Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

వీటిని ‘చిన్‌చిల్లా’ అని ఎందుకంటారు?

ఎలుకల జాతికి చెందిన ఈ జీవులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పెంపుడు ఎలుకలుగా ఎంతో ఆదరణ పొందిన ఇవి దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వత ప్రాంతాల్లో, 14 వేల అడుగుల ఎత్తున జీవిస్తాయి. ఈ భూగోళంపై అత్యంత ఒతె్తైన బొచ్చు ఉన్న క్షీరదాల్లో ఇది రెండవది. ‘సీఅట్టర్స్’ మొదటి స్థానంలో ఉన్నాయి. సిల్క్‌లా మెత్తగా, ఒత్తుగా ఉండే ఈ బొచ్చుకోసం వీటిని ఎక్కువగా వేటాడి చంపేసేవారు. ముఖ్యంగా ఆండీస్ పర్వతప్రాంతాల్లో ఉండే ‘చిన్‌చా’ తెగవారు వీటిని ఎక్కువగా వేటాడేవారు. వారి పేరుతోనే వీటిని చిన్‌చిల్లా ఎలుకలుగా పిలవడం మొదలైంది. వీటిని పెంచుకోవడం చాలా కష్టం. అతివేడిని, అతి తడిని, చలిని ఇవి తట్టుకోలేవు.

- ఎస్.కె.కె. రవళి

ఎగరగలిగే అతి బరువైన పక్షి ఇదే!

ఈ భూగోళంలో ఎగరగలిగే అతి బరువైన పక్షి కోరి బస్టర్డ్. ముఖ్యంగా ఈజాతిలో మగపక్షులు కనీసం 3 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల పొడవు ఉండి 40 పౌండ్ల బరువుంటాయి. ఎగరడానికి ముందు కొంతసేపు పరుగుపెట్టి విమానాల టేకాఫ్ మాదిరిగా గాల్లోకి లేస్తాయి. దిగేటప్పుడూ అంతే. ఇవి రెక్కలాడిస్తే శబ్దం వస్తుంది. జతకట్టేముందు ఆడపక్షి ఎదుట ఇవి చేసే విన్యాసాలు ఆకర్షణీయంగా ఉంటాయి. జీబ్రాలు, లేళ్లు, జింకల చెంత తిరగడానికి ఇవి ఇష్టపడతాయి. అవి ఉన్నచోట వీటికి ఆహారం ఎక్కువగా లభిస్తుందన్నమాట. తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో కనిపించే ఈ పక్షి ఎగరగలిగే శక్తి ఉన్నప్పటికీ ఎక్కువ కాలం భూమిపై నడుస్తూ గడిపేస్తుంది.

- ఎస్.కె.కె. రవళి

ముల్లును తొలగించి తేనెటీగల్ని తింటాయి

తేనెటీగలు, కందిరీగలే ప్రధాన ఆహారంగా తీసుకునే ‘బీ ఈటర్’ పక్షులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ పక్షులు చాలా అందంగా కనిపిస్తాయి. పాలపిట్టలు, చెకుముకి, లకుముకి పిట్టల జాతికి చెందినదిగా భావిస్తున్న ఈ పక్షి పది లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఉందన్న వాదన ఉంది. గాలిలో ఎగురుతూ తేనెటీగలు, కందిరీగలను పట్టుకోవడం వీటి ప్రత్యేకత. 200 అడుగుల దూరంలో ఉండగానే ఆహారాన్ని గుర్తించగలిగే ఇవి కోరిబస్టర్డ్ పక్షుల వీపుపై తిరగడానికి ఇష్టపడతాయి.

- ఎస్.కె.కె. రవళి

ప్రమాదం ఎదురైతే ఏం చేస్తాయో తెలుసా?

ఉత్తర అమెరికాకు చెందిన ఈ పక్షి పేరు క్వెయిల్. ప్రస్తుతం నాలుగైదు ఖండాలకు పరిచయం అయిన ఈ పక్షులు ‘్ఫజెంట్స్’ కుటుంబానికి చెందినవి. ప్రమాదం ఎదురైనప్పుడు తక్కువ దూరాలు ఎగరగలిగే ఈ పక్షులు ఆపదలో అవసరమైతే చేష్టలుడిగి చచ్చిపడినట్లు నటిస్తాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అప్పటికప్పుడు అవి అలా చేస్తాయి. రెండుమూడు రంగుల ఈకలు, తలపై కొసకు బొడిపె ఉన్నట్లున్న సన్నని ఈక వీటికి ప్రత్యేక అందాన్నిస్తాయి. గుడ్ల నుంచి బయటికి వచ్చిన కొద్దిసేపటికే స్వేచ్ఛగా నడవగలిగే శక్తి వీటి పిల్లలకు ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి

ఈతకొట్టే ఈ ఎలుకపళ్లు ఎర్రన

దక్షిణ అమెరికాలో కనిపించే ఈ ఎలుకలను ‘న్యూట్రియా’, ‘కొయ్‌పు’ అని పిలుస్తారు. నీళ్లలో ఈదగలిగే ఈ భారీ ఎలుకజాతి జీవుల పై రెండు పళ్లు కొనదేలి పొడవుగా ఉంటాయి. పసుపు, ఆరెంజ్, ఎరుపు రంగుల్లో ఉంటాయి. 17 అంగుళాల శరీరం, అంతే పొడవైన తోక వీటి ప్రత్యేకత. తమ జీవితకాలంలో సగభాగం నీటిలోనే ఇవి ఉంటాయి. నీటిలో ఐదునిమిషాలపాటు గాలి పీల్చుకోకుండా ఉండగలిగే ఈ ఎలుకల శరీరంపై రెండువరుసల్లో రెండురకాల బొచ్చు ఉంటుంది. ఒకప్పుడు వీటి బొచ్చును ‘్ఫ్యషన్ ప్రపంచం’లో విస్తృతంగా వాడేవారు. నీరులభిస్తే చాలు భూగోళంలో ఎక్కడైనా ఇవి బతికేయగలవు.

- ఎస్.కె.కె. రవళి

ప్రపంచంలో అతి చిన్న జింకలు ఇవే

చిలీ, అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవించే ఈ ‘పుడు డీర్’ జింకల జాతిలో అతి చిన్నది. బాగా ఎదిగిన ఈ జింక మహా అయితే 85 సెంటీమీటర్లు ఎత్తుంటుంది. 12 కేజీల బరువుకు మించదు. పుట్టినప్పుడు 600 గ్రాములకన్నా తక్కువ, వెయ్యి గ్రాములకన్నా ఎక్కువ బరువుంటే ఇవి బతకడం కష్టం. పొడవు పెరగని కొమ్ములు, ముఖంపై ఉండే గ్రంధులు విడిచే ద్రవం వెదజల్లే పరిమళం ద్వారా జతకట్టే ఆడ పుడుకు కమ్యూనికేషన్ ఇవ్వడం వీటి ప్రత్యేకత. అప్పుడే పుట్టిన పిల్లల బొచ్చుపై తెల్లటి మచ్చలు ఉన్నా పెరిగే కొద్దీ శరీరం అంతా ముదురు గోధుమ వర్ణంలోకి మారిపోతుంది.

- ఎస్.కె.కె. రవళి

వీటి శరీరంపైనే ఆహారం ఉంటుంది

సౌత్ పసిఫిక్ సముద్రం అంతర్భాగం, ఆర్కిటిక్ ప్రాంతంలో కనిపించే అతి చిన్నజీవులు ఈ ‘యతి’ పీతలు. పదిహేను మిల్లీమీటర్ల సైజులో మాత్రమే ఉండే ఈ జీవులు సముద్ర అంతర్భాగంలో 4500 అడుగుల లోతుల్లో ఉంటాయి. అత్యంత వేడిగల హైడ్రోధర్మల్, అతిశీతల ఆర్కిటిక్ వాతావరణంలో అవి మనుగడ సాగిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

ఒకే శునకం.. మూడు రూపాలు!

పూడిల్ జాతి శునకాల ప్రత్యేకతలు తెలిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. జర్మనీలో పుట్టిపెరిగిన ఈ శునకాలు ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన, ఆదరణ పొందిన రెండవజాతిగా గుర్తింపు పొందాయి. ఫ్రాన్స్, అమెరికాలో వీటిని ఎక్కువగా పెంచుకుంటున్నారు. కొత్త విషయాలను సులువుగా, చురుకుగా నేర్చుకోవడం, పరిస్థితులకు తగ్గట్లు మసలుకోవడం, కుటుంబ సభ్యులతో ఆడుకోవడం, యజమాని చెప్పే ట్రిక్‌లను త్వరగా నేర్చుకుని అనుకరించడం వీటి ప్రత్యేకత. ఆరేడు రంగుల్లో కనిపించే ఈ పూడిల్ శునకాలు మూడు సైజుల్లో ఉంటాయి.

- ఎస్.కె.కె. రవళి

రంగు మారితే ఈడొచ్చినట్లే!

ఉత్తర అమెరికాలో కనిపించే అందమైన నీటిపక్షి ‘వుడ్ డక్’. శరీరంలో ఒక్కో భాగం ఒక్కో రంగుతో విభిన్నమైన, స్పష్టమైన ముదురు వర్ణంతో ఆకట్టుకునే ఈ మగ వుడ్ డక్ నిత్యం అలా ఉండదు. మామూలు రోజుల్లో తేలికపాటి రంగుల్లో ఉండే ఈ నీటిపక్షి జతకట్టే సమయంలో ఆడపక్షులను ఆకర్షించేందుకు ఇలా వర్ణశోభితంగా మారిపోతుంది. ఎర్రటి కళ్లు, తల పై భాగంలో మెటల్లిక్ ఊదా, ఆకుపచ్చ మిళితమైన రంగు, ముఖం ఇరువైపులా నల్లటి ఈకలపై బుగ్గల మీదుగా సాగే తెల్లటి గీతలు, ముక్కు మొదలయ్యే చోట పసుపురంగు, ఛాతీవద్ద ఎరుపు, దానికి ఇరువైపులా నలుపు, తెలుపు గీతలు, తెల్లటి ఉదరం, తోక, పృష్ఠ్భాగం నల్లగా, రెక్కలు నలుపు, నీలం కలగలసిన రంగులతో ఉంటాయి.

- ఎస్.కె.కె. రవళి

బొచ్చులేని ‘స్పింక్స్’ పిల్లులంటే పిచ్చి

ప్రపంచంలో సంకరజాతి పిల్లుల్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవాటిలో బొచ్చులేని ‘స్పింక్స్’ జాతి పిల్లులకు ఎనిమిదో స్థానం దక్కింది. 1960లో సృష్టించబడిన ఈ పిల్లులకు మిగతావాటిలా బొచ్చు ఉండదు. అలాగని శరీరంపై వెంట్రుకలే ఉండవనికాదు. సన్నని ఉండీలేనట్లుండే వెంట్రుకలు ఉంటాయి. పెంపుడు శునకాల్లా యజమానిని చూసిన వెంటనే గారాలుపోతూ శరీరాన్ని తాకుతూ తిరగడం వీటి ప్రత్యేకత. యజమానికి ఎక్కడ కూర్చున్నా, చివరకు పడుకున్నా వారిని ఆనుకుని సేదదీరడం వాటికి ఇష్టం. ఇలాంటి లక్షణం పెంపుడు పిల్లులకు ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఇవి ప్రదర్శిస్తాయి. మిగతా పిల్లులకన్నా వీటి శరీర ఉష్ణ్రోగ్రత నాలుగు డిగ్రీలు అధికంగా ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి

Pages