S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/02/2018 - 03:27

న్యూఢిల్లీ, జూన్ 1: ఈసారి ఆసియా క్రీడల్లో పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న భారత హైజంపర్ తేజశ్విన్ శంకర్ పోటీల నుంచి వైదొలిగాడు. మెడ నరాలు పట్టివేయడంతో, తలను ఎటూ కదల్చలేకపోతున్నానని, ఈ పరిస్థితుల్లో ఆసియా క్రీడల్లో పోటీపడలేనని ప్రస్తుతం కన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న 19 ఏళ్ల తేజశ్విన్ ప్రకటించాడు. ఈ విషయాన్ని భారత అథ్లెటిక్స్ సమాఖ్య కూడా ధ్రువీకరించింది.

06/02/2018 - 03:26

పారిస్, జూన్ 1: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రపంచ మాజీ నంబర్ వన్, అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ స్పష్టం చేసింది. 36 ఏళ్ల సెరెనా నల్లటి క్యాట్‌సూట్ వేసుకొని మ్యాచ్‌లు ఆడడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వని సెరెనా తన భవిష్యత్ ప్రణాళికలపై అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

06/02/2018 - 03:25

రోమ్, జూన్ 1: వారం రోజుల వ్యవధిలోనే 100 మీటర్ల స్ప్రింట్‌లో రోనీ బాకర్ రెండోసారి సత్తా చాటాడు. గత ఆదివారం యూగెనీలో జరిగిన మీట్‌లో అమెరికా స్టార్ క్రిస్టియన్ కోల్మన్‌ను రెండో స్థానానికి నెట్టి, టైటిల్ అందుకున్న బాకర్ ఇక్కడ జరిగ3న రోమ్ డైమండ్ లీగ్‌లోనూ విజేతగా నిలిచాడు. లక్ష్యాన్ని అతను 9.93 సెకన్లలో చేరుకున్నాడు. ఇది అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

06/02/2018 - 03:23

న్యూఢిల్లీ, జూన్ 1: తాను నిర్దోషినని, ఎలాంటి మాదక ద్రవ్యాలను వినియోగించలేదని భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను స్పష్టం చేసింది. డోపింగ్ పరీక్షలో పట్టుబడినట్టు పేర్కొని, తనను సస్పెండ్ చేయడం అన్యాయమని శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పింది. ఈ సస్పెన్షన్‌పై అప్పీల్ చేస్తానని తెలిపింది.

06/02/2018 - 03:20

లండన్, జూన్ 1: ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్‌లో వరల్డ్ ఎలెవెన్‌ను వెస్టిండీస్ చిత్తు చేసింది. తిరస పెరెరా పోరాటం వృథాకాగా, వరల్డ్ ఎలెవెన్‌పై విండీస్ 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.

06/02/2018 - 03:18

దుబాయి, జూన్ 1: అంతర్జాతీయ వనే్డ ర్యాకింగ్ జాబితాలో మరో నాలుగు జట్లకు అవకాశం లభించింది. కొత్తగా నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్లకు కూడా ర్యాంకింగ్స్‌లో స్థానం కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీర్మానాన్ని ఆమోదించింది. పురుషుల క్రికెట్ విభాగంలో ప్రస్తుతం 12 దేశాల జట్లకు మాత్రమే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చోటు ఉంది.

06/02/2018 - 03:17

ముంబయి, జూన్ 1: మాజీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, టాటా ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తిమోతి పెరీరా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. 75 ఏళ్ల పెరీరాకు భార్య, కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులున్నారు. హాకీ ఒలింపిక్ జోక్విమ్ కార్వాలోకు పెరీరా సమీప బందువు. ఆయన టాటా ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరడానికి ముందు గోవా స్పోర్ట్స్, స్టేట్ బ్యాంక్‌కు ఆడాడు.

06/01/2018 - 00:36

పారిస్, మే 31: ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్‌లో క్యాట్ సూట్ ధరించి బరిలోకి దిగి విజయం సాధించిన అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గురువారం కూడా ఇదే సూట్‌తో రెండో రౌండ్‌లో దిగింది. 36 ఏళ్ల సెరెనా మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో బరిలోకి దిగి సందర్భంగా ఆమె వేసుకున్న డ్రెస్‌పై అందరి దృష్టి పడింది.

06/01/2018 - 00:34

న్యూఢిల్లీ, మే 31: కామనె్వల్త్ గేమ్స్‌లోని వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రెండుసార్లు పతకాలు సాధించిన వెయిట్‌లిఫ్టర్ సంజితా ఛాను డోపింగ్ టెస్టులో పట్టుబడింది. నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్టు తాము జరిపిన పరీక్షల్లో తేలడంతో ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) తెలిపింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

06/01/2018 - 00:32

మాడ్రిడ్, మే 31: రియల్ మాడ్రిడ్ హెడ్ కోచ్‌గా స్పానిష్ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు గత మూడు సీజన్‌లలో మార్గదర్శిగా నిలిచిన జినేదిన్ జిదానే తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. తన ఆకస్మిక నిర్ణయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రియల్ మాడ్రిడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించలేనని స్పష్టం చేశాడు. వచ్చే రెండు మూడేళ్లలో వేరే పనిలో బాధ్యతలు చేపట్టనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.

Pages