S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 05:09

హైదరాబాద్ ఆగస్టు 6: నగరంలోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఆదివారం జరుగనున్న బిజెపి బహిరంగ సభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

08/07/2016 - 05:05

చేవెళ్ల, ఆగస్టు 6: చదువు పేదరికానికి అడ్డుకాదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలఫ్‌మెంట్, పంచాయతీరాజ్, డైరెక్టర్ జనరల్ రాంపుల్లారెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని సిహెచ్‌ఆర్ గార్డెన్‌లో వివేకానంద జూనియర్, డిగ్రీకళాశాల ఫ్రెషర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివినప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.

08/07/2016 - 05:05

హైదరాబాద్, ఆగస్టు 6: కాలుష్య రహిత వాహనాలకు ప్రోత్సహకాలు అందిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం చందానగర్‌లోని స్పోర్ట్స్ హబ్‌ను ఆయన స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన హీరో సైకిల్ కంపెనీ వారి ఈ-బైక్ (ఎలక్ట్రికల్)ను ఆవిష్కరించారు.

08/07/2016 - 05:04

జీడిమెట్ల.ఆగస్టు 6: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే వివేకానందకు చెందిన రెండు భవనాలను జిహెచ్‌ఎంసి అధికారులు కోర్టు ఆదేశాల మేరకు శనివారం సీజ్ చేశారు. శివార్లలోని చింతల్‌లోని నారాయణ విద్యా సంస్థలు కొనసాగుతున్న రెండు బహుళ భవనాలను అనుమతి లేకుండా నిర్మించారని కొందరు కోర్టును ఆశ్రయించటంతో, ఆ భవనాలను సీజ్ చేయాలన్న కోర్టు ఆదేశం మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు సీజ్ చేశారు.

08/07/2016 - 05:03

శేరిలింగంపల్లి, ఆగస్టు 6: చందానగర్‌లోని గంగారం వద్ద గల సెంట్రో షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు అంతస్తుల భవనంలోని చెప్పులు, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఏడు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలు చల్లారుస్తున్నప్పటికీ రాత్రి వరకు మంటలు చల్లారలేదు. దీంతో జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు.

08/07/2016 - 05:01

హైదరాబాద్, ఆగస్టు 6: మిషన్ భగీరథ ప్రాజెక్టుతో ఇంటింటికీ రక్షిత తాగు నీరుతో పాటు ఇంటర్నెట్‌ను కూడా అందించనున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్‌కు తెలిపారు.

08/07/2016 - 05:00

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్రమోదీ మొట్టమొదటి సారిగా ఆదివారం నగరానికి రానున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించినానంతరం నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగే బిజెపి బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు కమలనాథులు నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు.

08/07/2016 - 04:43

రాజు, రమ అన్నా చెల్లెళ్లు. 7వ తరగతి చదువుతున్నారు. క్లాస్ జరుగుతుండగా ప్రిన్సిపాల్ గారు ఒక నోటీసు పంపారు. అందులో ‘పిల్లలూ..! ఇంకొక మూడు నాలుగు నెలల్లో మన స్కూలు వార్షికోత్సవం జరుగుతుంది. మీరు స్వయంగా తయారు చేసిన మోడల్స్ ఆరోజు ప్రదర్శించవచ్చు. వాటికి ఫస్టు, సెకండ్ ప్రైజులు ఉంటాయి. అందరూ మెచ్చినదానికి ప్రత్యేక బహుమతి కూడా ఉంటుంది.

08/07/2016 - 04:36

లహరి ఆ రోజు హడావిడిగా బయలుదేరింది. తనకు పెళ్లిచూపులు. ఏంటో ఒక్క సంబంధం కుదిరి చావడంలేదు. ప్రతిసారి స్వీట్స్‌కి, పూలకి, మ్యారేజ్ బ్యూరో వాళ్లకి ఈ ఖర్చులన్నీ పెట్టలేక ఛస్తుంది తను. అవును మధ్య తరగతి వాళ్లు చూడటానికి రిచ్‌గా ఉండేలా కనిపిస్తూ ఉంటారు. ఆ రోజు ఆఫీసుకు రావడానికి కూడా ఛార్జీల వరకే ఉంచుకుని వచ్చేవాళ్లు ఎంతమందో. ఒక్కోసారి ఛార్జీలు కూడా పక్కింటి వాళ్లని అడగవలసి వస్తుంది.

08/07/2016 - 04:26

‘ఏమిటే.. కామాక్షి.. బావున్నావా.. ఎన్ని సంవత్సరాలయ్యిందే నిన్ను చూసి. నా కొడుకు పెళ్లికి కూడా రాలేదు.. ఆయనకు పక్షవాతం వచ్చిందట.. నీకూ బాలేదట.. అలా చిక్కి పోయావేమిటే..’ ఫంక్షన్‌లో కలిసిన చెల్లెలి వరసయిన కామాక్షిని పలకరిస్తూ అంది పార్వతి.

Pages