S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/01/2017 - 22:04

ఆలోచన ఒంటరిదే అంతర్లయా ఒంటరిదే
ఒంటరి వానచుక్కలే జతకట్టి
నేలనూ గాలినీ తడిపినట్టు
విత్తనం ఆత్మతో సంభాషించి
అంకురానికి ఆయువు పోసినట్టు
ఆకుపచ్చ నీడై అలసటకు ఓదార్పునిచ్చినట్టు
ఒక్కొక్క అక్షరమూ అల్లుకొని వాక్యమై
ఊహకు ఊపిరిపోస్తుంది.

01/01/2017 - 22:03

నేడు కవులకేం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. కవితా సంపుటాలు రంగురంగు అట్టలతో పిట్టల్లా సమాజం మీద వాలుతునే వున్నాయి. కథకులు కథారంగాన్ని దునే్నస్తూనే ఉన్నారు. పుట్లుపుట్లుగా కథా సంపుటాలు పురుడు పోసుకుంటూనే ఉన్నాయి. సాహిత్యంలో వాదాలు రహదారి విడిచి చీలుపుదార్లుగా కుల, మత వర్గాల గూటికి వ్యక్తిగత స్వార్ధాన్ని మూటకట్టుకుని చేరే ప్రయత్నం చేస్తునే ఉన్నాయి.

01/01/2017 - 22:02

శివారెడ్డి గారన్నట్లు ప్రసాదమూర్తి వస్తుతః కవి. ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ ఇంకా తాజాగా ఉండగానే వచ్చిన మరో కవితా సంపుటి ‘చేనుగట్టు పియానో’. దీనిలోని కవితలన్నీ గత రెండేళ్ళలో రాసినవే. ఒక నెలలో రాసిన ఏడెనిమిది కవితలు ఇందులో ఉన్నాయంటే నిజానికి అంతకన్నా ఎక్కువే రాసియుండవచ్చు. విరివిగా కవితలు రాస్తూ తరచూ పత్రికల్లో కనబడే కవుల్లో ఈయనొకరు.

01/01/2017 - 22:00

ఏదో క్షణాన భూమి పొరల చెరను
విత్తనపు కుత్తుక మొక్కై చీల్చుతుంది
ఆకులు పత్రహరితాన్ని పొదగుకొని
తమ తలల్ని పతాకాల్లా ఎగరేస్తాయి
పారవశ్యం పది నిమిషాలే
స్తబ్దతా తాత్కాలికమే
జడత విడిపోయే మగడే
శ్వాస బలిమిగా ఉంటే చాలు
పంజరాల చువ్వలను చీల్చడం ఒక లెక్కా..!
ఈదురుగాలుల మీద ఊరేగినప్పుడే
విసుగుల ముసుగులు తొలగి

01/01/2017 - 21:58

కథ చదవడం అయిపోయిన తరువాత, చదువరికి మనసులో ఒక తృప్తి ఎంతసేపూ తన సమయాన్ని వృధాచేయలేదన్న భరోసా కలగాలి. అంటే ప్రతి కథ ‘సుఖాంతం’ అవాలని కాదు, దుఃఖాంతం అయిన కథ కూడా వాతావరణం చక్కగా సమకూర్చి, కథ మధ్యభాగం పరిపుష్టం చేసినట్లయితే అదికూడా ఆమోదదాయకంగానే వుంటుంది. సాధారణంగా వెనకటి కాలంలో కథలన్నీ కంచికి వెళ్లిపోయే తరుణం, ‘అందరూ కులాసాగా వున్నారు.

12/25/2016 - 21:50

ప్రొద్దున లేచి బయటకు చూడగానే
పొందికగా అటు కరెంటు తీగలపై కాకి సమ్మేళనం,
ఇంట్లో ఇటు పేపరు తిరగేయగానే
‘కరెంటు టాపిక్’లపై కవి సమ్మేళనం;
ప్రతిరోజూ ప్రత్యక్షం!
కాకులేమో-
ఎవరింటికి చుట్టాలొస్తున్నారో
ఎగిరిపోయి ఎరుక చేయాలని- ఏకబిగిని అరవాలని
ఎవరెవరి యింట్లో పిండ ప్రదానం జరుగుతోందో చూసి
ఏకంగా ఎత్తుకుపోవాలని
అదేపనిగా చర్చించుకుంటున్నాయి!

12/25/2016 - 21:49

అన్ని కవితలూ మృత్యువువే
ఇదొక్కటే జీవితానిది!

అన్ని కవితలూ నా స్వంతం
ఇదొక్కటి మాత్రమే నీది!

12/25/2016 - 21:47

ఈయేటి జ్ఞానపీఠ్ పురస్కారానికి ప్రఖ్యాత బెంగాలీ కవి, విమర్శకుడు, విద్యావేత్త, ప్రయోగశీలి అయిన శంఖాఘోష్ ఎన్నికయ్యారు. నోబెల్ పురస్కారం గ్రహీత విశ్వకవి రవీంద్రుడి సాహిత్యంపై వీరిది సాధికారికమైన కృషి. భూత-్భవిష్యత్ కాలాలకు అనుసంధానకర్తగా నిలబడ్డ ఈ కవి, నేటి యువతరాన్ని కూడా విశేషంగా ప్రభావితం చేశారు. ‘దిల్ గులి రాత్ గులీ’ ‘నిహిత పాతాళ ఛాయ’వంటి వీరి కవితలు నవ తరాన్ని ఉర్రూతలూగించాయి.

12/25/2016 - 21:45

ప్రపంచం కథలతో కదలబారుతోంది. అనుక్షణం ఈ కదలిక ఊహకు అందనంత దూరంలో నడుస్తోంది. ఒకప్పుడు అసంభవం, అసందర్భం అనుకున్న సన్నివేశాలు రుూరోజున సహజం, సరళం అయిపోతున్నాయి. ‘అభూతకల్పన’ అనుకున్న విషయాలు యిప్పుడు జరుగుతూ వుంటే దీనిని గురించి ఎవరూ విడ్డూరంగా చెప్పుకోవడం లేదు. కథ ముఖ్యంగా రెండు అంశాలకలగలుపు. మొదటిది కథలో వస్తువు అయితే రెండోది దాన్ని చెప్పిన తీరు, కథనం.

12/25/2016 - 21:43

మంచి కవిత్వాన్ని అనుభవించి పలవరించవచ్చు. కానీ వివరించడం అంత సులభమైన పనేమీ కాదు. శివశంకర్ ఉత్తమ కవిత్వం రాస్తున్న విశిష్ట కవి. మూడున్నర దశాబ్దాలకు పైగా రాస్తున్నప్పటికీ తాజాదనంగానీ, చిన్నదనంగానీ కోల్పోకుండా నిత్యనూతన కవిత్వం రాస్తున్న కవి. అయితే అతనలా నిత్యనూతన కవిత్వం ఇప్పటికీ ఎలా రాయగలుగుతున్నాడు? ఏమిటతని ప్రత్యేకత? ఇతర కవుల్తో పోల్చినపుడు ఏ విధంగా అతడు భిన్నమైన కవి? అని ఆలోచించాలి.

Pages