బిజినెస్

కాలుష్య రహిత జోన్‌గా కాకినాడ బీచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 12: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సాగర తీరాన్ని కాలుష్య రహిత జోన్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. 2017 సంక్రాంతి నాటికి బీచ్‌కు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నారు. పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా బీచ్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏటా జనవరిలో కాకినాడ బీచ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర స్థాయి పండుగగా నిర్వహిస్తున్నారు. ఈలోగా సాగర తీరాన్ని కాలుష్య రహిత జోన్‌గా ప్రకటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎగువ ప్రాంతాల నుండి సాగర తీరంలోకి కాలుష్య జలాలు, చెత్తాచెదారాలు రాకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛ్భారత్ స్ఫూర్తితో కార్పొరేట్ సంస్థలు, కోస్ట్‌గార్డు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ఇందుకు కృషిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడ బీచ్‌కు ఎన్టీఆర్ సాగర తీరంగా నామకరణం చేశారు. విశాఖలో ఎన్టీఆర్ పేరుతో నిర్మించిన వుడా పార్క్ తరహాలో కాకినాడ బీచ్‌ను జనవరి నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సూచించింది. నిధుల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహకరించడంతో ఈ బీచ్ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. సుమారు రూ. 40 కోట్లతో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అవసరమైన అన్ని రకాల హంగులతో సాగర తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు మెరుగులు దిద్దడంతో పాటు పర్యాటకులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత బీచ్ రిసార్ట్స్‌ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు బీచ్ ఫెస్టివల్ జరిగే కాకినాడ-ఉప్పాడ మార్గంలో సరికొత్త హంగులు కల్పిస్తారు. వాకలపూడి లైట్ హౌస్, హోప్ ఐలాండ్ తదితర ప్రాంతాల్లో అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో టూరిజం స్పాట్స్‌ను తీర్చిదిద్దనున్నారు.

ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభం రూ. 704 కోట్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 704.26 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో 560 కోట్ల రూపాయల లాభాన్ని బ్యాంక్ పొందగా, ఈసారి 26 శాతం వృద్ధిని సాధించింది. ఆదాయం ఈసారి 4,439.72 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,581.31 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.