S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 00:01

విజయనగరం(టౌన్), జూలై 4: జిల్లాను ప్రగతిబాటలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పల్లె రఘునాధరెడ్డి స్పష్టంచేసారు. సోమవారం సాయంత్రం జడ్పీ అతిధి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చంద్రన్న బాట పథకం ద్వారా గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

07/05/2016 - 00:00

నెల్లిమర్ల, జూలై 4: గ్రామ పం చాయతీ సాధనకు జరజాపుపేటలో ని ర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారానికి అర్థశత దినోత్సవానికి చేరుకున్నాయి. పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ దీక్షలకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం లభించింది. గ్రామంలో మహిళ లు, వృద్ధులు,చిన్నారులు, పురోహితు లు, దివ్యాంగులు, ఉద్యోగ విరమణ పొ ందిన వారు దీక్షల్లో కూర్చున్నారు.

07/05/2016 - 00:00

నెల్లిమర్ల, జూలై 4: నెల్లిమర్ల నగర పంచాయతీలో కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టామని కమిషనర్ అచ్చింనాయుడు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్యాలయంలో ఇంతవరకు కాగితాల ద్వారా పరిపాలన జరిగేదని చెప్పారు. ప్రభుత్వం ఇ-పరిపాలన జరపడానికి చర్యలు చేపట్టామన్నారు.

07/04/2016 - 23:59

గజపతినగరం, జూలై 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి 16కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెలుగు ప్రా ంతీయ సమన్వయకర్త కె. రాజేశ్వరి అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతవరకు రూ.2.50కోట్లు రుణాలు అందజేశామని తెలిపారు.

07/04/2016 - 23:59

గంట్యాడ, జూలై 4: ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిపూడి ఆదివారం పర్యాటకులతో కళకళాలాడింది. ప్రకృతి అందాలకు ప్రశాంత వాతావరణానికి నిలయమైన తాటిపూడి అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పలు వాహనాలలో భారీగా తరలివచ్చారు. ఉద్యోగులు, విద్యార్థులు ఇక్కడికి తరలివచ్చి సందడి చేశారు. తాటిపూడి జలాశయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న బోటులో షికారుచేస్తూ ప్రకృతి అందాలు తిలకిస్తూ తన్మయం చెందారు.

07/04/2016 - 23:58

నెల్లిమర్ల, జూలై 4: మండలంలోని కొండవెలగాడలో డయేరియా ప్రబలింది. గ్రామంలో సుమారు 20మంది వరకు డయేరియాతో స్థానిక పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నెల్లిమర్ల సిహెచ్‌సికి తరలించారు. గ్రామంలోని మొయిదపేట ఎస్సీ కాలనీ, రెడ్డికవీధి వాసు లు డయేరియాతో పిహెచ్‌సిలో చేరారు. వెంటనే స్పందించిన వైద్యులు నాగరాజు రోగులకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు.

07/04/2016 - 23:58

గజపతినగరం, జూలై 4: మండలంలోని లోగిస గ్రామంలో నిర్మించిన సమీకృత వసతి గృహంతో మెంటాడ, గజపతినగరం మండలాలోని వసతి గృహాలు పూర్తిగా మూతపడడమే కాకుండా ఇ క్కడ పనిచేసిన వసతి గృహం సంక్షేమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులను అక్కడికి తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది.

07/04/2016 - 23:57

వేపాడ, జూలై 4: మండలంలోని బల్లంకి పాల సంఘానికి నేడో,రేపో ఎన్నికలు జరిపేందుకు విశాఖ డెయిరీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షు డు తాతారావు పదవీకాలం పూర్తికావడంతో నూతన పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించా ల్సి ఉంది. ముందుగా అధ్యక్షు డు ఎన్నిక జరగాల్సి ఉన్నందున ఈ పదవి కోసం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పోటీ పడుతుండడం విశేషం.

07/04/2016 - 23:57

గజపతినగరం, జూలై 4: శ్రీకాకుళంలోని కొవ్వాడలో నెలకొల్పనున్న అణువిద్యుత్ ప్లాంటుకు వ్యతిరేకంగా ఈనెల 17వతేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సదస్సును విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పురం అప్పారావు కోరారు. సోమవారం స్థానిక ఎన్‌జిఓ హోమ్‌లో సదస్సు గోడ పత్రికలను విడుదల చేశారు.

07/04/2016 - 23:55

సూర్యాపేటటౌన్, జూలై 4: తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోన గాంధీ విగ్రహం వద్ద డిఈవో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా డిఈవో ముడుపులు తీసుకుంటున్నాడని ఆరోపించారు.

Pages