Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

ఇవి తొందరగా పండాలంటే ఇదీ చిట్కా!

సెంట్రల్ మెక్సికోలో ఎక్కువగా, మరికొన్ని దేశాల్లో పెరిగే అవొకొడొ నిజానికి బెర్రీ రకానికి చెందిన ఓ ఫలం. వృక్షశాస్త్రం ప్రకారం ఫలమే అయినా చాలామంది దీనిని ‘వెజిటబుల్’గానే పరిగణిస్తారు. పండు మధ్యలో ఒకే పెద్ద విత్తనం, తెల్లని వెన్నలాంటి గుజ్జుతో ఉండే ఈ ఫలంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. బేకరీ పరిశ్రమలో వెన్నకు బదులు దీనినికూడా పెద్దఎత్తున వినియోగిస్తారు. ఐస్‌క్రీముల్లోనూ దీనికి ప్రాధాన్యం ఉంది. మనవాళ్లు దీనిని వెన్నపండు అని పిలుస్తారు. పియర్స్ పళ్ల మాదిరిగాను, వృత్తాకారంసహా పలు రూపాల్లో, ఆకుపచ్చ, ముదురు గోధుమ, తేలికపాటి నలుపు రంగుల్లో ఇవి కన్పిస్తాయి.

ఎస్.కె.కె.రవళి

ఈ పిల్లులు చేపలు పడతాయ్!

ఫిషింగ్ క్యాట్ అని పిలిచే ఈ పిల్లుల కాళ్లు పొట్టిగాను, చిన్నగా, గుండ్రంగా ఉండే చెవులు, ముఖంతో కన్పిస్తాయి. ఈతలో ఇవి దిట్ట. నీటి ఉపరితలంపై కాళ్లతో తాకి, తేలికపాటి అలలను సృష్టించి చేపలను ఆకర్షిస్తాయి. చేపలు నీటిపైకి రాగానే పట్టుకుంటాయి. మధ్య, తూర్పు ఆసియా దేశాల్లో కన్పించే ఇవి శ్రీలంకలో ఎక్కువగా ఉంటాయి. నీటి వనరులకు చేరువలో నివసిస్తాయి. నీటి ఉపరితలంపై జీవించే పక్షులనూ ఇవి వేటాడతాయి. నీటిలో ఈదేటపుడు తోకను ‘రడ్డర్’లా ఉపయోగించి దిశను మార్చుకోవడానికి, వేగాన్ని నియంత్రించుకోడానికి ఉపయోగించుకుంటుంది. వీటిముక్కు చదునుగా ఉంటుంది. తల్లిని చూసి పిల్లలు నీటిలో చేపలవేట నేర్చుకుంటాయి.

ఎస్.కె.కె.రవళి

వీటి చెవులు అతి పొడవు!

పిల్లిజాతిలో అతిపెద్ద చెవులు, పొడవైన వెనుకకాళ్లు ఉన్న జాతికి చెందిన పిల్లి...సెర్వల్ క్యాట్. శరీర పరిమాణాన్ని బట్టి అతిపొడవైన చెవులు, కాళ్లు ఉన్న పిల్లి జాతి ఇది మాత్రమే. వీటికి శబ్దాన్ని గ్రహించే శక్తి చాలా ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే రాడార్‌ల మాదిరిగా వీటి చెవులు పనిచేస్తాయి. భూగర్భంలోని సొరంగాల్లో సంచరించే శత్రువుకదలికలను, ఆహారాన్ని పసిగట్టగలిగే గ్రాహకశక్తి వీటికి ఉంది. చిరుత తరువాత అతివేగంగా పరిగెట్టగలిగే పిల్లికూడా ఇదే. వేటలో కూడా దీనికి ఇదే సాటి. దక్షిణ, మధ్య ఆఫ్రికాలో కన్పించే ఇవి, క్యాట్ ఫ్యామిలీలో (సింహం, పులిసహా) మిగతావాటికన్నా వీటి వేట సామర్థ్యం చాలాఎక్కువ.

ఎస్.కె.కె.రవళి

కాప్సికమ్...బెల్‌పెప్పర్!

మనతోపాటు కామన్‌వెల్త్ దేశాల్లో చాలామటుకు కాప్సికమ్ అని పిలిచే ఈ బొండుమిరపను అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో బెల్‌పెప్పర్, స్వీట్‌పెప్పర్ అని పిలుస్తారు. బ్రిటన్‌లో అయితే పెప్పర్ అని పిలుస్తారు. జపాన్‌లో ‘పపురికా’ అంటారు. ఘాటు,కారం లేని మిరపజాతి ఇదొక్కటే. మిరపకాయల్లో మంటను కలిగించే ‘కాప్సయిసిన్’ లేకపోవడంవల్ల కాప్సికమ్ మామూలుగా ఉంటుంది. కమలాపళ్లలోకన్నా వీటిలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందని చాలామందికి తెలీదు. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, పర్పల్, గోధుమ, తెలుపు రంగుల్లో ఇవి లభిస్తాయి. అన్నింటికన్నా ఎరుపురంగు కాప్సికమ్ రుచి కాస్త తియ్యగా ఉంటుంది. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లుకూడా వీటిలో ఎక్కువ.

ఎస్.కె.కె.రవళి

దీని పళ్ల సంఖ్య 4వేలు!

ఈ భూమీద అతిపెద్ద చేప... ‘వేల్‌షార్క్’. ఇది గరిష్టంగా 62 అడుగుల పొడవు, 30 టన్నుల బరువు ఉంటుంది. దీని నోరు 5 అడుగుల వెడల్పు ఉంటుంది. తడవకు (గంటకు) 1500 గాలన్ల నీటిని మింగుతుంది. ఆ నీటితోపాటు దక్కిన ఆహారాన్ని నోటిలో ఉంచుకుని నీటిని బయటకు వదిలేస్తుంది. ఇలా వడపోత కోసం దాని నోటిలో పది వరుసల్లో ‘్ఫల్టర్ పాడ్స్’ ఉంటాయి. దీని నోటిలో 36 వరుసల్లో చిన్నచిన్న పళ్లు దాదాపు 4వేల వరకు ఉంటాయి. మగవాటికన్నా ఆడవి పెద్దగా ఉంటాయి. గుడ్లను పొట్టలోనే పొదిగి పిల్లలు వచ్చాక బయటకు విడిచిపెడతాయి. అప్పుడే పుట్టిన వేల్‌షార్క్ పిల్ల రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఇవి మిగతా షార్క్‌లకన్నా శాంతచిత్తంతో ఉంటాయి.

ఎస్.కె.కె.రవళి

వీటి శరీరం లోపలా మచ్చలుంటాయి!

తెల్లటి శరీరంపై నల్లని లేదా గోధుమరంగు మచ్చలతో కన్పించే డాల్మేషియన్స్ ప్రత్యేకతలు అన్నీఇన్నీకావు. పుట్టినప్పుడు తెల్లగా, ముద్దుగా కన్పించే ఈ శునకాలు నాలుగు వారాలు వచ్చేసరికి మచ్చలు మొదలవుతాయి. వాటికి శరీరం లోపలి భాగాల్లోనూ ఈ మచ్చలు ఉంటాయి. నోటి అంగుటిలో చూస్తే అవి కన్పిస్తాయికూడా. ఇవి స్వతంత్రంగా వ్యవహరించే శునకాలు. తర్ఫీదు ఇస్తే మాటవింటాయి. రక్షణ, క్రీడలు, వేట, కాపలా, అగ్నిప్రమాదాల నివారణ వంటి అంశాల్లో వీటికి శిక్షణ ఇచ్చి సేవల్లో వినియోగిస్తారు. అందుకే వీటి కోచ్‌డాగ్స్ అని యాంటీఫైర్ డాగ్స్ అని పిలుస్తారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌లలో వీటికి ఆదరణ ఎక్కువ.

ఎస్.కె.కె.రవళి

ఇవి ఎలుకలు కావు!

ఈ ఫొటోలో కన్పిస్తున్న జీవి అచ్చం ఎలుకలా కన్పిస్తోంది కదూ!. కానీ వాటితో దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అమెరికా, కొన్ని ఆసియా, ఐరోపా దేశాల్లో కన్పించే ఈ క్షీరదాల పేరు ‘పికా’. చాలా చిన్నగా ఉండే ఇవి నిజానికి కుందేళ్లకు దగ్గరి బంధువుగా చెప్పుకోవచ్చు. వీటిని ‘విజిలింగ్ హేర్స్’ అని పిలుస్తారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడ్డు అవి ఓ విధమైన శబ్దం చేస్తూ వాటి బొరియలు, అవి ఏర్పాటు చేసుకున్న కంతల్లోకి దూకుతాయి. అందువల్లే వాటికి ఈ పేరు వచ్చింది. శీతాకాలం, వర్షాకాలంలో ఆహారం కొరత లేకుండా ఉండేందుకు ఇవి జాగ్రత్తగా ఆహారాన్ని దాచుకుంటాయి.

ఎస్.కె.కె.రవళి

ఇవి టమాటాలే!

ప్రపంచంలో దాదాపు 9000 రకాల టమాటాలు ఉన్నాయట తెలుసా!. మనకు తెలిసిన టమాటాలు ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉంటాయి కదా...కానీ పసుపు, తెలుపు, నలుపు, ఊదా, గోధుమ, పర్పల్ రంగులో ఉండే టమాలుకూడా ఉన్నాయి తెలుసా. వీటిలో ఉండే లైసోపిన్ వల్ల ఇవి తింటే గుండెకు మంచిది. టమాటాల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్ రెండోస్థానంలోను, అమెరికా మూడో స్థానంలోనూ ఉన్నాయి. కానీ వీటిని తినడంలో సగటు అమెరికన్ ముందుంటాడు. వారికి టమాటాలంటే తెగ ఇష్టం. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ టమాటాలు తినేది అమెరికనే్ల. నిజానికి ఓహియోవంటి రాష్ట్రాల అధికార ఫలం టమాటా. వృక్షశాస్త్రం ప్రకారం టమాటా ఓ పండు. కాయగూర కాదు.

ఎస్.కె.కె.రవళి

గుడ్లంటే చైనీయులకు ఇష్టం!

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లలో 40శాతం చైనీయులే తినేస్తున్నారు. వారికి అవంటే ఎంతో ఇష్టం. లవణాలు, ఖనిజాలు, ప్రొటీన్లు, మూడు ముఖ్యమైన ఒమెగా విటమిన్లు ఉన్న బలవర్ధక ఆహారం గుడ్డు. ప్రపంచంలో ఏటా 1.2 ట్రిలియన్ గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సగటున ఒక్కో మనిషి ఏడాదికి 173 గుడ్లు తింటాడని అంచనా. సగటు అమెరికన్ అయితే 200 పైగానే లాంగించేస్తాడట. గుడ్ల రంగు వాటిని పెట్టే కోడి రంగును బట్టి ఉంటుంది. తెల్లటి కోళ్లు తెల్లగుడ్లను మిగతారంగుల కోళ్లు కాస్త జేగురురంగు లేదా కాస్త పసుపు రంగు గుడ్లను పెడతాయి. అసలు గుడ్లను పొదిగే ప్రక్రియ డైనోసార్లనుంచి మొదలైందని 2008లో నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది.

ఎస్.కె.కె.రవళి

సేమియాకూ ఓ లెక్కుంది!

మనం వాడే సేమియా 14వ శతాబ్దంలో ఇటలీలో కనిపెట్టారట. సేమియా పుడకల మందాన్ని బట్టి వాటి పేర్లు మారిపోతుంటాయి. మనం వాడుతున్నదానిని సేమియా అంటున్నాం కదా. సేమియా తీగల మందాన్నిబట్టి వివిధ దేశాల్లో వాటికి వేరు పేర్లు ఉన్నాయి. అమెరికాలో మన సేమియాకన్నా కాస్త దళసరిగా ఉండే వాటిని వాడతారు. అవి 2.08 మి.మీ. మందంతో ఉంటాయి. వాటిని ‘వెర్మిసెల్లిని’ అని పిలుస్తారు. స్పఘెట్టా (1.9-2 ఎంఎం), ఫిడెలిని (1.37-1.47 ఎంఎం), కపెల్లిని (0.8-0.9 ఎంఎం) అనే రకాలూ ఉన్నాయి. గోధుమ, వరి, బార్లీ ఇలా పలు ధాన్యాల పిండితో చేసే సేమియాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి.

ఎస్.కె.కె.రవళి

Pages