S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

11/01/2017 - 21:52

హైదరాబాద్ గగనతలం హాలాహలాన్ని కక్కుతోందన్నది ఆశ్చర్యకరం కాదు. ఢిల్లీ మహానగరం కాలుష్య మండలంగా మారి ఉండడం విస్మయకరం కాదు. ఈ ధ్రువీకరణలు మళ్లీ మళ్లీ జరుగుతుండడం దశాబ్దుల వైపరీత్యం! ఈ వైపరీత్యం మొత్తం ప్రపంచాన్ని ఆవహించి ఉంది! దశాబ్దుల తరబడి మానవులు ప్రకృతిని గాయపరుస్తున్నారు. గాయపడిన ప్రకృతి మాత కాలుష్యపు కన్నీళ్లను కార్చుతోంది. విష వాయువులను నిశ్వసిస్తోంది..

11/01/2017 - 00:46

అంతర్జాతీయ జల వివాద న్యాయ మండలిలో చైనాకు వ్యతిరేకంగా ఇప్పుడైనా మన ప్రభుత్వం అభియోగం దాఖలు చేయాలి! బ్రహ్మపుత్ర నదీ జలాలను మనకు దక్కకుండా ‘జుర్రేయడానికి’ చైనా ప్రభుత్వం పదేళ్లకు పైగా బహిరంగంగాను రహస్యంగాను కుట్రను కొనసాగిస్తోంది!

10/30/2017 - 22:11

అందరూ ఛీ కొడుతున్నారు.. చివరికి ఆయన సొంత పార్టీ వారు సైతం పళనియప్పన్ చిదంబరం మాటను తప్పుపట్టారు! ఇలా ఛీ కొట్టించుకున్న చిదంబరం గతంలో, మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ మంత్రివర్గంలో దేశ వ్యవహారాల మంత్రి, ఆర్థికమంత్రి!

10/30/2017 - 00:37

జాతీయతకు ఒక భాషకాని ఒకే భాషకాని ప్రాతిపదిక కాజాలదు. కృతకమైన ‘్భషా జాతుల సిద్ధాంతం’ ఐరోపాలో మరోసారి విచ్ఛిన్న తత్వాన్ని విజృంభింపచేస్తోంది. ‘స్పెయిన్’లోని ఒక ప్రాంతమైన ‘కాటలోనియా’ శుక్రవారం ‘‘స్వతంత్ర దేశంగా ఏర్పడడం’’ ‘్భషాజాతుల’ కృత్రిమ సిద్ధాంతం బలం పుంజుకొంటోందనడానికి మరో నిదర్శనం! వివిధ భాషా జన సముదాయాలు ఒకే దేశంలో ఒకే జాతిగా జీవించడం మన దేశంలో అనాది చరిత్ర!

10/28/2017 - 00:39

ఆధార్ పత్రం లేదన్న ‘సాకు’తో అన్నార్తులకు ‘ఆహార భద్రతా పథకాల’ ప్రయోజనాలను నిరాకరించరాదన్నది కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన మార్గదర్శక సూత్రం! ‘ప్రభుత్వ సహాయం’ పొందడానికి ‘ఆధార్’ గుర్తింపు పత్రం అనివార్యమైన నిబంధనను అమలు జరుపడంలో ‘విచక్షణ’ ‘మానవత్వం’ లోపించడం ఈ సరికొత్త మార్గదర్శక సూత్రాలకు నేపథ్యం! ‘ఆధార్ పత్రం’ పొందాలంటే వేలిముద్రలు అవసరం... కానీ వేళ్లులేని వారికి ‘ముద్రలు’ ఎలా సాధ్యం!

10/27/2017 - 00:15

అంతర్జాతీయ సమాజంలో అమెరికా ప్రాధాన్యం తగ్గుతుండటం అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ బుధవారం ఢిల్లీలో జరిపిన చర్చలకు నేపథ్యం... తూర్పు ఆసియా, ప్రశాంత సాగర ప్రాంతంలో మనదేశం ప్రాధాన్యం పెరుగుతుండడం ఈ చర్చలకు మరో నేపథ్యం. చైనా వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి సమైక్యం అవుతున్న తూర్పు ఆసియా దేశాలు మన దేశంతో జట్టుకడుతున్నాయి.

10/25/2017 - 21:52

మన దేశం నుంచి లక్షల ఆవులు, పాడి పశువులు బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా అవుతుండడం ప్రచారానికి నోచుకోని వైపరీత్యం... ప్రచారం లేదు కాబట్టి జనానికి ఈ విషయమై ధ్యాస కూడ లేదు. ప్రభుత్వాలకే ధ్యాస లేదు మరి! కేవలం మూడేళ్ల కాల వ్యవధిలో దాదాపు ఐదు లక్షల ముప్పయి వేల పాడి పశువులను ‘సరిహద్దు భద్రతా దళం’ స్వాధీనం చేసుకుని తరలింపులను నిరోధించిందట!

10/24/2017 - 23:01

చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ‘టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమం’ ఉద్ధృతవౌతుండడం నడుస్తున్న చరిత్ర. మన దేశంలోను ఇతర దేశాలలోను నివసిస్తున్న వేలాది టిబెట్ ఉద్యమకారులు ఇటీవల చైనా వ్యతిరేక ప్రదర్శనలు జరుపడం ఇందుకు మరో నిదర్శనం! చైనాలో ‘కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధుల మహా సమావేశం’ జరుగుతుండిన సమయంలో టిబెట్ ‘పౌరులు’ ఇలా నిరసనలు తెలపడం చల్లారని టిబెట్ స్వాతంత్య్ర సమర ‘జ్వాల’కు దర్పణం.

10/24/2017 - 01:00

జమ్ము కశ్మీర్‌లో నిరంతర చర్చ- సస్టైండ్ డయిలాగ్- జరుపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిని నియమించడం పట్ల విభిన్న వ్యాఖ్యలు వెలువడడం సహజం! ఎందుకంటే జమ్ము కశ్మీర్‌లో ‘చర్చల ప్రహసనం’ దశాబ్దులుగా కొనసాగుతోంది! కొత్తగా చర్చించదగిన ‘మహా విషయం’ ఏమిటన్నది వేచి చూడదగిన ఉత్కంఠ కారకం..

10/23/2017 - 00:27

స్వతంత్రం - అని అంటే సొంత పద్ధతి. ‘స్వతంత్ర’ జీవన పద్ధతికి సంబంధించినది ‘స్వాతంత్య్రం’! మన దేశం అనేక శతాబ్దుల పాటు ‘స్వాతంత్య్రానికి’ దూరం కావడం చరిత్ర. విదేశీయ దురాక్రమణ ‘పాలన’గా వ్యవస్థీకృతమై ఉండిన సమయంలో మన సొంత పద్ధతులన్నీ అడుగంటాయి, అటకెక్కాయి. ఇది సహజం!

Pages