S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/30/2017 - 01:26

కరాచీ, జూలై 29: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై కేసు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, ఇది ముమ్మాటికీ నిజమేనని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.

07/29/2017 - 00:35

గాలే, జూలై 28: గాలేలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 309 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. దీనితో భారత్ మొత్తం ఆధిక్యం 498 పరుగులకు చేరింది.

07/29/2017 - 00:32

భారత్ తొలి ఇన్నింగ్స్: 133.1 ఓవర్లలో 600 (శిఖర్ ధావన్ 190, చటేశ్వర్ పుజారా 153, అజింక్య రహానే 57, రవిచంద్ర అశ్విన్ 47, నువాన్ ప్రదీప్ 6/132, లాహిరు కుమార 3/131-3).

07/29/2017 - 00:31

గాలే, జూలై 28: రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయపడడంతో అనూహ్యంగా టెస్టు జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ లంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కితే, అతనితోపాటు ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టి, కేవలం 12 అభినవ్ ముకుంద్‌పై విమర్శలు చెలరేగాయి. అతను టెస్టులకు పనికిరాడని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే, అంతర్జాతీయ కెరీర్‌ను మానుకొని, గల్లీ క్రికెట్ ఆడాలని మరికొందరు ఎద్దేవా చేశారు.

07/29/2017 - 00:29

హైదరాబాద్, జూలై 28: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చడంతో పాటు మహిళల వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న మిథాలీ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు.

07/29/2017 - 00:27

కరాచీ, జూలై 28: అంతర్జాతీయ మ్యాచ్‌లకు మళ్లీ ఆతిథ్యం ఇవ్వాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి గండి పడింది. రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను ఆడేందుకు రావాల్సిందిగా పిసిబి ఇచ్చిన ఆహ్వానాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

07/29/2017 - 00:26

కరాచీ: మాజీ పేసర్, మాజీ కోచ్ వకార్ యూనిస్ క్రికెటర్‌గా దేశానికి గొప్ప సేవలు అందించినప్పటికీ, జట్టుకు సరైన మార్గదర్శకం ఇవ్వడంలో దారుణంగా విఫలమయ్యాడని వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్ ధ్వజమెత్తాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ వకార్ కోచ్‌గా ఎంతమాత్రం స్ఫూర్తిదాయకమైన విజ్ఞతను ప్రదర్శించలేకపోయాడని వ్యాఖ్యానించాడు.

07/29/2017 - 00:25

సిడ్నీ, జూలై 28: ఆటగాళ్ల డిమాండ్లను నెరవేర్చడంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ)కు చిత్తశుద్ధి లేదని ఓపెనర్, జాతీయ జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ధ్వజమెత్తాడు. సిఎ ప్రవర్తిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, నిజానికి సమస్య పరిష్కారం దిశగా అధికారులు ప్రయత్నించడం లేదని ఒక ఇంటర్వ్యూలో వార్నర్ విమర్శించాడు.

07/29/2017 - 00:24

బుడాపెస్ట్ (హంగరీ)లో జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్ మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన మెరియా బెల్‌వౌంట్ (స్పెయిన్)

07/29/2017 - 00:22

హైదరాబాద్, జూలై 28: ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం తమిళ్ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 32-27 తేడాతో విజయం సాధించింది. రాహుల్ చౌదరి 10 పాయింట్లు చేసి, టైటాన్స్ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. నీలేష్ సాలంకే 7 పాయింట్లు చేశాడు. తలైవాస్ ఆటగాళ్లలో ప్రభంజన్ 7 పాయింట్లు రాబట్టగా, అజయ్ ఠాకూర్ ఆరు, అరుణ్ నాలుగు చొప్పున పాయింట్లు చేశారు.

Pages