S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 23:38

నిజామాబాద్, జూలై 4: తెలంగాణ హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా ఇంటింటా పెరటి మొక్కలను నాటించాలని, ఈ నెల 8వ తేదీన ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 28లక్షల పెరటి మొక్కలు నాటేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులకు సూచించారు.

07/04/2016 - 23:38

నిజామాబాద్, జూలై 4: బంగారు తెలంగాణకు బాటలు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ అమలు చేస్తుండగా, క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఈ పథకం కింద అడిగిందే తడవుగా ప్రభుత్వం మంజూరీలు ఇస్తూ, పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుండడంతో అక్రమార్కులు ఇదే అదనుగా భావిస్తూ అందిన మేరకు దోచుకుంటున్నారు.

07/04/2016 - 23:37

మోర్తాడ్, జూలై 4: నిర్మాణం జరిగి పక్షం రోజులైనా కాలేదు. 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తారురోడ్డు ఎక్కడిక్కడా ధ్వంసమైపోయింది. గడిచిన 8మాసాలుగా కొనసాగుతూ వచ్చిన రోడ్డు నిర్మాణం కనీసం కొన్ని రోజులైనా ప్రజలకు ఉపయోగపడలేకపోయింది. మోర్తాడ్‌లోని సురేష్‌కాలనీ వద్ద నుండి తక్కురివాడ, భీమ్‌గల్ రోడ్డును కలుపుతూ 35 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు.

07/04/2016 - 23:37

కంఠేశ్వర్, జూలై 4: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ప్రమాణస్వీకారం చేసిన ధర్మపురి శ్రీనివాస్ ఈ నెల 8వ తేదీన మొట్టమొదటిసారి జిల్లాకు విచ్చేస్తున్నారని, ఆయనకు టిఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కోరారు. సోమవారం నగరంలోని డిఎస్ నివాసంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు.

07/04/2016 - 23:36

మోర్తాడ్, జూలై 4: పాలన పగ్గాలు చేపట్టి సోమవారం నాటికి 2 సంవత్సరాలు పూర్తికావడంతో మోర్తాడ్ మండల కార్యాలయంలో ప్రజాప్రతినిధులు సంబురాలు జరుపుకున్నారు. మోర్తాడ్ ఎంపిపి కల్లెడ చిన్నయ్య అధ్యక్షతన సమావేశమైన ఎంపిటిసిలంతా గడిచిన రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించుకున్నారు.

07/04/2016 - 23:36

మాక్లూర్, జూలై 4: నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్ అని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్కొన్నారు.

07/04/2016 - 23:35

ఇందూర్, జూలై 4: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10నుండి 11గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 16 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ పి.విశ్వప్రసాద్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్‌డివిజన్ల పరిధి నుండి 16మంది వివిధ రకాల సమస్యలపై ఫోన్‌ల ద్వారా ఫిర్యాదు చేశారని చెప్పారు.

07/04/2016 - 23:35

వినాయక్‌నగర్, జూలై 4: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణికి సోమవారం 156్ఫర్యాదులు అందినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదులను కలెక్టర్ డాక్టర్ యోగితారణా, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, ఎజెసి రాజారాం, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు స్వీకరించారు. ఇందులో కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్ని ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపించారు.

07/04/2016 - 23:35

ఎల్లారెడ్డి, జూలై 4: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల గుండా వెళ్లాల్సిన భారీ వాహనం అంర్గత రహదారుల గుండా వెళ్లడంతోప్రయాణీకులు, వాహన దారులు ఇబ్బందులకు గురైయ్యారు. సోమవారం హైద్రాబాద్ నుంచి మహారాష్ట్ర నాసిక్‌కు 138 చక్రాలు కలిగిన భారీ వాహనం ఎల్లారెడ్డి ప్రధాన రహదారి మీదుగా వెళ్లింది. భారీ వాహనానికి 138 చక్రాలు ఉండటంతోప్రజలు వాహనం వెళ్లెంత వరకు భారీ వాహనాన్ని ఆసక్తిగా గమనించారు.

07/04/2016 - 23:34

వినాయక్‌నగర్, జూలై 4: తెలంగాణ ప్రాంతానికి హైకోర్టు ఏర్పాటు చేయకుండా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు చేస్తున్న కుట్రలను నిరసిస్తూ సోమవారం న్యాయవాదులు కోర్టు ఎదుట వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

Pages