నెల్లూరు

సందేశాత్మకంగా సాగిన మార్పు (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపు ప్రచురించిన మార్పు కథ సందేశాత్మకంగా సాగింది. సమాజంలో ఒక సాధారణ కూలీ తన కుటుంబం కోసం పడే తపన, కష్టపడి పనిచేసే తత్వం, మంచితనంతో అందరిని కలుపుకుపోయే గుణం గల వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చాయి. చివరికి అతను ఎలాంటి జీవితం గడిపాడు అనే కోణంలో కథను అందించిన తీరు బాగుంది. చివరికి అతనికి తోటి కూలీలు సాయపడంతో పాటు వారిలో గొప్ప మార్పు రావడం కథలో కొసమెరుపు. నిజంగా మానవత్వం ఇంకా బతికుంది కాబట్టే సమాజంలో నిజాయితీపరులకు ఇంకా న్యాయం జరుగుతూ వుంది. కష్టాన్ని నమ్ముకున్న వాడిని ఎన్నటికీ అన్యాయం జరగదు అనే చెప్పేందుకు చక్కటి నిదర్శనం వీరభద్రయ్య కుటుంబం. గొప్ప కథను అందించిన రచయిత ఆడేరు చెంచయ్య గారికి అభినందనలు
- వసంతకుమారి, నెల్లూరు
- మల్లెల పుష్పవతి, శ్రీకాళహస్తి
- అల్లాడి శ్యామసుందర్, కోట

మంగళంపల్లికి కవితా నీరాజనం
గతవారం మెరుపులో గానగంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి కవితలతో నివాళి అర్పించిన కవులకు అభినందనలు. ఆ మహానుభావుని గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మంగళంపల్లి గురించి ఎంతో గొప్ప పదాలతో కవితను చక్కగా ఎస్‌వికె ప్రసాద్ గారు పొందుపర్చిన విధం బాగుంది. అలాగే హస్తిమోహన్‌రాజు, అల్లాడి వేణుగోపాల్ కవితలు కూడా మంగళంపల్లికి నివాళి అర్పించాయి. మంచి కవితలు అందించిన మన రచయితలకు మరోసారి కృతజ్ఞతలు.
- ప్రవళ్లిక, కందుకూరు
- శ్యామలాదేవి, ఒంగోలు
- మయూరి కృష్ణయ్య, గూడూరు
***
రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net