యువ
మసాజ్ చేసే ఛైర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 March 2017
ఇష్టపడి పని చేస్తే, ఏదీ కష్టం కాదు. ఆఫీసు పనైనా అంతే. అయితే ఎంత ఇష్టమైనా, గంటల తరబడి పనిచేస్తూ ఉంటే, అలసట తప్పదు. ఆరోగ్యపరమైన సమస్యలూ తలెత్తుతాయి. కాబట్టి మధ్యలో కాస్త రిలాక్సేషన్ అవసరమే. ఇలాంటి ఉద్యోగులకోసం ప్రత్యేకంగా రూపొందిన ఓ ఆఫీస్ చైర్ మార్కెట్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. చూడటానికి అచ్చం ఆఫీస్ చైర్లానే ఉన్నా, ఇదొక మస్సాజ్ చైర్. పేరు ఎగ్జిక్యూటివ్ ఎర్గోనమిక్ హీటెడ్ వైబ్రేటింగ్ చెయిర్. ఇందులోంచి వెలువడే వైబ్రేషన్స్... శరీరాన్ని మస్సాజ్ చేస్తాయి. ఈ కుర్చీతోపాటు లభించే రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగించి, శరీరంలో ఏ భాగానికి కావాలంటే ఆ భాగానికి మస్సాజ్ చేసుకోవచ్చు. సీటు ఎత్తును పెంచుకునే, లేదా తగ్గించుకునే సౌలభ్యం కూడా ఉంది.