బిజినెస్

మందకొడిగా మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 27: గత రెండు రోజులుగా నష్టాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా చాలావరకు మందకొడిగానే సాగాయి. అయితే కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలపై ఆశలు చిగురించిన నేపథ్యంలో చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో సెనె్సక్స్ ప్రారంభ నష్టాలను పూడ్చుకుని 79 పాయిట్ల స్వల్ప లాభంతో ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ ఎలాంటి మార్పూ లేకుండా ముగిసింది. అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల చివరి రోజున మదుపరులు కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ ఫలితాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండడం కూడా దీనికి దోహదపడింది. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ ఒక దశలో 27,958 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకినప్పటికీ చివరికి 79.39 పాయింట్ల లాభంతో 27,915.90 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 8,625-8550 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరికి ఎలాంటి మార్పూ లేకుండా 8,615.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, చమురు, గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్ల కారణంగా ఈ రికవరీ సాధ్యమయింది. మారుతీ సుజుకి, హీరో మోటోకార్ప్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు మించి ఉన్నప్పటికీ ఆ రెండు కంపెనీల షేర్లు నష్టాల్లో ముగియడం గమనార్హం. మరోవైపు టాటా మోటార్స్, టాటా స్టీల్ సహా టాటా గ్రూపునకు చెందిన కంపెనీల షేర్లన్నీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. అయితే టిసిఎస్ షేరుమాత్రం స్వల్పంగా పెరిగింది. కాగా, ఐఐఎఫ్‌ఎల్ షేరు దాదాపు 8 శాతం పెరిగింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 13 షేర్లు లాభాలతో ముగియగా, 17 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. కాగా, ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలో నష్టాల్లో సాగాయి.