S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/04/2018 - 01:50

లండన్, జూన్ 3: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించేందుకు ఇంగ్లాండ్ జట్టు కసరత్తు ప్రారంభించింది. ఆటగాళ్ల కూర్పు, ప్రణాళికలు, వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నది. ఫ్రెండ్లీ మ్యాచ్‌లను ఆడుతూ, ఆటగాళ్ల ఫిట్నెస్‌పై అవగాహనకు వస్తున్నది. ప్రాక్టీస్ కోసం జరుగుతున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో భాగంగా నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించింది.

06/04/2018 - 01:49

సిడ్నీ, జూన్ 3: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో 38 ఏళ్ల టిమ్ కాహిల్‌కు చోటు దక్కింది. ఆసీస్ తరఫున అత్యధికంగా 50 అంతర్జాతీయ గోల్స్ సాధించిన కాహిల్ ఇప్పటి వరకూ మూడు వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడాడు. నాలుగోసారి ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్నాడు. రష్యాతో ఈనెల 14న జరిగే మ్యాచ్‌తో వరల్డ్ కప్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్న ఆస్ట్రేలియా జట్టును అధికారులు ఆదివారం ప్రకటించారు.

06/04/2018 - 01:47

ఫుట్‌బాల్‌కు విశేష ఆదరణ ఉన్న కోల్‌కతాలో ప్రపంచ కప్ సాకర్ ఫీవర్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఫుట్‌బాల్ అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో, బ్రెజిల్, అర్జెంటీనా జట్ల జెర్సీలను అమ్మకానికి ఉంచిన ఓ వ్యాపారి

06/04/2018 - 01:46

జొహానె్నస్‌బర్గ్, జూన్ 3: దక్షిణాఫ్రికా క్రికెటర్ కాగిసో రబదాకు ఆ దేశ ఉత్తమ క్రీడాకారుడి అవార్డు లభించింది. సీజన్ ప్రారంభం నుంచి 12 నెలల కాలంలో ఆటగాళ్ల ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని, ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రికెటర్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ సారి అవార్డు రబదాకు దక్కింది. అధికారులు నిర్ధారించిన 12 నెలల కాలంలో రబదా 12 టెస్టుల్లో 72 వికెట్లు పడగొట్టాడు.

06/04/2018 - 01:45

కౌలాలంపూర్, జూన్ 3: మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. మలేసియాతో జరిగిన మొదటి మ్యాచ్‌ని ఏకంగా 142 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ అజేయంగా 97 పరుగులు చేసి, భారత్ భారీ స్కోరుకు సహకరించింది. కాగా, మలేసియా బ్యాట్స్‌మన్‌లో ఆరుగురు డకౌట్‌కావడం ఆ జట్టు పరాజయానికి ప్రధాన కారణమైంది.

06/04/2018 - 01:43

లాంగ్ పాండ్‌లో జరిగిన నాస్కార్ ఎక్స్‌ఫినిటీ సిరీస్ ఆటో రేస్‌ను గెల్చుకొని, ట్రోఫీని అందుకున్న డ్రైవర్ కేల్ బచ్. అమెరికాకు చెందిన బచ్ నాస్కార్ రేసులో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. అదే దూకుడుతో అతను ఎక్స్‌ఫినిటీ టైటిల్‌ను కూడా సాధించాడు

06/04/2018 - 01:41

పారిస్, జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో మాడిసన్ కీస్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్న ఆమె నాలుగో రౌండ్‌లో మిహెలా బుజామెస్కూను 6-1, 6-4 తేడాతో సులభంగా ఓడించింది. మొదటి సెట్‌లో ఎలాంటి పోటీని ఇవ్వలేకపోయిన బుజామెస్కూ రెండో సెట్‌లో తీవ్రంగా పోరాడింది. కానీ, కీస్ దూకుడుకు కళ్లెం వేయలేకపోయింది.

06/04/2018 - 01:40

లీడ్స్, జూన్ 3: పాకిస్తాన్‌తో జరిగి న రెండవ, చివరి టెస్టును ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో గెల్చుకుంది. లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్టు లో తొమ్మిది వికెట్ల తేడాతో పరాజ యాన్ని ఎదుర్కొన్న ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఎదురుదాడికి దిగింది. అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని, మ్యాచ్‌ని మూడు రోజుల్లోనే ముగించింది.

06/03/2018 - 02:41

న్యూఢిల్లీ: ఇండోనేషియాలో ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించనున్న ఆసియా గేమ్స్‌కు భారత్ తరఫున అతిపెద్ద జంబో టీమ్ ప్రాతినిధ్యం వహించనుంది. ప్రాథమికంగా ఎంపికైన 2370 మంది జాబితాలో 900 మందితో కూడిన బృందం ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా పేర్కొన్నారు.

06/03/2018 - 01:54

లివర్‌పూల్, జూన్ 2: స్టార్ స్ట్రయికర్ నేమార్ ఫిట్నెస్‌పై ఆందోళన చెందుతున్న బ్రెజిల్ ఆదివారం క్రొయేషియాతో జరిగే ఒక స్నేహపూర్వక మ్యాచ్‌లో అతని బరిలోకి దించాలని యోచిస్తున్నది. 2014 వరల్డ్ కప్‌లో నాలుగు గోల్స్ సాధించిన నేమార్, ఈసారి పోటీల్లో పాల్గొనడం అనుమానాస్పదంగా కనిపిస్తున్నదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. పారిస్ సెయింట్ జర్మెయిన్‌కు రికార్డు ధరపై వెళ్లిన నేమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డాడు.

Pages