S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2016 - 22:55

జనతాగ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏమిటి? అనే ప్రశ్నకు ఇంకా సరైన జవాబు రాలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినా కూడా ఏది ఫైనల్ కాలేదు.

11/26/2016 - 22:53

ప్రయోగాల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న విక్రమ్ మరో క్రేజీ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. వీరిద్దరి క్రేజీ కలయికలో రూపొందే చిత్రమే ధ్రువనక్షత్రం. గౌతమ్ మీనన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఈ సినిమాలో హీరోగా మొదట వేరేవాళ్ళను హీరోగా అనుకున్నాడు. కానీ విక్రమ్ అయితే బెటర్ అని భావించిన గౌతమ్ ఫైనల్‌గా విక్రమ్‌తో ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు.

11/26/2016 - 22:53

రాఘవ లారెన్స్, రుతికా సింగ్ జంటగా అభిషేక్ ఫిలిం పతాకంపై పి.వాసు దర్శకత్వంలో రమేష్ పిళ్లై రూపొందిస్తున్న చిత్రం ‘శివలింగ’. షూటింగ్ అంతా పూర్తయిన సందర్భంగా దర్శకుడు వాసు మాట్లాడుతూ- చంద్రముఖి, ఆప్తమిత్ర స్టైల్లో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, శక్తివాసు ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామన్నారు.

11/26/2016 - 22:52

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజవౌళి తనయుడు కార్తికేయ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా? ప్రస్తుతం నటనపరంగా శిక్షణలో ఆరితేరుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాహుబలి సినిమాతోపాటు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా, కొన్ని సినిమాకు పబ్లిసిటీ డిజైనర్‌గా కార్తికేయ వర్క్ చేశాడు.

11/26/2016 - 22:39

ఆర్.లక్ష్మీధరమూర్తి, విజయవాడ (ఆంధ్ర)
ప్రశ్న:మీరు జ్యోతిష్యానికి సంబంధించిన భవిష్యకాలంలో వైద్య సంబంధమైన అనారోగ్యాలు కూడా చెపుతున్నారు. నా విషయంలో మీ మాట అక్షరాలా నిజమైంది. డాక్టర్ పరీక్షలో మీరు చెప్పినదే వచ్చింది. ఇది ఎలా సాధ్యం?
సమాధానం:జ్యోతిషం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వైద్య జ్యోతిషం అని కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక భాగం ఉంది.
కె.రాజవర్థన్, కొడంగల్ (తెలంగాణ)

11/26/2016 - 22:37

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

11/26/2016 - 22:25

ఇంతవరకు ఎటిఎంకు వెళ్లని ఎందరో మహిళలు
సోషల్‌మీడియాలో అనుభవాలు పంచుకుంటున్న వైనం

11/26/2016 - 08:14

విజయవాడ, నవంబర్ 25: అంతరిక్షం ప్రపంచ శాంతికి వినియోగించాలే గాని యుద్ధోన్మాదాన్ని పెంచి పోషించడం కొరకు కాదని యుఎస్‌ఎ గ్లోబల్ నెట్‌వర్క్ సమన్వయ కర్త బ్రూస్ గగనాన్ పేర్కొన్నారు.

11/26/2016 - 08:14

విజయవాడ, నవంబర్ 25: మహిళలకు మరింత చేరువయ్యేందుకు బాబు ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న స్ర్తిలకు మరింత స్వయం సహాయక సంఘాలుగా గ్రేడింగ్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వారి పని తీరును బట్టి ప్రభుత్వం ర్యాంకింగ్ అమలు చేస్తోంది. ఇందుకోసం ఆయా సంఘాల పనితీరు, బ్యాంకులో నెలనెలా పొదుపు, సక్రమంగా రుణాల చెల్లింపు వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించింది.

11/26/2016 - 08:13

పటమట, నవంబర్ 25: కస్టమ్స్ నోటిఫైడ్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల విదేశీ వస్తువులు అమ్మే షాపులు ఉన్నాయని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్.ఖాదర్ రెహమాన్ శుక్రవారం విజయవాడలోని ఆటోనగర్‌లోని ఎపి కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో తెలిపారు.

Pages