S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/15/2017 - 22:00

వేటూరి ప్రభాకరశాస్ర్తీ పారం ముట్టిన పండితులు. ‘బాలభాష’ అనే వీరి పుస్తకం కొందరకు తెలుసు. కాని వీరి అనువాదగ్రంథం ‘నీతి నిధి’ అనేది చాలాకొద్దిమందికే తెలుసనుకుంటాను. 1926లో ఆంధ్ర పత్రికా కార్యాలయంవారు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి ముందుమాటతో ఈ నీతినిధి ప్రచురింపబడింది. కాశీనాథుని నాగేశ్వరరావుగారు సంపాదకీయంలో ఇలా పేర్కొన్నారు- ‘‘శ్రీ నీతినిధి ఆంధ్ర గ్రంథమాలయందాఱవ కుసుమము.

01/15/2017 - 21:58

ఉత్తమ కవితా సంకలనాలకిచేచ రమణ సుమనశ్రీ ఫౌండేషన్ పురస్కారాలను ఫౌండేషన్ అధ్యక్షులు సుమనశ్రీ ప్రకటించారు. 2015 సంవత్సరానికి సౌభాగ్య (సౌభాగ్య సమగ్ర కవిత్వం), దెంచనాల శ్రీనివాస్ (్భస్మ సారంగీ), 2016కు సిద్ధార్థ (బొమ్మల బాయ), ఎం.ఎస్.నాయుడు (గాలి అద్దం) పురస్కారం అందుకుంటారు. జనవరి 18న సా.

01/15/2017 - 21:58

శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ భాగీరథి పురస్కారంకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. కొలకలూరి సుమకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం గ్రంథ రూపంలో ముద్రిత నవలకు కథానికలకు కడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2014నుంచి డిసెంబర్ 2016 వరకు ముద్రితమైన తెలుగు నవల పురస్కారానికి పరిశీలింపబడుతుందనీ, ఇందుకోసం రచయితలు లేదా ప్రచురణకర్తలు మూడేసి ప్రతులను పరిశీలనార్థం పంపించాలని పేర్కొన్నారు.

01/08/2017 - 22:25

కొందరికి ఆకాశం చేతికందుతుంది
వారు ధగధగలాడే తారల్ని
హారాలుగా ఆభరణాలుగా ధరిస్తారు
గడప దాటి చంద్రుడు
వారింటిలోకి ప్రవేశిస్తాడు
తన వెంట తెచ్చిన వెనె్నల్ని
వెండి పళ్లెంలో పెట్టి
వారికి కానుకగా సమర్పిస్తాడు
పిల్లగాలి కిటికీలోనుండి పలకరించి
లోపలికి ప్రవేశిస్తుంది
అందర్ని ఆప్యాయంగా నిమిరి
నిదరపుచ్చి వెళ్ళిపోతుంది

01/08/2017 - 22:23

సంక్లిష్టమైన రాజకీయ వ్యవస్థ రాజ్యమేలుతున్న దేశంలో కులాలు, మతాలు, వర్గాలు, జాతుల మధ్య నిత్య సంఘర్షణ జరిగే సమాజంలో లౌకికవాదం పేరుతో అరాచకవాదం పెచ్చుమీరిన రాజ్యంలో నిశ్చలంగా, నిర్భయంగా జాతీయ వాదానికి కట్టుబడి నిన్నటికీ, రేపటికీ సమతూకం వేస్తూ, దినపత్రిక సంపాదకత్వంతోపాటు, భాష, సాహిత్య, చరిత్ర పరిశోధనారంగాల్లో విశేషంగా అలుపెరుగని అక్షర పోరు సల్పుతున్న బహుముఖీన ప్రజ్ఞావంతులు ఎంవిఆర్ శాస్ర్తీ.

01/08/2017 - 22:20

భావాన్ని కొలిచే కొలమానం
బాధను తూచే తూకం- పాటే అయినా,
నిజానికి గాయకుడు పాడిందే పాట కాదు
కవి మెదడులో కదలికలు- పాట
సంగీత జ్ఞాని మనసులో ముద్రించుకున్న ముద్ర- పాట
వాయిద్యకారుల చేతివేళ్ళ నృత్యం- పాట
పాటంటే కేవలం వినిపించేదే కాదు, వినిపించని
సాంకేతిక నిపుణుల పరిజ్ఞానమూ పాటే
ఒక జీవిత దర్శనం పాట!
చేదు జ్ఞాపకాన్నైనా ఒక మధుర స్మృతిగా

01/08/2017 - 22:19

రష్యా సోషలిస్టు విప్లవానికి వందేళ్లు. ఈ సందర్భంగా అనేకానేక ఆత్మావలోక కథనాలు వెలువడ్డాయి. అనేక సమీక్షలు వచ్చాయి. గొప్ప వ్యవస్థ కుప్పకూలిందనే వ్యధ, వగపుకూడా వాటిల్లో ధ్వనించింది. మొట్టమొదటిసారిగా కార్మిక-కర్షక శ్రేయోరాజ్యం ప్రాణంపోసుకుని కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన అనంతరం తన బరువుకు తానే కూలిపోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. మంచి ఎక్కడున్నా ఆహ్వానించాల్సిందే!

01/08/2017 - 22:18

ఓరోజు పొద్దుగాలనే ఎస్.ఎం.ఎస్ వచ్చింది
కండ్లు మూసుకుంట జూసిన.. హ్యాపీ బర్త్‌డే
ఓ కవి పంపిండు
ఓహో! ఫేస్‌బుక్‌లో సూసుంటడు
ఇక ఓదాని తర్వాత ఒకటి, పదిగాలచ్చినయ
జమానా పదో తరగతి కాయతంలున్న డేటాఫ్‌బర్త్
నా పుట్టిన రోజంటే జాతీయ పండుగేమికాదుగని
ఓ క్యాండిల్ వెలుగు, ఓ రెండు రబ్బరు బుగ్గలు
ఓ కేక్, ఓ చాక్లెట్ - ఆ ఉల్లాసం కూడా లేనోన్ని

01/08/2017 - 22:17

ప్రతి కథ ఒక మనిషి భౌతిక మానసిక స్థితిగతులను, వాటిని యెదుర్కుంటున్నప్పుడు అతడు పడుతున్న అనుభూతులను అక్షరబద్ధం చేస్తుంది. వ్యక్తిగతమయిన రుూ అనుభూతులన్నీ కలగలిపినప్పుడు అదే ఆ సమాజంయొక్క స్వరూప స్వభావంగా రూపుకట్టుకుంటుంది. సమాజానికి వ్యక్తి మూలం అయితే, వ్యక్తికి సమాజమే మూలం. వ్యక్తి స్తంభం లాగ నిలిచి సమాజాన్ని దివ్యభవనం లాగ చూపుతాడు.

01/01/2017 - 22:06

ఎందరి కలలు ఎన్ని రాత్రులు
వేకువ పేరుతో గడిచిపోయాయో
పరిణమించిన క్షణంలోనే
ఉదయపు టెఱగందు నిశ్శబ్దరోదన
అరుణ సూకమై
అంతటా వ్యాపించింది
అజ్ఞానపు జలక్రీడలాడుతున్న వారి కందెఱపై
కాలపు బరువు మోస్తున్న కర్తవ్యమొకటి
కావ్యోద్దిష్ట కల్పనకు సిద్ధమయేలా
సాంధ్య కిరణ బర్హంతో శబల శబ్దమద్దింది..

Pages