S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 02:37

కర్నూలు, ఆగస్టు 6: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శనివారం రాత్రికి ఎగువనుంచి 1,68,764 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శనివారం 851.10 అడుగులకు చేరింది. జలాశయంలో 82.56 టిఎంసిల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 18,414 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

08/07/2016 - 02:32

జైపూర్, ఆగస్టు 6: బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గో సంరక్షణ శాలలో ఆకలి బాధ తాళ లేక, ఆలనా పాలనా చూసే వాళ్లు లేక 500కు పైగా ఆవులు మృత్యువాత పడడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఆవుల రాజకీయాలు నడుస్తున్న వేళ వెలుగు చూసిన ఈ సంఘటన అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఇబ్బందికరంగా మారింది.

08/07/2016 - 02:23

సూళ్లూరుపేట, ఆగస్టు 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల చివరలో జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.

08/07/2016 - 02:21

హైదరాబాద్/గజ్వెల్, ఆగస్టు 6: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గజ్వేల్‌లో ఇద్దరు ఐజిలు, ఇద్దరు డిఐజీలు, నలుగురు ఎస్పీలతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశామని డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు.

08/07/2016 - 02:18

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ బిజెపి శాఖ నిర్వహిస్తున్న మహా సమ్మేళనానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం తొలిసారి తెలంగాణలో అడుగు పెడుతుండటంతో బిజెపి నాయకులు, శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

08/07/2016 - 02:15

హైదరాబాద్, ఆగస్టు 6: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏపి పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల ఉద్యోగుల విభజనకు రంగం సిద్ధమైంది. ఈ షెడ్యూల్ పరిధిలో ఆర్టీసి, పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ, ట్రాన్స్‌కో, జెన్కో తదితర కీలకమైన సంస్థలు ఉన్నాయి. వీటి ఉద్యోగుల విభజనపై ఇంతవరకు రెండు రాష్ట్రప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

08/07/2016 - 02:14

హైదరాబాద్, ఆగస్టు 6: పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటం వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 25 వరకు సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు. ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్‌లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

08/07/2016 - 02:13

హైదరాబాద్, ఆగస్టు 6: మిషన్ భగీరథ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత మంచినీటితో పాటు ఇంటర్నెట్‌ను కూడా అందించనున్నట్లు రాష్ట్ర ఐటి మంత్రి కె.తారక రామారావు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్‌కు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల గురించి ఇస్రో చైర్మన్‌కు వివరించారు.

08/07/2016 - 02:11

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం
తెలంగాణలో జరుపనున్న పర్యటన వివరాలు ఇవే.
* మధ్యాహ్నం 2.20కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు.
* 2.25కు హెలికాఫ్టర్‌లో బేగం పేట నుంచి గజ్వేల్‌కు
* 3.01కి ‘మిషన్ భగీరథ’ పైలాన్ ఆవిష్కరణ
* 3.03 గ్రామాలకు నీటి సరఫరా పంపు ప్రారంభం

08/07/2016 - 02:10

చార్మినార్/హైదరాబాద్, ఆగస్టు 6: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమంజసమేనని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఇందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

Pages