బిజినెస్

భారత పాడి పరిశ్రమకు బంగారు భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: భారత పాడి పరిశ్రమకు బంగారు భవిష్యత్తు ఉందని, సాలీనా 4 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తూ దూసుకుపోతున్నట్లు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ సంస్థ చైర్మన్ దిలీప్ రథ్ శుక్రవారం తెలిపారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ డెయిరీ ఫోరంలో భారత పాడి పరిశ్రమ అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. దేశీయంగా పాడి పరిశ్రమపై రైతులకు పట్టు ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమకు మంచి పునాది, విస్తారమైన మార్కెట్, చిన్న రైతులు ఈ పరిశ్రమలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ రంగం అభివృద్ధిని సాధిస్తోందన్నారు. గత 15 సంవత్సరాలుగా నిలకడతో కూడిన అభివృద్ధిని ఈ రంగం సాధించిందని గుర్తుచేశారు. 2030 నాటికి పాడి పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఐక్యరాజ్యసమితి ఖరార చేసిన మార్గదర్శకాల్లో భారత్ భాగస్వామ్యం ఉందన్నారు. సామాజిక, ఆర్థిక, పర్యావరణ, జీవనాధారంగా పాడి పరిశ్రమకు దేశంలో మంచి ఆదరణ అన్ని వర్గాల్లో ఉందన్నారు.

మిస్ర్తికే మా మద్దతు!

సంస్థ చైర్మన్‌గా ఆమోదిస్తూ
ఐహెచ్‌సిఎల్ డైరెక్టర్ల ఏకగ్రీవ నిర్ణయం

ముంబయి, నవంబర్ 4: టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్ర్తికి టాటా గ్రూప్‌లోని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మద్దతు లభించింది. శుక్రవారం ఇక్కడ బాంబే హౌస్ వద్ద జరిగిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ సమావేశంలో సంస్థ చైర్మన్‌గా మిస్ర్తిని బలపరుస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి మిస్ర్తి కూడా హాజరవగా, ఆయన నాయకత్వంపై డైరెక్టర్లు విశ్వాసం కనబరిచారు. అంతకుముందు ఐహెచ్‌సిఎల్ స్వతంత్ర డైరెక్టర్లూ మిస్ర్తి నాయకత్వానికి మద్దతు పలికారు. వీరిలో బ్యాంకర్ దీపక్ పరేఖ్‌తోపాటు నదీర్ గోద్రెజ్ కూడా ఉన్నారు. గత వారం ఆశ్చర్యకరంగా టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి మిస్ర్తిని తొలగించగా, తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియమితులైనది తెలిసిందే. నాలుగు నెలల్లో కొత్త చైర్మన్‌ను నియమిస్తామని టాటా సన్స్ ప్రకటించగా, రతన్ టాటా-సైరస్ మిస్ర్తి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదిలావుంటే ఈ సమావేశం సందర్భంగా టాటా భద్రతా సిబ్బం ది జర్నలిస్టులపట్ల దురుసుగా ప్రవర్తించారు.
తగ్గిన ఐహెచ్‌సిఎల్ నష్టాలు
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ఐహెచ్‌సిఎల్ నష్టాలు తగ్గుముఖం పట్టాయి. ఈసారి ఏకీకృత నష్టం 26.76 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 151.96 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం గతంతో పోల్చితే 894.37 కోట్ల రూపాయల నుంచి 884.95 కోట్ల రూపాయలకు దిగివచ్చింది.
శుక్రవారం
ఐహెచ్‌సిఎల్ బోర్డు సమావేశానికి హాజరైన సైరస్ మిస్ర్తి