S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/13/2017 - 01:46

కాన్పూర్, మే 12: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగే పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇప్పటి వరకూ జరిగిన 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఏడింటిని గెల్చుకుంది. ఐదు పరాజయాలను ఎదుర్కొంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

05/13/2017 - 01:33

న్యూఢిల్లీ, మే 12: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా శుక్రవారం హోరాహోరీగా సాగిన గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ పోటీ నుంచి నిష్క్రమించిన డేర్‌డెవిల్స్‌కు ఇది ఆరో విజయం. ఈ ఫలితం వల్ల ఈ జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ, పుణే సూపర్‌జెయింట్‌కు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

05/13/2017 - 01:27

ముంబయ, మే 12: టి-20 ఫార్మాట్‌లో ముంబయకి చెందిన యువ ఆటగాడు రుద్ర దాండే డబుల్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అబిస్ రిజ్వీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో రిజ్వీ కాలేజీకి ప్రాతినిథ్యం వహించిన రుద్ర 67 బంతుల్లో 200 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.

05/13/2017 - 01:25

కేప్ టౌన్, మే 12: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తున్నది. మోచేతి గాయం కారణంగా ఈ ఏడాది జనవరి తర్వాత అతను ఒక్క టెస్టు కూడా ఆడలేదు. దక్షిణాఫ్రికా వనే్డ జట్టుకు నాయకత్వం వహిస్తున్న 33 ఏళ్ల డివిలియర్స్ ఇటీవలే న్యూజిలాండ్‌లో జరిగిన పర్యటన నుంచి వైదొలిగాడు.

05/13/2017 - 01:23

న్యూఢిల్లీ, మే 12: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ముగ్గురు భారతీయులకు రజత పతకాలు దక్కాయి. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ (60 కిలోలు), వినేష్ ఫొగట్ (55 కిలోలు), దివ్య కక్రాన్ (69 కిలోలు) తమతమ విభాగాల్లో టైటిల్ ఫైట్స్‌ను కోల్పోయి రజత పతకాలతో సంతృప్తి చెందారు. 48 కిలోల విభాగంలో రీతూ ఫొగత్ సెమీస్‌లో ఓటమిపాలై కాంస్య పతకాన్ని అందుకుంది.

05/13/2017 - 01:23

హైదరాబాద్, మే 12: హైదరాబాద్‌లో ఉన్న వెటరన్ క్రీడాకారులకు ఆర్థిక సాయాన్ని తెలంగాణ సర్కారు పునరుద్ధరించించింది. 2015 మార్చిలో వెటరన్ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఆరంభంలో పది మందికి ఈ సహాయం లభించింది. కానీ, 2016 ఫిబ్రవరి నుంచి ప్రతినెలా అందుతున్న సాయం నిలిచిపోవడంతో, దీనిని పునరుద్ధరించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.టి.

05/13/2017 - 01:22

టోక్యో, మే 12: క్రీడలకు మతంతోగానీ, రాజకీయాలతోగానీ సంబంధం లేదని అంటారు. కానీ, మత విద్వేషం క్రీడలపై విపరీత ప్రభావాన్ని చూపిన సంఘటనలు కోకొల్లలు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన 11 మంది క్రీడాకారులను అపహరించి బంధించిన పలస్తీనా అనుకూల ఉగ్రవాదులు వారిని దారుణంగా హతమార్చిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది.

05/13/2017 - 01:22

ముంబయి, మే 12: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్లపైనే ఉంటుందని భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ అన్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అతను మాట్లాడుతూ, హోటల్‌లోగానీ, ఇతరత్రా ప్రాంతాల్లోగానీ ఎవరినైనా కలవడం లేదా కలవకపోవడం అనేది ఆటగాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందని గుర్తుచేశాడు.

05/12/2017 - 01:58

ముంబయి, మే 11: పదో ఐపిఎల్‌లో నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో గురువారం ముంబయి ఇండియన్స్‌ను ఢీకొన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెలరేగిపోయింది. మూడు వికెట్లకు 230 పరుగులు సాధించి, ఈ ఐపిఎల్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. వృద్ధిమాన్ సాహా అజేయ అర్ధ శతకం, కెప్టెన్ గ్లేన్ మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ పంజాబ్ భారీ స్కోరుకు సహకరించాయి.

05/12/2017 - 01:54

1. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 3 వికెట్లకు 230 (ముంబయి ఇండియన్స్‌పై), 2. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 3 వికెట్లకు 214 (గుజరాత్ లయన్స్‌పై), 3. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లకు 213 (గుజరాత్ లయన్స్‌పై), 4. ముంబయి ఇండియన్స్ 3 వికెట్లకు 212 (్ఢల్లీ డేర్‌డెవిల్స్‌పై), 5. సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 209 (కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), 6. గుజరాత్ లయన్స్ 7 వికెట్లకు 208 (్ఢల్లీ డేర్‌డెవిల్స్‌పై), 7.

Pages