S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 03:12

వరంగల్, జూలై 19: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా మంగళవారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో టిఎంయు ఘనవిజయం సాధించింది. ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగగా రాత్రి 9:30 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. వరంగల్ రీజియన్‌లో 11 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.

07/20/2016 - 03:12

వరంగల్, జూలై 19: వరంగల్ జిల్లాలో మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌లు సుడిగాలి పర్యటన చేశారు. వరంగల్ నగరంలో ప్రారంభమైన మంత్రుల పర్యటన ఏటూరునాగారం వరకూ కొనసాగింది.

07/20/2016 - 03:11

వరంగల్, జూలై 19: భద్రకాళీ ఆలయంలో గత 15 రోజులుగా జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉదయం ఆషాడ శుద్ధ పౌర్ణమిన అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భద్రకాళీ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరిగా అలంకరించారు.

07/20/2016 - 03:11

గోవిందరావుపేట, జులై 19: దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు నేడు తెలంగాణ వైపే ఉందని కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి, గిరిజన సంక్షేమ, టూరిజం శాఖ మంత్రి ఆజ్మీర చందూలాల్ అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం మండలంలో పర్యటించిన మంత్రులు మొదట లక్నవరం చేరుకొని బోటింగ్ చేశారు.

07/20/2016 - 03:10

ములుగు, జూలై 19: ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతోనే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి మండలంలోని జడ్పిహైస్కూల్‌లో నిర్మించిన అదనపు తరగతిగదులను ప్రారంభించిన అనంతరం మొక్కలు నాటారు.

07/20/2016 - 03:10

ఏటూరునాగారం, జూలై 19: ఏజన్సీ ప్రాంతంలోని ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి ప్రభుత్వ వైద్యశాల మోడల్ వైద్యశాలను తలపించేలా ఉందని వైద్యసిబ్బందికి కితాబిచ్చారు. మంగళవారం గిరిజనశాఖా మంత్రి చందూలాల్‌తో ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో హరితహారంలో భాగంగా మొక్కను నాటిన మంత్రి వైద్యశాలలోని పలు విభాగాలను, ఇన్, అవుట్ పేషంట్ల వార్డులను పరిశీలించారు.

07/20/2016 - 03:09

వరంగల్, జూలై 19: హరితహార కార్యక్రమంలో భాగంగా అన్ని ఆస్పత్రుల్లో ఒకే రోజు 4లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వరంగల్‌లో శ్రీకారం చుట్టారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 2,014 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.

07/20/2016 - 03:09

ములుగు/ములుగుటౌన్, జూలై 19: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 24శాతంగా ఉన్న అడవులను 33శాతానికి పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన గిరిజనశాఖా మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి ములుగు ఏజెన్సీలో పర్యటించారు.

07/20/2016 - 03:07

హైదరాబాద్, జూలై 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న పది జిల్లాలను 150 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ తొందరపాటు నిర్ణయమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడింది.

07/20/2016 - 03:07

హైదరాబాద్, జూలై 19: హరితహారంలో నాటిన మొక్కలను కాపాడేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సంరక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు.

Pages