బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 52.66 పాయింట్లు పడిపోయి 28,077.18 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.35 పాయింట్లు దిగజారి 8,693.05 వద్ద నిలిచింది. ఆసియా స్టాక్ మార్కెట్ల నుంచి వ్యక్తమైన మిశ్రమ స్పందన మధ్య అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. అయినప్పటికీ రియల్టీ, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినా.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడం విఫలం కావడంతో సూచీలకు నష్టాలు తప్పలేదు. మరోవైపు ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 403.58 పాయింట్లు, నిఫ్టీ 109.65 పాయింట్లు లాభపడ్డాయి. ఇకపోతే శుక్రవారం ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.04 శాతం నుంచి 0.12 శాతం వరకు పెరిగాయి.