S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరోనా కట్టడిపై దృష్టి

ఉప్పల్, ఏప్రిల్ 13: అమెరికా యూఎస్‌ఏ నుంచి వచ్చిన హబ్సిగూడ కాకతీయనగర్ స్ట్రీట్ నెంబర్ 3లో నివసిస్తున్న ఓ యువతికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె తల్లిదండ్రులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో క్వారంటైన్‌లో ఉన్నారు.

అధైర్య పడవద్దు ధాన్యం కొనుగోలు చేస్తాం

మేడ్చల్, ఏప్రిల్ 13: రైతులు అధైర్య పడవద్దని ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని పూడూరు, మేడ్చల్ పీఏసీఎస్ కార్యాలయాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

వికారాబాద్: అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప జనం బయటకు రావద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యవసర వస్తువులను ప్రజల ఇళ్ల వద్దకే పంపే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణను ఆదేశించారు.

లక్ష కుటుంబాలకు ఉప్పల చేయూత

తలకొండపల్లి, ఏప్రిల్ 13: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ చేయూత ఇస్తున్నారు.ఆమనగల్లు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల పేదలకు సుమారు 25 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టి ఇంటికో శానిటైజర్ పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాలలో ప్రతి కుటుంబానికి శానిటైజర్ అందించారు. తలకొండపల్లి మండల కేంద్రంలో మాత్రం 32 గ్రామ పంచాయతీలతో పాటు మారుమూల ప్రాంతాలైన పల్లెలు గిరిజన తండాలతో కలుపుకొని సుమారు 100కుపైగా పిచికారి మందులు చేయించారు.

అధిక ధరలపై ఫిర్యాదు

కొందుర్గు, ఏప్రిల్ 13: అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో కిరాణాషాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు కొందుర్గు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని మహాదేవ్‌పూర్ గ్రామంలో ఓ కిరాణాషాపు యజమాని అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ వివరించారు.

ఇద్దరికి కరోనా పాజిటివ్‌తో కలకలం

షాద్‌నగర్, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో కలకలం రేపుతుంది. తాజాగా 65 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్ ధ్రువీకరించారు. చేగూర్ గ్రామానికి చెందిన మహిళ(55) ఏప్రిల్ 1న హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించి 2వ తేదీ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. 3న మరణించిన మహిళకు కరోనా పాజిటివ్ రిపోర్టు వెలుగు చూసింది.

ఇద్దరు యువతుల ఆత్మహత్య

శామీర్‌పేట, మార్చి 13: జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డు ప్రాంతంలో ఇద్దరు యువతులు అనుమానస్పదంగా మృతిచెందారు. కుషాయిగుడ ఏసీపీ శివ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు తమ భర్తలతో గొడవ పడి శామీర్‌పేట మీదుగా స్థానికంగా తెలిసిన పాస్టర్ సహాయంతో ఇక్కడికి వచ్చారు. పాస్టర్ ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డు గేటు ముందు సర్వే నెంబర్ 68లో ఓ చెట్టుకు ఇద్దరు యువతులు ఉరి వేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చింది.

తాండూరులో కరోనా పాజిటివ్ కేసు

తాండూరు, ఏప్రిల్ 13: పట్టణంలో కరోన పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళకు వైరస్ సోకినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, పట్టణ సీఐ రవి కుమార్ తెలిపారు. మహిళను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాజీవ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ప్రజల కదలికలను డ్రోన్‌తో పర్యవేక్షిస్తామని నిత్యావసర వస్తువులను అధికారులు సరఫరా చేస్తారని సీఐ జలందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధం

శంకర్‌పల్లి నుంచి దేవరకొండ వరకు

కేశంపేట, ఏప్రిల్ 13: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో శంకర్‌పల్లి నుంచి దేవరకొండకు కాలినడకన వెళ్తున్నారు. ఆరు కుటుంబాలు వెళ్తుండగా కేశంపేటలో ఎస్‌ఐ కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలను తెలుసుకున్నారు. 170 కిలోమీటర్లు కాలినడకన వెళ్లడం కుదరదని, స్థానికంగా నివాసం కల్పిస్తామని చెప్పారు. భోజన వసతిని సర్పంచ్ తలసాని వెంకట రెడ్డి కల్పించారు.
స్వీయ సంరక్షణతోనే నియంత్రణ

చెరువు సుందరీకరణ పనులు వేగవంతం

కుషాయిగూడ, ఏప్రిల్ 13: కాప్రా చెరువు సుందరీకరణ పనులను వెంటనే చేపట్టాలని మున్సిపాల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. కాప్రా చెరువును అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ సూపరింటెండెంట్ పరంజ్యోతి, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డితో కలసి పరిశీలించారు. చెరువు సుందరీకరణ ఆభివృద్ధి పనులను చేపట్టాలని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఉప కమిషనర్ శైలజను ఆదేశించారు.

Pages