S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/19/2016 - 23:53

పాలకుర్తి, సెప్టెంబర్ 19: మండలంలోని ఈరవెన్ను గ్రామంలో అనారోగ్యంతో తమ్ముడు మృతిచెందడంతో ఆ వార్త తెలుసుకున్న అన్న గుండె ఆగి మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కాసోజు లక్ష్మీనర్సయ్య (68) సోమవారం మృతిచెందిన వార్త అన్న కాసోజు రామనర్సయ్య (81)కి తెలియడంతో గుండెపోటుతో మధ్యాహ్నం మృతిచెందాడు.

09/19/2016 - 23:53

వడ్డెపల్లి సెప్టెంబర్ 19: తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలుసుకోకుండా మంత్రి హరీష్‌రావు, ఎంపి కవిత బిజెపిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని భాజపా తెలంగాణ అభివృద్దికమిటి చైర్మన్ నరహరి వేణుగోపాల్ రెడ్డిఅన్నారు.సోమవారం జిల్లాపార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/19/2016 - 23:52

వరంగల్, సెప్టెంబర్ 19: మదర్ థెరిస్సా మార్గంలోనే ప్రతి ఒక్కరు పయనించాలని, దేశానికి ఆమె చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మదర్ థెరిస్సాకు సెయింట్‌హుడ్ అవార్డు వచ్చిన సందర్భంగా సోమవారం వరంగల్ నగరంలోని కాజీపేట హౌస్ ఆఫ్ జాయ్‌లో ప్రపంచ శాంతి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/19/2016 - 23:52

చేర్యాల, సెప్టెంబర్ 19: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి చెవిటి కిష్టయ్య (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయ. గ్రామానికి చెందిన కిష్టయ్య తనకున్న మూడెకరాల భూమితో పాటు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న పంటలు వేసి సాగుచేస్తున్నాడు.

09/19/2016 - 23:51

మహబూబాబాద్, సెప్టెంబర్ 19: మహబూబాబాద్ జిల్లా అవుతున్న నెపథ్యంలో తాత్కాలిక కలెక్టరెట్ ఏర్పాటు చెయనున్న యువజన శిక్షణాకేంద్రం భవనానికి సకల హంగులు సమకూరుస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. మానుకోటలోని వైటిసి భవనాన్ని సోమవారం ఆయన సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వివిద శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు.

09/19/2016 - 23:50

వరంగల్, సెప్టెంబర్ 19: జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు పోతుంది.

09/19/2016 - 23:50

జనగామ టౌన్, సెప్టెంబర్ 19: జనగామలో నేడు(మంగళవారం) నిర్వహించే జనగర్జనను విజయవంతం చేయాలని కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో సోమవారం జనగామ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మహిళలు ఇళ్లిళ్లు తిరుగుతూ బొట్టు పెట్టి గర్జనకు ఆహ్వానించారు. అలాగే డప్పుచాటింపుతో ప్రచారం చేశారు.

09/19/2016 - 23:48

బాసర, సెప్టెంబర్ 19: బాసర మండల కేంద్రంగా ప్రతిపాదనలు సిద్ధం కావడంతో సోమవారం వ్యవసాయశాఖ కార్యాలయ భవనాల కోసం ఎడి అంజిప్రసాద్, ఎవో ఇబ్రహీం అనిల్‌లు గ్రామంలోని ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. పోచమ్మగల్లిలోని పాత పంచాయతీ భవనాన్ని కార్యాలయంగా ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ హన్మంత్‌రావు, పోతన్న, బల్గం దేవేందర్ రైతులు తదితరులు ఉన్నారు.

09/19/2016 - 23:48

ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబర్ 19: వరంగల్ రేంజ్ డిఐజి వెంకట నాయుడు సోమవారం పట్టణంలోని సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి సబ్ జైలును తనిఖీ చేస్తామని, అందులో భాగంగా సోమవారం పట్టణంలోని సబ్ జైలును తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ రేంజ్‌లో 16 సబ్ జైళ్లు ఉన్నాయని, వాటిని కూడా తనిఖీ చేస్తామని తెలిపారు.

09/19/2016 - 23:48

ఆదిలాబాద్, సెప్టెంబర్ 19: ఓ మైనర్ బాలికలపై అత్యాచారం జరిపిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం మహిళా కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి అరుణసారిక తీర్పునిచ్చారు.

Pages