S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:52

ఏలూరు, జూలై 21 : ఎప్పటిలానే రిజిస్ట్రార్ కార్యాలయం కిటకిటలాడిపోతూనే వుంది. గురువారం మధ్యాహ్నం సమయంలో రిజిస్ట్రేషన్లకు పెద్ద ఎత్తున క్రయ విక్రయదారులు చేరుకున్నారు. వారితోపాటే లేఖరులు కూడా బిజీబిజీగా తిరుగుతున్నారు. అంతా ఊపిరిసలపకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారు.

07/22/2016 - 07:28

విశాఖపట్నం (క్రైం), జూలై 21 : వార్డెన్ నిర్లక్ష్యం వల్ల గిరిజన విద్యార్థి మృతి చెందాడని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆందోళన చేశారు. కంచరపాలెంలోని గిరిజన హాస్టల్లో బోని రాజకుమార్ (23) కృష్ణా కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం పచ్చకామెర్లు సోకడంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ తరుణంలో బుధవారం రాజ్‌కుమార్ పరిస్థితి విషమించడంతో కెజిహెచ్‌కు తరలించారు.

07/22/2016 - 07:28

జగదాంబ, జూలై 21: పర్యావరణ, పర్యాటక ఉద్యానవనంగా కంబాలకొండను మరింత అభివృద్ధి చేయడానికి పర్యావరణ నిపుణులు, మేధావులు సలహాలు, సూచనలు అందించాలని పర్యావరణ అటవీశాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పివి రమేష్ అన్నారు. గురువారం నోవాటెల్ కంబాలకొండ ఎకోటూరిజంపై జరిగిన రెండు రోజుల వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు.

07/22/2016 - 07:27

విశాఖపట్నం, జూలై 21: పచ్చిమిర్చి మంట పుట్టిస్తోంది. కిలో వంద రూపాయలకు చేరిన పచ్చిమిర్చి నాణ్యత కూడా సరిగా లేదు. రంగు మారి, చేదుగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. బయట మార్కెట్లలో దీని ధర రోజురోజుకీ పెరిగిపోతుండగా రైతుబజార్లలో సైతం కిలో రూ.75లకు మించిపోయింది. ఇదే తరహాలో అల్లం సైతం ఘాటెక్కిపోతోంది. కిలో అల్లం రూ.70 నుంచి 90 వరకు పలుకుతోంది.

07/22/2016 - 07:27

విశాఖపట్నం, జూలై 21: విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా 23వ తేదీన ఉదయం 9.40 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి నగరంలోని సీతమ్మధార ప్రాంతానికి వస్తారు. 10 గంటల నుంచి 10.50 గంటల వరకు ఇక్కడ డిజిటల్ ఎపిలో భాగంగా 100 మీ-సేవా కేంద్రాలకు సంబంధించిన వుడా వాణిజ్య సముదాయాన్ని సిఎం లాంఛనంగా ప్రారంభిస్తారు.

07/22/2016 - 07:26

పరవాడ, జూలై 21: పేదలకు పక్కా గృహాలను కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. పరవాడలో ఇటీవల నిర్మించిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహాలను ఆమె పరిశీలించారు. గురువారం పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి గృహాలను పరిశీలించి వౌలిక సదుపాయాలను ఎంత వరకు కల్పించింది తెలుసుకున్నారు.

07/22/2016 - 07:25

అచ్యుతాపురం, జూలై 21: రాష్ట్రంలో పేదలకు రెండుల పక్కాగృహాలు మంజూరయ్యాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి మృణాలిని తెలిపారు. గురువారం సిఎం పర్యటన వివరాలను సమీక్షంచడానికి విచ్చేసిన ఆమె స్థానిక విలేఖర్లలతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల గృహాలు మంజూరైనట్టు తెలిపారు. ఆగస్టు నెలలో ఈ గృహాలను ప్రారంభిస్తాన్నారు. ఒక్కోక్క గృహానికి రూ. 2.25 లక్షల రూపాయల నిధులు ఇస్తున్నట్టు చెప్పారు.

07/22/2016 - 07:25

సీలేరు, జూలై 21: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు గురువారం బలిమెలలో సమావేశమై నీటి వాడకంపై లెక్కలు కట్టారు. దీని ప్రకారం బలిమెల జలాశయంలో ప్రస్తుతం 54 టిఎంసిలు నీటి నిల్వలున్నట్లు లెక్కలు తేల్చారు.

07/22/2016 - 07:25

గూడెంకొత్తవీధి, జూలై 21: అమరులైన మావోయిస్టుల త్యాగాలు వృథాగా పోవని ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంత మావోయిస్టు నాయకులు పేర్కొన్నారు. ఎ. ఓ.బి. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా 40 అడుగుల భారీ స్థూపాన్ని అవిష్కరించారు. అమరులైన మావోయిస్టు నేతలైన రవి, ఆజాద్, శరత్, ఆనంద్, గణపతి, కమలల జ్ఞాపకార్ధం భారీ స్మారక స్థూపాన్ని నిర్మించారు.

07/22/2016 - 07:24

అచ్యుతాపురం, జూలై 21: ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా అచ్యుతాపురం వస్తున్న నారా చంద్రబాబునాయుడుకు అఖండ ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పిలుపునిచ్చారు.

Pages