేదు? వాసు-సుచిత్ర ప్రేమకథ సఫలమైందా? లాంటి సమాధానాల కోసం సినిమా చూడాలి.
సినిమాలో హీరోయిన్ చాందిని తప్ప, ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేదు. చలాకీ పాత్రతో చాందిని మెప్పించింది. చాందిని, రాజీవ్ కనకాల నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రాజీవ్ కనకాల క్యారెక్టరైజేషన్, దాన్ని అతడు పండించిన విధానం ఓకే. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో పరిచయమైన సుధాకర్ ఈ చిత్రంలో ఓ నెగెటివ్ రోల్ చేసి ఒకే అనిపించుకున్నాడు. హీరో సుధీర్‌వర్మ కూడా ఓకే. ఇంతకుమించి రెండు గంటల నిడివి కలిగిన సినిమాలో మెచ్చుతునకలు ఒక్కటీ కనిపించదు, వినిపించదు. ఫస్ట్ఫాలో సుధీర్- చాందినీల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాకు అతి పెద్ద మైనస్ పాయింట్ -సింపుల్ కథను అర్థంపర్థం లేకుండా చెప్పడం. కామెడీ కోసం రాసుకున్న ఎపిసోడ్స్ వెగటు పుట్టించాయి. ఓ కారు రిపేరు కోసం వాసు అక్కడికి రావడం, దానిచుట్టూ డ్రామా.. ఇదంతా చూస్తే పాత కాలం కథను కొత్త కలర్ కోటింగ్‌తో చూసినట్టుంటుంది. నాగినీడు ఫ్యామిలీ మొత్తానికి హీరోయిన్ ప్రేమ కథ తెలిసినా, దాన్ని కామెడీ చేయడంతో కథలోని ఆర్ధ్రత కనుమరుగైపోయింది. టైటిల్ గొప్పగావున్నా, దానికి తగిన క్లాసిక్ సీన్లుగానీ, ఎమోషనల్ బాండింగ్ కలిగిన సన్నివేశాలుగనీ సినిమాలో మచ్చుకు కూడా కనిపించలేదు.
దర్శక, రచయిత వరా ముళ్ళపూడి ఏ కథ చెప్పాలనుకొని ఏం కథ చెబుతున్నారో అన్న ఫీలింగ్ ఆడియన్స్‌ని వెంటాడుతుంది. ఒక్క రాజీవ్ కనకాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు వినా, దర్శకుడి ప్రతిభను గుర్తించే సన్నివేశం ఒక్కటీ లేదు. సిల్లీ కామెడీతో షో చూపించే ప్రయత్నమే జరిగింది. సినిమాటోగ్రఫీ ఓకే. తక్కువ లొకేషనే్స ఉన్నా, అట్రాక్టివ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించగలిగాడు. సంగీత దర్శకుడు కీరవాణి స్థాయికి తగిన బాణీగానీ, ఆర్‌ఆర్‌గానీ లేవు. ఎడిటింగ్ ఏమాత్రం బాగలేదు. చివరకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అనిపించదు. కుందనపు బొమ్మ అన్న అచ్చ తెలుగు టైటిల్, బాఫు మార్క్ చూపించే పోస్టర్స్‌ను చూస్తే ఎవరైనా అంచనాలతోనే థియేటర్‌కు వస్తారు. ప్రేక్షకుడి అంచనాలకు భిన్నంగా సినిమా ఉండటంతో -ప్రేక్షుకుడు రిసీవ్ చేసుకుంటాడన్న ఆశలు కష్టమే. అస్పష్టమైన కథ, అర్థంపర్థంలేని కామెడీ, బోరింగ్ స్క్రీన్ ప్లే, మొత్తంగా ‘కుందనపు బొమ్మ’ కథ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘కుందనపుబొమ్మ’ మెప్పించలేకపోయింది.

-త్రివేది