బిజినెస్
సహకార బ్యాంకుల్లో మనీ లాండరింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 January 2017
న్యూఢిల్లీ, జనవరి 9: పాత పెద్ద నోట్ల రద్దును సహకార బ్యాంకులు మనీ లాండరింగ్‌కు చక్కని అవకాశంగా మార్చుకున్నాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. నోట్ల రద్దు నేపథ్యంలో కోట్లాది రూపాయల మనీ లాండరింగ్‌కు సహకార బ్యాంకులు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము తయారుచేసిన ఓ విశే్లషణాత్మక నివేదికలో దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో అక్రమాలు జరిగినట్లు తేలినట్లు చెప్పింది. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ సహకార బ్యాంకు డైరెక్టర్లు 8 కోట్ల రూపాయల మోసానికి తెగబడ్డారని ఐటి శాఖ విచారణలో తేలింది. మొత్తానికి సహకార బ్యాంకుల అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది.