భక్తి కథలు

హరివంశం 178

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రహ్లాదుడి కులానికి ఏదో చేటు రాబోతున్నదని నాకు సూచనప్రాయంగా తోస్తున్నది. ధ్వజం విరగిపడటం అంటే ఏమిటి? నీకేదో కీడు రాబోతున్నదనే కదా! అది తెలుసుకోలేక నా బాహువుల తీట తీర్చుకోబోతున్నావని నీవు పొంగిపోతున్నావు? ఇది ఆపదకే సంకేతం కాని నీ బాహుబల సంపదకు ఎంత మాత్రం ఊతకాదు. నాకైతే అగమ్యగోచరంగా ఉంది అని బాణుడి దగ్గర తనకున్న చనువు కొద్దీ కుంభాండుడు మనవి చేశాడు. అయినా బాణుడు భయపడలేదు. పైగా యుద్ధం యుద్ధం అంటూ పొంగిపోయినాడు. ఇక ఎప్పుడెప్పుడు ఈ యుద్ధం సంభవిస్తుందా అని గుక్కిళ్ళు మింగుతుండగా ఇంతలో ప్రచండమైన వజ్రాహతికి గిరిశిఖరం కూలిపోయినట్లు మయూర ధ్వజం నేలకూలింది. బాణుడేమో హర్షధ్యానం చేశాడు. కుంభాండుడేమో కుంగిపోయినాడు ఈ సంఘటనకు. కుంభాండకుడికి ఎన్నో అపశకునాలు తోచాయి. బాణుడికి ఎన్నడూ లేనంత సంతోషకారణం కనపడింది. ఈ మహాద్భుత సమ్మోదంతో బాణుడు అంతఃపుర కాంతలతో క్రీడాసక్తుడైనాడు. గీత వాద్య నృత్యోత్సవాలు, పాన గోష్ఠులు అంతఃపురంలో సందడించాయి. ఇక వేరే లోకమే లేకపోయింది బాణుడికి. యుద్ధోద్ధతుడై ఎదురుచూస్తున్నాడు.
ఇట్లా రోజులు గడుస్తుండగా చైత్ర మాసం వసంత శోభతో ప్రకృతిని అభినవరాగ రంజితం చేస్తూ శోణపురికి ఆగమించింది. ప్రతి తరువూ, ప్రతి లతా శాంభవ దీక్షను స్వీకరించినట్లు కిసలయ కింజల్క భాసిత శోభతో అలరారాయి. కోకిలలు పంచాక్షరీ జప పరాయణలైనట్లు కుహూనాదాలు చేశాయి. శోణపుర నివాసి అయిన పరమశివుడు పార్వతితో కూడి వన విహారం చేయాలని అభిలషించాడు. అప్పుడు అప్సరసలంతా వచ్చి శోణనగర ఉపవనాలలో ఆడిపాడారు. గంధర్వులు సంగీత సభలు నిర్వహించారు. ప్రమథులందరూ ఆ పరమోత్సవంలో పాల్గొన్నారు. బాణుడి అంతఃపుర సీమంతినులు కూడా సమధికమైన ఉత్కంఠతో పరమ శివుణ్ణీ, పార్వతినీ కొలుచుకున్నారు. పుష్పాపచయంలో సంగీత నృత్య గాన వినోదాలలో పాలు పంచుకున్నారు.
బాణాసురుడికి బహు సౌందర్యరూపిణి అయిన కూతురుంది. ఆ కనె్న మన్మథుడి సమ్మోహనాస్త్రంగా బాణుడి ముద్దు మురిపాలతో పెరుగుతూ వ్వనవతి అరుంది ఇప్పుడు. ఈ బాలిక అంటే బాలచంద్రధరుడి అర్థాంగికి కూడా బహు మురిపెమూ, గారాబమూనూ. ఈ పిల్ల పెండ్లీడుకు వచ్చింది. శైల బాలను భక్తిశ్రద్ధలతో బాణ తనయ ఉష ఆరాధిస్తూ వుండేది. ఉషకు ఇష్ట సఖి చిత్రరేఖ. ఈ చిత్ర రేఖ బాణుడి ఇష్ట సచివుడైన కుంభాండుడి పుత్రిక. చిత్రరేఖకు ఉష దగ్గర చాలా చనువు. ఎప్పుడూ వాళ్ళిద్దరూ అరమరలు లేకుండా కలిసిమెలిసి మనసులు కలబోసుకునేవారు.
చిత్రరేఖ సకల విద్యా ప్రవీణ. చిత్రలేఖనంలో ఆమెకు సాటివచ్చేవారెవరూ లేరు. ముప్పొద్దులా ఉషను ఎడబాయని నేస్తురాలు చిత్రరేఖ. ఉష ఆంతరంగిక సఖి.
పరమశివుడు పార్వతితో బాణపురం వెలుపల ప్రవహించే మందాకినీ తీరంలోని పుష్పవనాలలో విహరించాడు. సుగంధ బంధుర పుష్పాలతో మంగళగౌరిని అలంకరించి మురిసిపోయినాడు. ప్రమధులు కూడా అక్కడ తమ ప్రియురాండ్రతో కుసుమబాణుణ్ణి అర్చించి ఆ ప్రదేశమంతా శివ, శివానీమయంగా సంచరించారు. పరమ శివుడు ఈ శృంగార సృష్టిని గిరిజ ఎంతో తమకంతో ఆనందించింది. ఆమె నవ్వులకు మృడుడు ఆమెను నవ్వులతో ముంచెత్తాడు. ఎవరైనా ఈ విరగబడి నవ్వటాన్ని చూస్తారని ఆ ఆదిదంపతులు ఒక పూల పొదరిల్లులో చంద్రకాంత శిలావేదికపై సేదదీరటానికి చేరారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు