S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 23:32

మహబూబ్‌నగర్, జూలై 4: వచ్చేనెలలో జరిగే పుష్కరాల నిమిత్తం బందోబస్తు పూర్తిస్థాయిలో ప్రణాళికబద్ధంగా చేసుకోవాలని జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలపై పోలీసుశాఖపరంగా గట్టి నిఘా ఉంచాలని హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.

07/04/2016 - 23:31

మహబూబ్‌నగర్, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 123 జిఓను పూర్తిగా వ్యతిరేకించి ఈ జిఓకు చట్టబద్దత లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే యూపిఏ ప్రభుత్వ హయంలో పార్లమెంట్‌లో తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టమే శ్రేయస్కారం అనే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.

07/04/2016 - 23:30

బిజినేపల్లి, జూలై 4: ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో భూములు కోల్పొతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంను అందించాలని, ఈ చట్టం రైతులకు శ్రీరామరక్ష అని మాజి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మా అన్నారు.

07/04/2016 - 23:29

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 4: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీం యువత చేడు అలవాట్లకు దూరంగా ఉండి పవిత్రతతో దైవచింతనలో గడపాలని ఎంఐఎం ఎంపి అసదుద్దిన్ ఒవైసి పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని జామా మసీదులో కొత్తగా నిర్మించిన ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లీం యువకులు దైవాంగిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.

07/04/2016 - 23:29

శ్రీశైలం ప్రాజెక్టు, జూలై 4: గత 10 రోజులుగా పడుతున్న వానలతో శ్రీశైలం రిజర్వాయర్ ఎగువ పరివాహక ప్రాంతంలో పడిన వానలతో రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 885 అడుగులకుగాను 784 అడుగులుగా ఉంది. గరిష్ట నీటినిలువ 210 టిఎంసిలకుగాను 21.95 టిఎంసిలుగా నీలు నిలువ ఉంది.

07/04/2016 - 23:28

అలంపూర్, జులై 4: దక్షిణకాశి శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం ఎక్సైజ్ అడిషనల్ కమీషనర్ ప్రసాద్ సతీసమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి సన్నిదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు.

07/04/2016 - 23:28

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని పల్సాబ్‌గుట్ట, రైల్వేస్టేషన్‌రోడ్, అయోధ్యనగర్ కాలనీలలోని వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయెధ్యనగర్ కాలనీలో సిసిరోడ్డ పనులను ఆయన ప్రారంభించారు.

07/04/2016 - 23:27

మహబూబ్‌నగర్, జూలై 4: తెలంగాణ హరితహారంలో భాగంగా జిల్లాలో ఐదు కోట్ల మొక్కలను నాటాలని సన్నదం అయ్యామని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి వెల్లడించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానం వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన తెలంగాణ హరితహారం ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, డిఇఓ కార్యాలయం, తెలంగాణ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు.

07/04/2016 - 23:25

సంగారెడ్డి టౌన్, జూలై 4: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దయా భిక్షతోనే ఎమ్మెల్యేగా గెలుపొంది చట్ట సభల్లోకి వెళ్లిన విషయాన్ని జగ్గారెడ్డి మరిచిపోయవా? అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే చరిత్ర నీదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. రాజకీయ పబ్బం కోసం లేని పోని ఆరోపణలు చేసి హిరో అవుదామునుకుంటే జిరో అవుతావని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ పార్టీపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

07/04/2016 - 23:25

దుబ్బాక, జూలై 4: రెండేండ్లలోగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి 7.50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మల్లన్నసాగర్‌ను అడ్డుకునేందుకు శిఖండిలా అడ్డుపడుతున్న కాంగ్రెస్, టిడిపిలు నామరూపాల్లేకుండా పోతాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని 5ఎఎంసి పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవ సభలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

Pages