బిజినెస్

నష్టాలతో స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరానికి నష్టాలతో స్వాగతం పలికాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 31.01 పాయింట్లు కోల్పోయి 26,595.45 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.30 పాయింట్లు దిగజారి 8,179.50 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభం నుంచి నష్టాల్లోనే కదలాడిన సూచీలు.. చివరిదాకా అదే దారిలో పయనించాయి. అయితే ప్రారంభంలో సెనె్సక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోగా, ముగింపు సమయానికి ఈ నష్టాలు చాలావరకు తగ్గాయి. ఇదే కాస్త మార్కెట్ వర్గాలకు ఊరటనివ్వగా, సోమవారం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రియల్టీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గత వారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసి 2016కు ఘనమైన వీడ్కోలు పలికినది తెలిసిందే.