S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 05:31

ఒంగోలు, డిసెంబర్ 8 : రానున్న అసెంబ్లీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారనున్నాయ. దీంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం కీలకం కావడంతో గెలుపుగుర్రాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో తాము ఏ అభ్యర్థిని నిలబెట్టినా, చివరకు తమ కారు డ్రైవర్‌ను నిలబెట్టినా గెలుస్తారన్న అహంభావం ఉండటంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు.

12/09/2016 - 05:29

నెల్లూరు, డిసెంబర్ 8: తమ ఇంటి నివేశన స్థలాలను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కబ్జా చేశారంటూ కొందరు బాధితులు జిల్లా అధికారులను ఆశ్రయించడం, కాకాణిపై కేసు నమోదు కావడం సంగతి విదితమే. అయితే ఈ కేసులో అసలు కబ్జాదారుడు ఎవరనే విషయంలో జిల్లా యంత్రాంగం వద్ద అన్ని దస్త్రాలు ఉన్నట్లు తెలిసింది.

12/09/2016 - 05:27

కర్నూలు, డిసెంబర్ 8 : సరిగ్గా పాతికేళ్ల క్రితం పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నపుడు దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెంచడానికి సాక్షర భారత్ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించగా, నేటి ప్రధాని నరేంద్ర మోదీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాంకేతిక భారత్ కార్యక్రమం రూపొందిస్తున్నారు.

12/09/2016 - 05:24

చిత్తూరు, డిసెంబర్ 8: జిల్లాలోని సిపిఒ (పోలీసు కమ్యూనిటి ఆఫీసర్స్) వ్యవస్థ రాష్ట్రానికే ఆదర్శమైందని రాష్ట్ర డిజిపి సాంబశివరావు కొనియాడారు. గురువారం రాత్రి చిత్తూరు పోలీసు మైదానంలో జిల్లా స్థాయి సిపిఒల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/09/2016 - 05:22

కడప,డిసెంబర్ 8:పెద్దనోట్లు రద్దుచేసి నెలరోజులు పైబడినా నోట్ల కష్టాలు పెరుగుతూ చిన్ననోట్లు, పెద్దనోట్ల కోసం నోట్లు పాట్లు పడుతూనే జిల్లాలో ఆ ప్రాంతం ఈప్రాంతం అని లేకుండా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల్లో డబ్బులున్నా, సగానికి పైబడి ఏటిఎంలు తెరుచుకోక బ్యాంకుల వద్ద రోజురోజుకు భారీ రద్దీపెరిగి అరకొర కరెన్సీ ఉన్న ఏటిఎంల ముందు వందల్లో క్యూ కడుతున్నారు.

12/09/2016 - 05:19

అనంతపురం, డిసెంబర్ 8: రోజువారీ నగదు లావాదేవీల కోసం జనానికి ముప్పుతిప్పలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు దాటినా పరిస్థితి చక్కబడటం లేదు. డిజిటల్, ఆన్‌లైన్ లావాదేవీలకు అలవాటుపడాలని ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా అందుకు అనుగుణంగా ప్రజల్లో అవగాహన పెరగడం లేదు.

12/09/2016 - 05:17

నక్కలగుట్ట,డిసెంబర్ 8: దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులు ఏలాంటి శిక్షణ లేకుండానే ఉపాద్యాయ వృత్తిలోకి వస్తున్నారని, దీంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రొఫెసర్ బర్రీ స్పాండర్ అన్నారు. గురువారం వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో టీచింగ్ లర్నింగ్ సెంటర్ అధ్వర్యంలో మూడు రోజుల సెమినార్ ప్రారంభ సమావేశం జరిగింది.

12/09/2016 - 05:15

నిర్మల్ రూరల్, డిసెంబర్ 8: నిర్మల్ మండలం న్యూముజ్గికి చెందిన కౌలు రైతు పెద్దోళ్ల గంగాధర్ (48) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం గంగాధర్ 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకోని పత్తి , మొక్కజొన్న సాగు చేస్తున్నాడు.దిగుబడి సరిగా రాదని దిగాలు చెందాడని పేర్కోన్నారు. దీనికి తోడు రూ.

12/09/2016 - 05:13

సంగారెడ్డి, డిసెంబర్ 8: వ్యవసాయ రంగానికి సాగు నీటిని పూర్తిస్థాయిలో అందించి కోటి ఎకరాల మాగాణిని పచ్చగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు.

12/09/2016 - 05:11

నిజామాబాద్, డిసెంబర్ 8: సర్కారీ కొలువులు అత్తెసరు నోటిఫికేషన్లకే పరిమితం అవుతుండగా, కనీసం ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధినైనా ఏర్పాటు చేసుకుందామని ఆశిస్తున్న నిరుద్యోగ యువతకు రుణాల పంపిణీలో మొండిచేయి మిగులుతోంది. స్వయం ఉపాధి కల్పనకై అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు నిధుల లేమితో నీరుగారిపోతున్నాయి.

Pages