భక్తి కథలు

హరివంశం - 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు బ్రహ్మ, తన దగ్గరకు వచ్చిన దేవతా ప్రముఖులతో కలిసి వారందరూ పాల కడలిలో శేష తల్పంపై నిద్రిస్తున్న శ్రీమన్నారాయణ మూర్తి దగ్గరకు వెళ్లారు. ఇట్లా చతుర్ముఖ పురస్సరంగా పాల సముద్ర శేషతల్పం సన్నిధికి చేరిన ఆ దేవతలంతా విష్ణుమూర్తినుద్దేశించి స్తోత్రాలు చేశారు.
ఆ పుండరీకాక్షుడపుడు నిద్ర లేచి వాళ్ళపై కరుణావలోకనాలు ప్రసరింపజేశాడు. ఏమిటి ఇట్లా అందరూ గుంపుకూడి వచ్చారు? లోకాలన్నీ క్షేమంగా ఉన్నాయా? మళ్లీ మరే ఉపద్రవమూ తలఎత్తలేదు కదా! రాక్షసులు విజృంభించి మళ్లీ సాధుజనులను పీడించటం లేదు కదా!’ అని ఓదార్పుగా వాళ్ళను అడిగాడు. అపుడు కమలభవుడు ఫాలభాగంలో అంజలి ఘటించి భూభారం దుర్భరంగా పెరగటానికి కారణాలేమిటో పరమ పురుషుడికి వివరించాడు. భూమిమీద రాజులందరూ ధర్మం తప్పక పరిపాలన చేస్తున్నారు. అన్యోన్య వైరాలు మానుకున్నారు. నీతి, న్యాయమూ, సత్యమూ, ప్రజలంతా శిరసావహించేట్లు రాజ్యపాలనం చేశారు. ప్రజలనుంచి వారి ఆదాయాలలో ఆరోవంతు ధర్మబద్ధంగా పన్నులు వసూలు చేశారు. కుటుంబాలు బహు ధాన్య ధన సమృద్ధంగా బంధువులు, మిత్రులు, పనివాళ్ళు, అధికారులు ఎటువంటి కొరతా లేకుండా హాయిగా గడిపేట్లు ఆ రాజ్యాలన్నీ విలసిల్లాయి. రాజుల దగ్గర ఉండే మంత్రులంతా ప్రజల క్షేమానికి సుఖ సంతోషాలకూ పూనిక చూపారు. ఈ విధంగా రాజ ప్రసాదాలు, ఊళ్ళు, నగరాలు కలకలలాడాయి. నిరంతరం యజ్ఞ యాగాదులతో, సకల వర్షాలతో, పాడి పంటలతో జన పదాలన్నీ వృద్ధి పొందాయి. వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా కొనసాగాయి. దేవతలు, పితృదేవతలు, విప్రులు తృప్తి చెందారు. ఏ నగరంలో, ఏ రాజ్యంలో చూసినా చతురంగ బలాలు పెంపొందాయి. లక్షల సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు, రథాలు, పల్లకులు వేనకువేలుగా సమకూడాయి. వేల సంఖ్యలో కొత్త గ్రామాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రజలు బహుకాలం జీవిస్తున్నారు. రోగాలు లేవు. కృతయుగం మళ్లీ వచ్చిందా? అనిపించేట్లు అధర్మం పాలు కాకుండా, చావులు లేకుండా ప్రజా సంఖ్య విపరీతంగా వృద్ధి కావడంతో భూదేవి ఈ భారాన్ని మోయలేక దురవస్థ పాలైంది. ఆక్రందిస్తున్నది. ధర్మలోపం లేకుండా ఈ నృపకులాలన్నీ క్షయమైపోయేట్లు నీవు పూనుకోవలసింది అని బ్రహ్మదేవుడు విన్నవించాడు. ఈ మహాకార్యంలో తామంతా ఏ విధంగా తమ కర్తవ్యాలు నిర్వహించవలసిందీ తెలియచేయవలసిందిగా ప్రార్థించాడు. అందువల్ల భూదేవి సంతాపం తొలగించగల సామర్థ్యం, శక్తియుక్తులు నీవు దేవతలకు ఉద్బోధించాలి. నీవు తప్ప ఈ పనిని ఎవరూ నిర్వహించలేరు. అచల స్వభావురాలైనా భూమి ఇపుడు సంచలిస్తున్నది. మేరు పర్వతంపైకి విచ్చేసి కొలువుదీర్చి మా పనులను మాకు అప్పజెప్పాలి అని విష్ణుమూర్తిని బ్రహ్మ ప్రార్థించాడు.
అపుడు శ్రీమహావిష్ణువు తన పాద సేవ చేస్తున్న శ్రీమహాలక్ష్మిని బుజ్జగింపుగా అవలోకించి పక్కకు ఒత్తిగిలి తన దివ్య పాదాలు శయ్య పక్కనే ఉన్న మణిపీఠంపై ఉంచడానికి లేచి కూర్చున్నాడు. తన మూళిపై కొంచెంగా చెదరిన పూలదండను సవరించుకొన్నాడు. ఉజ్జ్వల కౌస్త్భు పతకంతో కొంచెంగా చిక్కుపడిన వక్షస్థల హారాన్ని సరిచేసుకున్నాడు. వదులైన తన పీతాంబరాన్ని బంగారు కటి సూత్రంతో బిగించాడు. ఇట్లా యోగ నిద్రను చాలించి ఆ దేవదేవుడు శంఖ చక్రగదలు చేతుల్లో ధరించి దేవతలకు అభయహస్తం ప్రసాదిస్తూ శేషతల్పం దిగాడు. దేవతల వదనాలు ప్రఫుల్లమైనాయి.
ఇంతలో అక్కడకు వినతా తనయుడు వేంచేశాడు.
- ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు