S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/12/2017 - 01:50

న్యూఢిల్లీ, మే 11: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి పాలనాధికారుల బృందం (సిఒఎ) అవసరం ఎక్కువ కాలం ఉండదని దాని చైర్మన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ అభిప్రాయ పడ్డాడు.

05/12/2017 - 01:48

న్యూఢిల్లీ, మే 11: ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లేకు ఉన్న కాంట్రాక్టు పొడిగింపుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రవి శాస్ర్తీ ఏడాది క్రితం కోచ్‌గా కుంబ్లే పదవీ బాధ్యతలు స్వీకరించాడు. అతని కాంట్రాక్టు వచ్చే నెలతో పూర్తవుతుంది.

05/12/2017 - 01:47

డబ్లిన్, మే 11: న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ జాన్ బ్రాస్‌వెల్ ప్రత్యర్థి జట్టుకు మార్గదర్శకం వహిస్తూ, తాను ఒకప్పుడు ప్రాతినిథ్యం వహించిన జట్టుకే సవాళ్లు విసరనున్నాడు. ఇక్కడ జరిగే ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌తోపాటు ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్లు కూడా తలపడతాయి.

05/12/2017 - 01:45

లాస్ ఏంజిలిస్, మే 11: ఒలింపిక్స్‌ను నిర్వహించే సత్తా తమకు ఉందని, 2024లో ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీ ధీమా వ్యక్తం చేశాడు. ఒలింపిక్స్ నిర్వాహణకు తొలుత ఐదు దేశాలు పోటీపడగా, ఇప్పుడు బరిలో లాస్ ఏంజిలిస్, పారిస్ మాత్రమే కొనసాగుతున్నాయి.

05/12/2017 - 01:43

న్యూఢిల్లీ, మే 11: రాబోయే చాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్ల ఫిట్నెస్ కీలక పాత్ర పోషిస్తుందని, గాయాల సమస్య తలెత్తకపోతే, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు టైటిల్ నిలబెట్టుకోవడం కష్టం కాదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్ జట్టు పూర్తిగా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఆధారపడిందన్న వాదనను కపిల్ తోసిపుచ్చాడు.

05/12/2017 - 01:42

కోల్‌కతా, మే 11: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ శనివారం ముంబయి ఇండియన్స్‌తో ఆడే చివరి గ్రూప్ మ్యాచ్‌ని చూసేందుకు ఆ జట్టు యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హాజరుకానున్నాడు. ఇక్కడ జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న నైట్ రైడర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

05/12/2017 - 01:41

మాడ్రిడ్, మే 11: ఉరుగ్వే ఆటగాడు పాబ్లో క్యువాస్‌తో కలిసి ఆడుతున్న రోహన్ బొపన్న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్ నుంచే నిష్క్రమించాడు. ఎటిపి వరల్డ్ టూర్‌లో బొపన్న జోడీ మొదటి రౌండ్‌కే పరిమితం కావడం ఇది రెండోసారి. ఫాబ్రిస్ మార్టిన్, డానియల్ నెస్టర్ జోడీని ఢీకొన్న వీరు 3-6, 2-6 తేడాతో వరుస సెట్లలో చిత్తుకావడం అభిమానులను నిరాశ పరచింది.

05/11/2017 - 01:23

దుబాయ్, మే 10: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కొనసాగనున్నాడు. అతను తన పదవీకాలాన్ని పూర్తి చేస్తాడని, వచ్చే ఏడాది జూన్ చివరి వరకూ చైర్మన్‌గానే ఉంటాడని ఐసిసి పాలక మండలి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తాము చేసిన సూచనకు మనోహర్ సానుకూలంగా స్పందించాడని పేర్కొంది.

05/11/2017 - 01:21

ముంబయి, మే 10: ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలవాలంటే, గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించాలి. అయితే, టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబయిని ఆ జట్టు హోం గ్రౌండ్‌లోనే ఓడించడం అనుకున్నంత సులభం కాదు.

05/11/2017 - 01:19

కాన్పూర్, మే 10: పదో ఐపిఎల్ ఎలాంటి ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శేయాస్ అయ్యర్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయినప్పటికీ, డేర్‌డెవిల్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. డేర్‌డెవిల్స్‌కు ఇది 12వ మ్యాచ్‌కాగా, ఐదో విజయం. దీనితో ఆ జట్టు పాయింట్లు పదికి చేరుకున్నాయి. ఇంకా రెండు గ్రూప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Pages