S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 22:59

మునుగోడు/నల్లగొండ రూరల్, డిసెంబర్ 9: మండలంలోని చల్మేడ గ్రామంలో వివాహిత గంగుల మంజుల(20) శుక్రవారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు నల్లగొండ మండలం అప్పాజీపేటకు చెందిన గంగుల నర్సింహ్మ యాదవ్, కళమ్మల ఏకైక కుమార్తె మంజులను రెండున్నర ఏళ్ల క్రితం మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన గుండెబోయిన మల్లేష్‌తో వివాహాం జరిపించారు.

12/09/2016 - 22:59

నాగార్జునసాగర్, డిసెంబర్ 9: బహుళార్ధసాధక ప్రాజెక్టు, తెలంగాణ, ఆంధ్రా తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పునాదిరాయికి నేటితో 61ఏండ్లు నిండి 62వ ఏండ్లు ప్రారంభమయ్యాయి. ఆనాడు భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రు తన కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజల జీవనాధారంగా 1955డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్‌కాలనీలో పునాదిరాయి వేశారు.

12/09/2016 - 22:58

నేరేడుచర్ల, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 24వేల లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామియేలు తెలిపారు. ఆయన శుక్రవారం నేరేడుచర్లలో నిర్వహించిన మాదిగల అలాయ్‌బలాయ్ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, పాల్వంచ, జగిత్యాల, కొత్తగూడెంలలో నూతన గోదాములు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

12/09/2016 - 22:58

నల్లగొండ టౌన్, డిసెంబర్ 9: గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన నగదు రహిత కార్యక్రమం నోడల్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీల విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు.

12/09/2016 - 22:57

నల్లగొండ, డిసెంబర్ 9: రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర హౌజింగ్ ముఖ్య కార్యదర్శి చిత్రరామచంద్రన్ స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయా జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం పథకం పురోగతిని సమీక్షించారు.

12/09/2016 - 22:18

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అందరం చెబుతాం. కాని ఆచరణలో పెట్టేది కొందరే. ఇల్లు కట్టాలన్నా.. ఏ చిన్న ఊరేగింపు కోసమైనా పచ్చని చెట్లను నరికేస్తుంటాం. ఇటీవలనే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కొన్ని రోజులు పాటు స్కూళ్లు సైతం మూతపడ్డాయి. అయినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోం. ప్రకృతిని ప్రేమిస్తే అది పదికాలాలపాటు మనల్ని చల్లగా చూస్తుందని బీహార్‌లోని మధుబనీ జిల్లా మహిళలు, బాలికలు నమ్మారు.

12/09/2016 - 22:16

చిన్ననాటి నేస్తాలను, గురువులను చూస్తే ఎవరికైనా ఆనందం వెల్లివిరుస్తుంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి ఐశ్వర్యా బచ్చన్ కూడా అలాంటి అనుభూతినే పొందింది. ముంబయిలోని నవోదయ ఇండియా డ్యాన్స్ థియోటర్‌లో ఏర్పాటుచేసిన ప్రపంచ స్థా యి నృత్య సమావేశానికి అతిథిగా ఐశ్వర్యారాయ్‌ను ఆహ్వానించారు. ఇదే సమావేశానికి నిర్వాహకులు ఐశ్వరారాయ్ చిన్ననాటి నృత్య గురువు లతాసురేంద్రను సైతం ఆహ్వానించారు.

12/09/2016 - 22:12

శనివారం సంత జరిగే ఊరని పొరబాటు పడుతుంటారు విన్నవారు. అది కాదు.
ఆ ఊరి కొండమీద నిలువుగా పాతిపెట్టిన ఎత్తయిన శిల ఉంది. శనిగ్రహ దోషాలున్నవారు ఆ శిలను శనివారంనాడు నువ్వుల నూనెతో అభిషేకిస్తే గ్రహదోషం తొలగిపోతుందని పురాతన కాలంనించీ నమ్మకం ఉంది.
ఆదిమానవుల నివాసాలు ఇక్కడ ఉండేవనీ, మరణించినవారిని పూడ్చిపెట్టి తలవైపున పెద్ద శిలను స్థాపించేవారని- ఈ శిల అటువంటిదేనని కొందరి అభిప్రాయం.

12/09/2016 - 22:04

గుండెజబ్బు
కారణాలు-నివారణలు
-డా.్భండారు రాధాకృష్ణమూర్తి
డా.్భండారు సులోచన
వెల: రూ.90/-
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
నవచేతన బుక్‌హౌస్
అన్ని ప్రముఖ పుస్తక
కేంద్రాలలో
**

12/09/2016 - 22:02

చలం నాన్న లేఖలు
సంపాదకులు డా. కె.అరుణజ్యోతి.
పుటలు:100, వెల:135, నవ్య పబ్లికేషన్స్ హైదరాబాద్,
ప్రతులకు: ఫో:040-24150533, శ్రీనివాసం అపార్ట్‌మెంట్స్,
సైదాబాద్ కాలనీ, హైదరాబాద్-59.
**

Pages