S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్ పాదయాత్రకు స్పందన కరవు

రాజమహేంద్రవరం, నవంబర్ 19: వైఎస్సార్‌సిపి అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఆపార్టీ పరిస్థితి, జగన్ వైఖరి చూసి పార్టీ శ్రేణులు క్రమంగా జారిపోతున్నాయన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక 42వ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్‌లో జరిగింది. ఈసందర్భంగా గుడా చైర్మన్ గన్ని కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో, అనంతరం విలేఖర్లతో నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పాదయాత్రలో ప్రతిపక్షనేత జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు.

విజయవంతంగా గొంతు నుండి ఇనుప ఊచ తొలగింపు

కాకినాడ సిటీ, నవంబర్ 19: ప్రమాదవశాత్తు గొంతు నుండి మెడ వెనుకకు ఇనుప ఊచ దూసుకుపోయి తీవ్రంగా గాయపడిన ఓ ఆటో డ్రైవర్‌కు కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు శస్తచ్రికిత్స చేసి విజయవంతంగా ఇనుప ఊచను తొలగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వైద్యులు బాధితుడికి శస్తచ్రికిత్స నిర్వహించి ఇనుప ఊచను తొలగించి అతని ప్రాణాలను రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

చిరుత కాదు...హైనా !

జీలుగుమిల్లి, నవంబర్ 19: మండలంలోని కామయ్యపాలెం ప్రాంతంలో సంచరించే అడవి జంతువు చిరుతపులి అయి ఉండదని, హైనా (కొండ్రమోతు) అయి ఉంటుందని రైతులు చెప్పారు. ఆదివారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన విలేఖరులతో బాధిత రైతు శిరిబత్తుల దుర్గారావు మాట్లాడుతూ లేగదూడపై దాడిచేసిన జంతువు చిరుతపులి కాకపోవచ్చన్నారు. నాలుగు రోజులుగా అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అడవి జంతువు పాద ముద్రలు చూశామని, అయితే ఆ పాదముద్రలపై తాము అనుమానించకపోవడంతో శనివారం తెల్లవారు ఝామున అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మామిడితోటలో తన పశువులపై దాడిచేసిందన్నారు. తన లేగదూడను చంపిందన్నారు.

పేదల కోసం 5.39 లక్షల గృహాలు

ఏలూరు, నవంబర్ 19 : రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 5.39 లక్షల గృహాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. స్థానిక ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 లక్షల మంది పేద ప్రజలు సొంత ఇళ్లు కావాలని దరఖాస్తు చేశారని, వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించి పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని తీసుకుంటామని చెప్పారు.

ఇందిర ఆశయ సాధనకు కృషిచేయాలి

దేవరపల్లి, నవంబర్ 19: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ అని, ఆమె ఆశయ సాధనకు యువత కృషిచేయాలని డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీయుల్లాబేగ్ పేర్కొన్నారు. దేవరపల్లిలో ఆదివారం ఇందిరా శత జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెలగా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ఇందిరా దేశ ప్రజలతో మమేకమై సమర్థవంతమైన పాలన అందించారన్నారు. స్థానిక యాదవోలు రోడ్డులో ఉన్న ఇందిరా విగ్రహానికి పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. అలాగే గొల్లగూడెంలోని భారతీయ వికలాంగుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు, రొట్టెలు అందజేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి

ఏలూరు, నవంబర్ 19 : ప్రధాని మోడీ, ఎపి సి ఎం చంద్రబాబులు అనుసరిస్తున్న విధానాల వలన ప్రజల్లో రోజురోజుకూ ప్రభుత్వాలపై అసంతృప్తి పెరుగుతోందని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిపి ఎం శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శనివారపుపేటలోని సారధి గార్డెన్స్‌లో సిపి ఎం 24వ జిల్లా మహాసభలు 2వ రోజు ముఖ్య అతిధిగా మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశ రాజకీయాల్లో సరళీకరణ విధానాలకు ప్రతిఘటన మొదలైందన్నారు. ఉద్యమాలకు ఇది అనుకూలమైన సమయమని చెప్పారు.

68.69 కోట్లతో పాలకొల్లులో అభివృద్ధి పనులు

పాలకొల్లు, నవంబర్ 19: పాలకొల్లులో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి కోసం రూ. 68.69 కోట్లు మంజూరు చేస్తున్నట్టు పురపాలక శాఖా మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆదివారం స్థానిక ప్రధానమంత్రి ఆవాస యోజన, ఎన్టీఆర్ గృహ సముదాయ నిర్మాణ పనులు పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మట్లాడారు. స్థానిక యడ్ల బజారులో డంపింగు యార్డు తొలగింపునకు కోటి రూపాయలు కోరారని, ఇక్కడే దానిని మంజూరు చేస్తున్నానని ఆయన వెల్లడించారు.

పేదలకు అత్యంత నాణ్యమైన గృహాలు

తాడేపల్లిగూడెం, నవంబర్ 19: రాష్ట్రంలో పేదలకు అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వౌలిక వసతులతో నాణ్యమైన గృహాలను నిర్మిస్తున్నామని రాష్టప్రురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఎల్ అగ్రహారం అర్బన్ హౌసింగ్ స్కీమ్‌లో ఎల్‌అండ్‌టి కంపెనీ నిర్మిస్తున్న జి ప్లస్-2 గృహాలను ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సభకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేదలకు నాణ్యమైన గృహాలు అందించేందుకు ఖర్చుకు వెనకాడవద్దన్నారన్నారు.

ఇందిర త్యాగనిరతి అనితర సాధ్యం

సంగారెడ్డి టౌన్, నవంబర్ 19: బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడి, దేశం కోసం తన ప్రాణాలనే ఆర్పించిన మహనీయురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ఐబి అతిధి గృహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఐబి ముందుగల ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

50 ఏళ్ల రైల్వే స్వప్నం.. త్వరలో సాకారం

సిద్దిపేట టౌన్, నవంబర్ 19: గోదావరి నీళ్లు వస్తే రైతుల కష్టాలు తీరుతాయని, బావులు, బోర్లు ఎండవు..పంటలు సమృద్దిగా పండుతాయన్నారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చి అభివృద్థికి సహకరిస్తున్న రైతులందరికీ కృతజ్ఞతలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైల్వేలైన్ నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములకు పరిహారం చెక్కులు అందించారు.

Pages