S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/19/2016 - 23:59

కాకినాడ, సెప్టెంబర్ 19: భారత సైనికులపై దాడి చేసి సుమారు 20 మంది మృతిని నిరశిస్తూ ఉగ్రవాద దిష్టిబొమ్నను ఎబివిపి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. స్ధానిక భానుగుడి సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని సోమవారం చేశారు. మృతులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు కె సాయిరామ్, సాంబమూర్తి, సాగర్, వివిధ కళాశాలల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

09/19/2016 - 23:58

కాకినాడ, సెప్టెంబర్ 19: ప్రజారోగ్యం పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, సమస్యాత్మక గ్రామాలలో రానున్న రెండు, మూడు వారాల్లో పారిశుద్ధ్య సమస్యలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

09/19/2016 - 23:58

చింతూరు, సెప్టెంబర్ 19: పోలవరం నిర్వాసితులకు మేలైన పరిహారం అందేదాక సిపిఎం పోరాటం చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సోమవారం చింతూరు ఐటిడిఎ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన 36 గంటల నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు.

09/19/2016 - 23:57

పెద్దాపురం, సెప్టెంబర్ 19: ఇటీవల జిల్లాలో పలు నేరాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల మూఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ విలేఖరులు సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

09/19/2016 - 23:57

విఆర్‌పురం, సెప్టెంబర్ 19: మండలంలో కాళ్లవాపు కేసులు ఇంకా వస్తున్న సందర్భంలో సీజనల్ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రంపచోడవరం ఐటిడిఏ పిఒ చక్రధరబాబు అన్నారు. సోమవారం ఆయన మండల పరిధి చినమట్టపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి గిరిజనులతో మాట్లాడారు. గ్రామంలో ఎవరికైనా జ్వరాలు కాని, కాళ్లవాపులు కాని వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు రావాలని సూచించారు.

09/19/2016 - 23:57

కపిలేశ్వరపురం, సెప్టెంబర్ 19: మండలంలోని అంగర గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలపై గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గీయులు రాళ్లు రువ్వారంటూ దళితులు ఆరోపిస్తూ అంగర పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సినీ నటుడు చిరంజీవి ఫ్ల్లెక్సీని చింపివేశారంటూ కాపు సామాజిక వర్గీయులు చేసిన ఫిర్యాదుపై కూడా అంగర పోలీసులు కేసు నమోదు చేశారు.

09/19/2016 - 23:56

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 19: గిరిజనులను ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోలు హత్యలకు పాల్పడడం తగదని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ హితవు పలికారు. ఏజెన్సీ ప్రాంతంలో గత జూలై 29వ తేదీన మావోల చేతులో హత్యకు గురైన పాస్టర్ వి మారయ్య ప్రభుత్వం ప్రకటించిన 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఆయన భార్య మంళదేవికి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అందజేశారు.

09/19/2016 - 23:56

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: భారత సైనిక స్థావరాలపై పాక్ ప్రేరేపిత జైషీ మహ్మద్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో సోమవారం పాకిస్తాన్ ఉగ్రవాది దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

09/19/2016 - 23:55

గండేపల్లి, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మధురపూడి విమానాశ్రయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా గండేపల్లి జాతీయ రహదారిపై జగ్గంపేట సిఐ కాశీ విశ్వనాథం సిబ్బందితో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వెడుతున్న వాహనాలను తనిఖీ చేసినట్టు చెప్పారు.

09/19/2016 - 23:54

నక్కలగుట్ట, సెప్టెంబర్ 19: కాకతీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమైనారని, తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు విసి కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంత కాలంగా కెయులో అనేక సమస్యలు పేరుకుపోయాయని, వాటి నివారణకు అధికారులు ఏ మాత్రం చొరవ చూపకపోవడం సిగ్గుచేటని అన్నారు.

Pages