రివ్యూ

పెళ్లి చూసి రావచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు..శ్రీరస్తు శుభమస్తు
**
తారాగణం: అల్లు శిరీష్, లావణ్యత్రిపాఠి, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శీను, అలీ, సుబ్బరాజు,
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: మణికంథన్
నిర్మాత: అల్లు అరవింద్, బన్నీవాసు
దర్శకత్వం: పరశురామ్
‘గౌరవం’తో హీరోగా ఎంట్రీఇచ్చిన మెగా క్యాంప్ హీరో అల్లు శిరీష్ -తరువాత మారుతి దర్శకత్వంలో ‘కొత్త జంట’ సినిమా చేసాడు. రెండు సినిమాలూ ఆయన కెరీర్‌కి పెద్దగా ప్లస్ కాలేకపోయాయి. కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన సినిమా శిరీష్‌కి ఎంత కలిసొచ్చిందో చూడాలంటే -సినిమాలోకి ఎంటరవ్వాలి.
కథ:
మధ్య తరగతి కుటుంబాలన్నీ వాళ్ళ కూతుళ్లను ధనవంతుల ఇళ్లలో పడేసి ఓవర్‌నైట్ సెటిలైపోవాలని చూస్తుంటాయనే అభిప్రాయంతో ఉండే ప్రముఖ బిజినెస్ మ్యాన్ కొడుకు శిరీష్ (అల్లు శిరీష్). అనన్య (లావణ్య త్రిపాఠి) అనే మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే విషయాన్ని వాళ్ళ నాన్నకు చెప్పగా, ఆయన మిడిల్ క్లాస్ అమ్మాయిలు నీ వెనకున్న డబ్బుని చూసి ప్రేమిస్తారని, ఆ ప్రేమలో నిజం ఉండదంటాడు. కానీ శిరీష్ మాత్రం నేను ఒక డబ్బులేని వాడిగానే అమ్మాయి ప్రేమను సాధిస్తానని వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేస్తాడు. అలా ఛాలెంజ్ చేసిన శిరీష్, అనన్య ప్రేమను పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటి? చివరికి అనన్య ప్రేమను దక్కించుకున్నాడా లేదా? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇదే లాగ్‌లైన్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేశాయి. రాజేంద్రప్రసాద్, రజని పెయిర్‌గా చేసిన అహనాపెళ్ళంట -చిత్రానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించినా -సీన్లు వేసుకోవడంలోని కొత్తదనం ఆ సినిమాల జ్ఞాపకానికి దూరంగా ఉంచింది ‘శ్రీరస్తు శుభమస్తు’. శిరీష్ గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ చిత్రంలో నటన, స్క్రీన్ అప్పియరెన్స్ ఓకే. లావణ్య త్రిపాఠి మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. సినిమా మొదటి భాగమంతా హీరో హీరోయిన్ల మధ్య నడిచే ఫన్నీ సీన్లు, ఫ్యామిలీ భావోద్వేగపూరిత సన్నివేశాలతో సాగుతుంది. మొదటి భాగంలో ప్రభాస్ శీను, రెండో భాగంలో అలీ, సుబ్బరాజులు చేసిన కామెడీ ఫరవాలేదు. ప్రీ క్లైమాక్స్‌లో శిరీష్, ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచే డ్రామా ఆకట్టుకుంది. సినిమాలోని ముఖ్యమైన పాత్రలకు పరశురామ్ రాసుకున్న సంభాషణలు ఆలోచింపచేశాయి. ఎంచుకున్న ప్రేమ ప్లస్ కుటుంబ విలువల కథాంశం, రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న ఎంటర్‌టైనింగ్ ప్లే ఫరవాలేదనిపించింది. ఈ రెండు అంశాల్లో ప్రతిభ కనబర్చిన పరశురామ్ రచయితగా సక్సెస్ అయినట్టే. చిత్రంలో శిరీష్, లావణ్యత్రిపాఠీల మధ్య కెమిస్ట్రీ వర్కవుటైంది. థమన్ మ్యూజిక్ ఓకే. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కథనానికి బాగా హెల్పయ్యింది. మణికంథన్ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రకాష్‌రాజ్, రావురమేష్, తనికెళ్ళ భరణిలు తమ పాత్రలకు న్యాయం చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు రిచ్‌గా ఉండి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. కుటుంబ విలువలు, ప్రేమ అంశాలతో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని భావోద్వేగాలను తనలో నింపుకుంది. పాత్రలకు తగిన నటన, మోతాదుకు మించని కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, బోర్ కొట్టించని కథనం సినిమాకు ప్రధాన బలాలు. చాలా సినిమాల్లో చూసే కొన్ని రెగ్యులర్ సన్నివేశాలను మినహాయిస్తే ఈ సినిమా ఖచ్చితంగా వినోదాన్ని అందించేదే. అలాగే సినిమాలో కొన్ని లాజిక్‌లేని సన్నివేశాలున్నాయి. హీరో హీరోయిన్‌కు దగ్గరవ్వడం అనే ఎపిసోడ్ కొంత సహజత్వాన్ని మిస్సై ఇలా కూడా జరుగుతుందా? అనిపిస్తుంది. అలాగే రెండోభాగంలో హీరో హీరోయిన్‌లో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్ సన్నివేశంలో ఏమాత్రం బలం లేక నీరసంగా సాగుతుంది.

-త్రివేది