రివ్యూ

‘విత్తనం’ పడింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** నరుడా డోనరుడా
**
తారాగణం:
సుమంత్, పల్లవి సుభాష్,
తనికెళ్ల భరణి,
సంగీతం:
శ్రీచరణ్ పాకల
నిర్మాతలు:
వై సుప్రియ, జాన్ సుధీర్
దర్శకత్వం:
మల్లిక్‌రామ్
**
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్‌కు కెరీర్‌పరంగా హిట్ పర్సెంట్ తక్కువ. సత్యం సినిమా తప్ప చెప్పుకోడానికి కమర్షియల్ హిట్టు ఒక్కటీ లేదు. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ అన్న ఆశతో ఏడాదిన్నర క్రితం చేసిన సినిమా, కనీసం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోవడంతో మళ్లీ సినిమా చేయడానికి చాలా గ్యాప్ వచ్చేసింది. స్ట్రెయిట్ స్టోరీలు కలిసిరాకపోవడంతో, ఈసారి రీమేక్‌ను నమ్ముకుని ‘నరుడా డోనరుడా’ అంటూ స్క్రీన్స్‌కు వచ్చాడు సుమంత్. కొత్త దర్శకుడు మల్లిక్‌రామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘విక్కీ డోనర్’కు రీమేక్.
***
విక్కీ (సుమంత్) పనీపాటా లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. మధ్యతరగతి కుటుంబీకుడైన విక్కీకి, ఇన్‌ఫెర్టిలిటీకి సంబంధించిన వైద్యుడు ఆంజనేయులు (తనికెళ్ళ భరణి)తో పరిచయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వీర్యకణాలు దానం చేయమని విక్కీని ఆంజనేయుడు కోరతాడు. విక్కీ కుటుంబ నేపథ్యాన్ని బట్టిచూస్తే, అతడి వీర్యకణాలు శక్తివంతమైనవని గ్రహించి విక్కీని ఈ పనికి ఒప్పిస్తాడు. వీర్యదానానే్న తన పనిగా మార్చుకొని విక్కీ బాగా సంపాదించడమేకాక, ఆషిమా (పల్లవి సుభాష్)తో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటాడు. తనకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న ఆషీమా, విక్కీ చేసే పనిగురించి తెలుసుకుంటుంది. ఇలాంటి పనిచేసే వాడితో ఎలా ఉండాలంటూ విక్కీని అసహ్యించుకుని అతని నుంచి విడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? విక్కీ ఎంచుకున్న మార్గం ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? చివరకు వీరిద్దరు ఒక్కటయ్యారా? అన్నది అసలు సినిమా.
మాతృక కథ వైవిధ్యమైనది కావడం -ఈ సినిమాకు ప్లస్ పాయింట్. వీర్యకణాలు అమ్ముకునే కుర్రాడిని భార్య, మిగతా ప్రపంచం ఎలా చూస్తుందన్న కోణంలో కథ చెప్పడం బాగుంది. కథామూలాన్ని కామెడీగా చెప్పే అవకాశంవున్న పాయింట్ కావడంతో, ఫస్ట్ఫాను బాగానే లాగేశారు. ప్రధాన పాత్రలన్నింటి బ్యాక్‌స్టోరీగా చెప్పిన స్టయిల్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఎమోషనల్‌గా సాగే క్లైమాక్స్ సినిమాకు బలాన్నిచ్చింది. తన నటనా అనుభవంతో తనికెళ్ళ భరణి సినిమాకు మూలస్తంభంగా నిలిచాడు. బలమైన పాత్రలో తనదైన టైమింగ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సుమంత్‌తో విత్తనం అనే డైలాగ్ వచ్చినప్పుడల్లా తనికెళ్ళ భరణి టైమింగ్ నవ్వు తెప్పించింది. హీరో సుమంత్ పరిధిమేరకు ఓకే అనిపించాడు. నటి శ్రీలక్ష్మి చాలారోజుల తర్వాత మంచి పాత్రలో స్థాయికి తగిన నటన ప్రదర్శించారు. దర్శకుడు మల్లిక్‌రామ్ చేసిన మంచి పని -బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన విక్కీ డోనార్ కథను ఏమాత్రం మార్చకుండా రీమేక్ చేయటం. కథకు ప్రాణమైన ఎమోషన్ సన్నివేశాలను బలంగా ప్రజెంట్ చేయటంలో తడబాటు కనిపించింది. ఫస్ట్ఫా వరకూ కథను నడిపించేసినా, సెకండాఫ్‌లో కథను రక్తికట్టించలేకపోయాడు. వైవిధ్యమైన కథను ఆ స్థాయికి తగిన సినిమాగా మలచటంలో దర్శకుడు విఫలమయ్యాడు. పాటలు ఆకట్టుకోలేదు. సంభాషణలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ విలువలకు తగినట్టు ఎడిటింగ్ లేదు.
రక్తదానం, అవయవదానాన్ని గొప్పగా భావించే జనం, వీర్యదానాన్ని మాత్రం బూతుపనిగా భావిస్తున్న అంశాన్ని తెలివిగా హ్యాండిల్ చేసి, వినోదాత్మక చిత్రంగా విక్కీ డొనార్‌ను మలిచారు. సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేయాల్సిన కథని లౌడ్‌గా ప్రజెంట్ చేయడం రీమేక్‌లో కనిపించిన బలహీనత. హీరో హీరోయిన్ల మధ్య సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలన్నీ హడావుడిగా ముగించేసి అసలు ఎమోషన్‌ను దర్శకుడు వదిలేశాడు. హీరోయిన్ పల్లవి సుభాష్ తన పాత్రకు న్యాయం చేయలేకపోవడం కూడా మైనస్. ఒక్కముక్కలో చెప్పాలంటే.. కొత్తగా, కాస్త వింతగా, నవ్వించేలావున్న ‘విత్తనం’ మొలకెత్తడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

-త్రివేది