S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/15/2017 - 01:22

దుబాయ్, మే 14: చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పెంచింది. గతంలో ఈ మొత్తం 4 మిలియన్ డాలర్లుకాగా, దానికి మరో ఐదు లక్షల డాలర్లను చేర్చి, 4.5 మిలియన్లుగా ఖాయం చేసింది. ఇంగ్లాండ్‌లోని కార్డ్ఫి వేల్స్, ఎడ్జిబాస్టన్, ది ఓవల్ స్టేడియాల్లో జూన్ 1 నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్ ట్రోఫీలో విజేత జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు లభిస్తాయి.

05/15/2017 - 01:22

న్యూఢిల్లీ, మే 14: ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో భజరంగ్ పునియా స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్‌లో అతను కొరియాకు చెందిన సెన్‌గుయ్ లీని 6-2 పాయింట్ల తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ భారత్‌కు ఇదే మొదటి స్వర్ణం. కాగా, టైటిల్ రేసులో ఉన్న సరిత ఫైనల్‌లో ఓటమిపాలైంది.

05/15/2017 - 01:20

బార్సిలోనా, మే 14: భారత డ్రైవర్ అర్జున్ మైనీ మోటార్ రేస్‌లో రికార్డు సృష్టించాడు. జిపి-3 విభాగంలో విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. జెకె రేసింగ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఈ విజయంతో, డ్రైవర్స్ చాంపియన్‌షిప్ జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.

05/15/2017 - 01:18

సిడ్నీ, మే 14: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఇటీవల ప్రకటించిన కాంట్రాక్టు పేర్కొన్న మొత్తాలు ఆమోదయోగ్యంగా లేవంటూ విమర్శలు గుప్పిస్తున్న క్రికెటర్ల సంఘం (ఎసిఎ) రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు నిరాకరించగా, సహనం కోల్పోయిన సిఎ అధికారులు వచ్చే నెల నుంచి కాంట్రాక్టు చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరించారు.

05/14/2017 - 01:57

కాన్పూర్, మే 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఈసారి ప్లే ఆఫ్ చేరుకోవాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను ఢీకొన్న డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి, ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లింది.

05/14/2017 - 01:54

న్యూఢిల్లీ, మే 13: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆదివారంతో ముగుస్తాయి. ఇప్పటి వరకూ 54 మ్యాచ్‌లు జరగ్గా, ఆదివారం సాయంత్రం 4 గంటలకు పుణేలో మొదలయ్యే మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు ఢీ కొంటాయి.

05/14/2017 - 01:53

వెస్ట్ బ్రోమ్‌విచ్ (యునైటెడ్ కింగ్‌డమ్), మే 13: ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను చెల్సియా కైవసం చేసుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన మిచీ బషోయ్ కీలక గోల్ చేసి, చెల్సియాను గెలిపించడం విశేషం. వెస్ట్ బ్రోమ్‌తో జరిగిన ఫైనల్‌లో చెల్సియా మితిమీరిన జాగ్రత్తలు తీసుకుంది. గోల్స్ కోసం ప్రయత్నించకుండా రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది.

05/14/2017 - 01:50

పారిస్, మే 13: ఇటీవలే లాస్ ఏంజిలిస్ (అమెరికా)లో పర్యటించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) బృందం ఇక పారిస్‌కు వెళ్లి, 2024 ఒలింపిక్స్ నిర్వాహణకు అక్కడ ఉన్న సౌకర్యాలను, ఏర్పాట్లను, నిర్మాణాలను పరిశీలించనుంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమాన్యుయెల్ మాక్రాన్ ఎన్నికయ్యాడు. అతను ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, ఫ్రాన్స్ రాజకీయాలు పరిణామ దశలో ఉన్నాయి.

05/14/2017 - 01:50

న్యూఢిల్లీ, మే 13: భారత బాక్సర్లు భజరంగ్ పునియా, సరిత ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలను ఖరారు చేసుకున్నారు. వీరిద్దరూ తమతమ విభాగాల్లో ఫైనల్ చేరడంతో, కనీసం రజతాన్ని అందుకోనున్నారు. పురుషుల 65 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో కుగ్వాండ్ కిమ్‌ను 3-2 తేడాతో ఓడించిన భజరంగ్ టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు.

05/14/2017 - 01:48

కోల్‌కతా, మే 13: పదో ఐపిఎల్ గ్రూప్ దశలో అగ్రస్థానం కోసం ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబ యి ఇండియన్స్ చక్కటి ఆటతో కోల్‌కతా నైట్ రైడ ర్స్‌ను తొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. ఈ జట్టు 14 మ్యాచ్‌ల్లో పదో విజయాన్ని నమోదు చేసి 20 పాయంట్లతో నంబర్ వన్ స్థానాన్ని పదిలం చే సుకుంది. నైట్ రైడర్స్‌కు ఇది ఆరో పరాజయం. మొ త్తం మీద ఈ జట్టు 16 పాయంట్లు సంపాదించింది.

Pages