S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజా ఫిర్యాదులు వినరాదు

న్యూఢిల్లీ, జనవరి 15: ఎన్నికలు ముగిసే దాకా అయిదు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులు, చట్టబద్ధ సంస్థల్లో నియమించబడిన రాజకీయ నాయకులు జనం దాఖలు చేసే ఫిర్యాదులను వినకూడదు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలు ఓటర్లపై నేరుగా ప్రభావం చూపిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

పెండింగ్‌లో 2.81 కోట్ల కేసులు

న్యూఢిల్లీ, జనవరి 15: దేశ వ్యాప్తంగా దిగువ స్థాయి కోర్టుల్లో దాదాపు 2.8 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ కోర్టుల్లో దాదాపు 5 వేల న్యాయధికారుల పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు దిగువ స్థాయి కోర్టుల్లో మున్ముందు దాదాపు మరో 15 వేల మంది న్యాయమూర్తులను నియమించి సిబ్బంది సంఖ్యను కనీసం ఏడు రెట్లు పెంచాలని రెండు నివేదికలు సుప్రీం కోర్టుకు సూచించాయి. ఈ రెండు నివేదికల్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన సూచనలతోపాటు తీవ్రమైన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు విడుదల చేసింది.

‘రోహిత్ చట్టం’ తేవాల్సిందే

విజయవాడ, జనవరి 15: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కులవివక్షకు, చిత్రహింసలకు, వెలివేతకు గురై తీవ్ర మనస్థాపంతో బలవన్మరణం చెందిన వేముల రోహిత్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 17న సెంట్రల్ వర్సిటీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా సంస్మరణ సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని అంబేద్కర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి ప్రభాకర్, అధికార ప్రతినిధి దాసరి కిరణ్, ఇతర నాయకులు వెల్లడించారు. ఆరోజునే అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోనే కాకుండా విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాలు, వామపక్ష భావజాల సంఘాలతో కలిసి ‘దళిత హక్కుల దినం’గా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

రేపు రోహిత్ ప్రథమ వర్ధంతి

హైదరాబాద్, జనవరి 15: ఈనెల 17న హెచ్‌సియూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ప్రథమ వర్ధంతిని నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు. హెచ్‌సియూలో గత సంవత్సరం 17వ తేదీన విద్యార్థి రోహిత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా విద్యార్థి రోహిత్ వర్ధంతి సందర్భంగా మంగళవారం హెచ్‌సియూ, ఓయూలో దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. రోహిత్ మృతికి కారకుడైన వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావును అరెస్టు చేసి, పదవి నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

జిఇఎస్‌తో శాఖల అనుసంధానం

హైదరాబాద్, జనవరి 15: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తూ కొత్తగా రాష్ట్ర జియోగ్రాఫిక్ ఇన్ఫ్‌ర్‌మేషన్ సిస్టమ్ (జిఐఎస్)ను ఆవిష్కరించేందుకు సన్నాహాలుచేస్తోంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ బృహత్తర ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుకు సమాచార టెక్నాలజీ శాఖ సాంకేతిక సహాయాన్ని అందించనుంది.

లక్షా 70వేలకు పెరిగిన హజ్ కోటా

హైదరాబాద్, జనవరి 15: హజ్ యాత్రీకుల తెలంగాణ కోటా ఈసారి పెరిగినట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. గత సంవత్సరం హజ్ యాత్రీకుల కోటా లక్షా 36వేలు కాగా, ఈసారి లక్షా 70వేలకు పెరిగినట్టు చెప్పారు. లక్షా 70వేల నుంచి రెండు లక్షల కు పెంచాలని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీని కోరినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి హజ్ యాత్రీకుల సౌకర్యం కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా మక్కాలోని హువాత్ అనే ప్రాంతంలో తెలంగాణ నుండి వెళ్లిన ఆరువందలమంది హజ్ యాత్రీకులకు ఉచిత భోజన, ఉచిత వసతి కల్పించినట్టు చెప్పారు.

గో ఆధారిత సేద్యాన్ని పాటించడం రైతుల ధర్మం

హైదరాబాద్, జనవరి 15: గోసంపదను పెంచుకోవడం, గో ఆధారిత సేద్యాన్ని పాటించి తన ధర్మాలను రైతు నిర్వహించాలని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. ‘ఆవులు-ఎడ్లు-సుళ్లు’ పుస్తకాన్ని పరిపూర్ణానందస్వామి ఈ రోజు శ్రీపీఠంలో ఆవిష్కరించారు.

హెచ్‌సిఎ ఎన్నికల్లో అజర్‌కు చుక్కెదురు

హైదరాబాద్, జనవరి 15: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించి, నామినేషన్ దాఖలు చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్‌కు చుక్కెదురైంది. అజర్ దాఖలు చేసిన నామినేషన్‌ను హెచ్‌సిఎ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నెల 17న హెచ్‌సిఎకు ఎన్నికలు జరగనున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజర్‌పై 2000 సంవత్సరంలో బిసిసిఐ జీవిత కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 12 సంవత్సరాల క్రితం ఏపి హైకోర్టు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ అజర్‌ను నిర్దోషిగా తేల్చింది.

జాతీయవాదంపై పుస్తకం

న్యూఢిల్లీ, జనవరి 15: జాతీయవాదం అనే పదానికి ప్రస్తుతమున్న నిర్వచనానికి సరికొత్త భాష్యం చెప్పేందుకు ప్రయత్నాలను ప్రారంభించిన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) అధ్యాపకులు, ‘దేశం నిజంగా తెలుసుకోవాల్సింది ఏమిటి?’ (వాట్ ది నేషన్ రియల్లీ నీడ్స్ టు నో) అనే పేరుతో ఒక పుస్తకాన్ని రూపొందించారు. జాతీయ వాదంపై గత ఏడాది ఆ వర్శిటీ అధ్యాపకుల సంఘం (జెఎన్‌యుటిఎ) నెల రోజుల పాటు ప్రసంగ కార్యక్రమాలను నిర్వహించింది.

సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో జిఎం ఆకస్మిక తనిఖీ

సికిందరాబాద్, జనవరి 15: ప్రయాణికుల భద్రతతోపాటు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సికిందరాబాద్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్యనే జిఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అధికారుల నుంచి ముందుగా వివరాలు తెలుసుకొని, అనంతరం స్టేషన్‌కు తనిఖీలకు వెళ్లారు. ప్లాట్‌ఫారం నెంబర్ 1లోని క్యాటరింగ్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ప్రయాణికులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతలో లోపం ఉండరాదని సూచించారు.

Pages