S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/20/2017 - 01:12

పద్యం పరిమళించింది, ‘పదం’ కదం తొక్కింది, వాగ్గేయ వైభవం వెల్లివిరిసింది, నృత్యరీతుల మంజీర నాదాల మధురిమ మదిమదిలో మారుమోగింది, వైవిధ్య ప్రక్రియ సాహితీ సమారాధన తరతరాల రసాల రుచులను విందులు చేసింది! కోట్లమంది తెలుగుల గుండెల చప్పుడు ప్రగతి ప్రస్థాన పథంలో ధ్వనించింది, ఆద్యంతరహిత చరిత్ర గగనంలో ప్రతిధ్వనించింది.

12/19/2017 - 01:11

గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ‘భారతీయ జనతా పార్టీ’ ఓడిపోలేదు, కాంగ్రెస్ గెలవలేదు! సమాంతరంగా శాసనసభ ఎన్నికల సమరం జరిగిన హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడిపోయింది, భారతీ జనతా పార్టీ గెలిచింది. చిన్న రాష్టమ్రైన - లోక్‌సభలో నాలుగు స్థానాలున్న - హిమాచల్ ప్రదేశ్‌లో ‘భారతీయ జనతా పార్టీ గెలుపు’ సహజ పరిణామం! అందువల్ల అందరికీ ముందుగానే తెలిసిపోయిన వాస్తవం ఇది.

12/18/2017 - 00:45

ఆధార్ గుర్తింపు పత్రాల గురించి కొనసాగుతున్న గందరగోళానికి అసలు కారణాలు అంతుబట్టడం లేదు. ‘ఆధార్’ వ్యవస్థ ఉండాలా కొనసాగాలా అన్న విషయమై సర్వోన్నత న్యాయస్థానం నిర్థారించి ఉంది!

12/16/2017 - 00:34

అర్జెంటీనా రాజధాని బుయెనోస్ ఏరెస్‌లో జరిగిన ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ సభ్య దేశాల సమావేశం విఫలం కావడం విచిత్రం కాదు. ‘ప్రపంచీకరణ’ పేరుతో నడుస్తున్న వాణిజ్య ప్రహసనంలో నిహితమైన ఉన్న వైరుధ్యాలు ఇందుకు కారణం. అందువల్ల 2001 నాటి దోహా బృహత్ సమ్మేళనం తరువాత జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాలలో ‘ఏకాభిప్రాయం’ ఊరిస్తూనే ఉంది.

12/15/2017 - 01:12

తిరుగులేదు, విశ్వనరుడు నేను - అన్న మహాకవి గుఱ్ఱం జాషువా మాటకు మరో నిర్ధారణ ఇది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధులు భాగ్యనగరంలో సభలు తీరుతుండడం ఈ నిర్ధారణకు సరికొత్త చారిత్రక సాక్ష్యం. ఈ చరిత్ర రెండువేల ఏళ్లకు పైగా కొనసాగుతోంది. తెలుగువాడు విశ్వనరుడు, భరతమాత వజ్రాల బిడ్డడు.

12/13/2017 - 22:29

పార్లమెంటు సభ్యులకు శాసనసభ్యులకు వ్యతిరేకంగా దాఖలైన నేరపూరిత అభియోగాలను విచారించడానికి పనె్నండు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం న్యాయప్రక్రియ వేగవంతం కావడానికి దోహదం చేయగల పరిణామం! దేశమంతటా రాజకీయ నేరస్థుల సంఖ్య గత నాలుగు దశాబ్దులుగా పెరిగిపోతుండడం ఈ నిర్ణయానికి నేపథ్యం.

12/12/2017 - 23:36

మన ప్రభుత్వం రష్యా చైనా దేశాలతో కొత్త్ఢిల్లీలో సోమవారం జరిగిన త్రైపాక్షిక చర్చలకు ‘డోక్‌లా’ - డోక్‌లామ్ - మైదానంలో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం విచిత్రమైన నేపథ్యం. ‘డోక్ లా’ పచ్చిక మైదానం నుంచి చైనా దళాలు నిష్క్రమించినట్లు జరిగిన జరుగుతున్న ప్రచారంలోని డొల్లతనం ఈ తిష్ఠవల్ల తేటతెల్లమైపోయింది.

12/12/2017 - 00:57

నేపాల్ ‘పార్లమెంట్’ ఎన్నికలలో వామపక్షాల కూటమి విజయం సాధించడం ఈ ‘పొరుగు దేశం’లో సంభవించిన మరో భారత వ్యతిరేక పరిణామానికి చిహ్నం! ఇరవై రెండేళ్ల క్రితం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. ‘నేపాల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ - సిపిఎన్, యుఎమ్‌ఎల్ - పార్టీ వారు ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియను సమర్థించారు.

12/11/2017 - 01:53

జెరూసలెం నగరాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా ప్రభుత్వం గుర్తించడంపట్ల ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలో నిరసన ప్రదర్శనలు చెలరేగడం సహజం! ఎందుకంటే ఇరుగుపొరుగు దేశాలలో శరణార్థులుగా ఉన్న ‘‘పాలస్తీనా ముస్లింలు’ జెరూసలెం నగరంలోని తూర్పుభాగాన్ని ఏర్పడనున్న ‘స్వతంత్ర పాలస్తీనా’ దేశపు రాజధానిగా భావిస్తున్నారు! కానీ జెరూసలెం తమ రాజధాని అని ఇజ్రాయిల్ ప్రభుత్వం ముప్పయి ఏడేళ్ల క్రితం ప్రకటించింది!

12/09/2017 - 02:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీని అసభ్యమైన పదజాలంతో నిందించడం ద్వారా మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ మరోసారి ‘‘నోటిలో కాలేసుకున్నాడు..’’ చిన్నపిల్లలు నోట్లో వేలేసుకున్నా కాలేసుకున్నా ముద్దుగానే ఉంటుంది, అది బుద్ధిపూర్వకంకాదుకూడ. కానీ ఏండ్లు మీరి వయసు మళ్లిన మణిశంకర్ మాత్రం బుద్ధిపూర్వకంగానే కాలును నోట్లో పెట్టుకున్నాడు!

Pages