రివ్యూ

పవిత్ర ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** బాజీరావ్ మస్తానీ (ఫర్వాలేదు)

తారాగణం:
రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా, తన్వీ అజ్మీ, మహేష్ మంజ్రేకర్, మిలింద్ సోమన్, వైభవ్
సంగీతం: సంచిత్ బల్‌హరా
నిర్మాతలు:
కిషోర్ లుల్లా, శోభాసంత్
దర్శకత్వం:
సంజయ్ లీలా భన్సాలీ

ప్రేమకు మతం లేదు. రంగు లేదు. అవన్నీ మనుషులు ఏర్పాటుచేసుకున్నవే. వాటికోసం మనుషులు దూరమవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రేమించిన హృదయానికి హద్దులు పెట్టాల్సిన అవసరం లేదని, మతం కోసం మానత్వాన్ని మంటగలపాల్సిన అవసరం లేదని, నిజమైన ప్రేమ మతం, కులం అగ్నిలో కాలితే పవిత్ర ప్రేమగా మారుతుందని చెప్పారు బాజీరావ్, మస్తానీ.
కథేంటి?
అఖండ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి ఒకే గొడుగు క్రిందకు హైందవాన్ని వెలిగించాలని ప్రయత్నిస్తున్న శివాజీ సేనా నాయకుడు, యోధుడు ‘పేష్వా బాజీరావు’ (రణ్‌వీర్‌సింగ్). 17వ శతాబ్దంనాటి మరాఠా యోధుడైన ఆయన జన్మతః బ్రాహ్మణుడు. శివాజీ తరఫున అఖండ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచటానికి ఎదురొచ్చిన పరాయి మూకలను యుద్ధంలో ఓడించి అప్రతిహతంగా ముందుకు వెళుతుంటాడు. బుందేల్‌ఖండ్ యువరాణి మస్తానీ (దీపికా పదుకొణె) అభ్యర్థనపై ఆ రాజ్యంపై దండెత్తిన మొగలాయి సైన్యాలను తిప్పికొట్టడానికి మాల్వా వెళ్ళకుండా బుందేల్‌ఖండ్ వెళతాడు బాజీరావ్. ఆ యుద్ధంలో శత్రువులను మట్టికరిపించి బుందేల్‌ఖండ్ యువరాణి మస్తానీకి ఆనందం కలిగిస్తాడు. అదే యుద్ధంలో తన ప్రాణాన్ని కాపాడిన ఆమె ప్రేమకు పాత్రుడవుతాడు. బాజీరావ్ భార్య కాశిభాయ్ (ప్రియంకా చోప్రా) భర్తకోసం ఎదురుచూస్తుంది. భర్త విజయగర్వంతో తిరిగి వస్తాడనుకుంటే మరో ‘ఉపవస్త్ర’ తీసుకురావడం ఆమెకు నచ్చదు. అతనితో తన వ్యతిరేకతను చెబుతుంది. బాజీరావ్ తల్లి (తన్వీఅజ్మీ) మస్తానీ ప్రేమలో పడటం సరైన పద్ధతి కాదని కొడుకుకు హితవు చెబుతుంది. మస్తానీ సౌందర్యం, ఆమె వీరత్వం, కల్మషం లేని వ్యక్తిత్వం బాజీరావ్‌లో ప్రేమను మరింత పెంచుతుంది. తనను పెళ్లిచేసుకుంటే అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇద్దరి మతాలు వేరు వేరు కనుక ఎన్నో త్యాగాలు చేయాల్సి వుంటుందని ముందుగా బాజీరావ్ మస్తానీని హెచ్చరిస్తాడు. అన్నిటికీ ఒప్పుకుంటుంది మస్తానీ. ఆ తరువాత తన సతారా కోటకు వస్తాడు. పేష్వాకు కానుకగా తాను వచ్చానని, బుందేల్‌ఖండ్‌నుండి మస్తానీ బాజీరావ్ కోసం వస్తుంది. దేశమంతా బాజీరావ్ విజయాలను కీర్తిస్తుంటే ఇంట్లో మాత్రం ఆయనకు అపజయం ఎదురవుతుంటుంది మస్తానీ విషయంలో. మస్తానీ తల్లి అవుతుంది. అతనికి కృష్ణ అనే పేరు పెడుతుంది. ఆ పేరుకి సతారాలో పండితులు ఒప్పుకోరు. అయితే షంషేర్ బహదూర్ అన్న పేరును పెడతానని, వాడు ముస్లింగానే పెరుగుతాడని హెచ్చరిస్తాడు బాజీరావ్. మస్తానీపై అనేకసార్లు హత్యా ప్రయత్నం కూడా చేస్తారు. యోధురాలు కనుక అన్నింటినీ తిప్పికొడుతుంది. చివరికి రాజీపడని మనస్తత్వంతో బాజీరావ్ చెప్పిన ఏ విషయానికైనా తలొగ్గుతుంది. యుద్ధానికి వెళుతూ భవిష్యత్తులో జరగబోయే సూచనలు చెప్పి వెళతాడు బాజీరావ్. భర్త యుద్ధనికి వెళ్ళగానే మస్తానీని బంధిస్తారు. బుందేల్‌ఖండ్‌కు వెళ్లిపొమ్మని బెదిరిస్తారు. ఏమైనా సరే, తాను అక్కడికి వెళ్ళేది లేదని ఖరాఖండీగా చెబుతుంది మస్తానీ. ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగతా కథాంశం.
ఎలా వుంది?
సంజయ్ లీలా భన్సాలీ అంటేనే భారీతనానికి మారుపేరు. బాజీరావ్ తన తండ్రి వారసత్వంగా పేష్వా అధికారాన్ని చేజిక్కించుకోవడం, మాల్వానుండి బుందేల్‌ఖండ్‌కోసం యుద్ధం చేయడం, ఆ తరువాత సతారాకు తిరిగి వచ్చి రాజకీయ తంత్రాన్ని నడపడం, మస్తానీ సతారా రావడం, ఇరువర్గాలమధ్య వైషమ్యాల చిత్రీకరణ, ఇద్దరి భార్యలమధ్య నలిగిన బాజీరావ్‌పై వచ్చే సన్నివేశాలు, తన్వీ అజ్మీపై చిత్రీకరించిన సీన్లు లాంటి ప్రతి సన్నివేశం కూడా భారీగానే చిత్రీకరించారు. ముఖ్యంగా కథ ఎక్కడ జరిగిందో అక్కడికే వెళ్లి మినియేచర్ సెట్స్‌తో ఎరీనా సెట్లను సంథానించి చిత్రీకరించిన విధానం సరికొత్తగా వుంటుంది. మస్తానీ, బాజీరావ్‌ల ప్రేమకథ చరిత్ర ప్రకారం చాలా చిన్నకథే. కానీ దాన్ని ఎల్‌ఎల్‌బి చిత్రీకరించిన పద్ధతిలో చాలా పెద్దకథగా చెప్పాడు. ముఖ్యంగా ప్రేమ అనే భావనను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. కథ చిన్నదైనా ప్రేమ భావనలను మాత్రం ఆకాశమంతా ఎత్తు ఎత్తాడు. ఓవైపు భారీ సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించిన సన్నివేశం కళ్లముందు కదలాడుతుంటే, ప్రేక్షకుడు సినిమాలో వున్న ఫీల్‌ని అనుభవించేలా చిత్రీకరించాడు. ముఖ్యంగా లవ్ ఫ్లేవర్‌ను తెరపై ఆఘ్రాణించడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాడు. యుద్ధ సన్నివేశాలు, అదిరిపోయే సెట్టింగులు గుర్తుండవు. వాటి బదులు ప్రేమ రుచిని చూపడానికి ప్రయత్నించాడు. బాజీరావ్, మస్తానీల అవ్యాజ్యమైన ప్రేమతో ప్రేక్షకుల గుండెలు పిండే ప్రయత్నం చేశారు.
నటీనటుల్లో రణ్‌వీర్‌సింగ్ ఎక్కడా కనపడడు, అతని పాత్ర తప్ప. అదేవిధంగా మస్తానీగా దీపిక, కాశీభాయ్‌గా ప్రియాంక పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా కంటిచూపులతో, బాడీ లాంగ్వేజ్‌తో తన్వీ అజ్మీ పాత్రను పండించింది. మామిడిపండు పండ్లలో రాజే. కానీ మామిడిచెట్టుకు దెబ్బలు తగలడం సహజం. అవన్నీ భరించాల్సింది రాజే. మతం రంగు పులుముకుందే కానీ, రంగుకు మతం లేదు. రావుగారికి నీ అవసరం వుంది. వారి అవసరం మాకుంది. ప్రేమ భగవంతుడితో సమానం. ఆ భగవంతుడితోనే నేను ఉన్నాను లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. పాటలు హిందీకి అనువాదంలో తేలిపోయాయి. నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది. ఎడిటింగ్ మరికొంత చేయవచ్చు. కెమెరా పనితనానికి అవార్డులు వస్తాయేమో! ఇక దర్శకత్వ పరంగా శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్ని మోసినట్లు సంజయ్‌లీలా భన్సాలీ సినిమా అంతా తన విజన్‌తోనే చుట్టి, ఇలాంటి చిత్రాలు తాను తప్ప మరెవరూ తీయలేరు అన్నట్లే సవాల్ విసిరాడు.

-సరయు