బిజినెస్

విజయ్ మాల్యాపై సెబీ నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: విజయ్ మాల్యాపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం కొరడా ఝుళిపించింది. సెక్యురిటీస్ మార్కెట్ల నుంచి నిషేధించింది. మరో ఆరుగురిపైనా వేటు వేసింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసుతో సెబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు, అమ్మకాలు, సెక్యూరిటీస్‌లో ఇతరత్రా ఏ లావాదేవీలనైనాసరే ప్రత్యక్షంగా, పరోక్షంగా జరపరాదంటూ మాల్యాతోపాటు అశోక్ కపూర్, పిఎ మురళి, స్వామీయనారాయణ్, ఎస్‌ఎన్ ప్రసాద్, పరంజీత్ సింగ్ గిల్, ఐనపూర్ ఎస్‌ఆర్‌లను ఆదేశించింది.

ఫిన్‌టెక్ స్టార్టప్‌లకోసం ఏపి నిధి
ముంబయి, జనవరి 25: ఉద్యోగ కల్పనకు విశ్వసనీయమైన రంగంగా ఫిన్‌టెక్‌ను గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రంగంలో కోట్లాది రూపాయల పెట్టుబడులను పెడుతోంది. ఈ క్రమంలోనే 100 కోట్ల రూపాయల నిధిని బుధవారం ప్రకటించింది. ఈ నిధి ఫిన్‌టెక్ స్టార్టప్‌ల వృద్ధికి దోహదపడగలదని ఏపి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జెఎ చౌధరి ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఈ నిధిలో భాగస్వామి కావాలంటూ కేంద్రాన్ని కూడా ఏపి కోరుతోంది. విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీలో ఫిన్‌టెక్ కార్యకలాపాలకు ఈ నిధి ఊతమివ్వగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.