S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 15:14

దిల్లీ: భద్రతావ్యవస్థను దాటుకుంటూ పార్లమెంటులోకి ఎలా వెళ్లాలన్న విషయమై వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో శుక్రవారం కూడా సభ్యులు డిమాండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించి ఎవరు ఎలాంటి తప్పు చేసినా క్షమించరాదన్నారు.

07/22/2016 - 15:14

దిల్లీ: భద్రతా వ్యవస్థను ఛేదించి పార్లమెంటులోకి వెళ్లడంపై ఓ వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ వ్యవహారంపై శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్, బిజెపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎదుట వెంటనే హాజరు కావాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ భగవంత్ మాన్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన స్పీకర్ ఎదుట హాజరై సుమారు 20 నిమిషాలపాటు వివరణ ఇచ్చారు.

07/22/2016 - 15:10

దిల్లీ: అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఆప్‌ సభ్యుడు భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ భాజపా సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు.

07/22/2016 - 14:53

హైదరాబాద్: కబాలి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలనుకొనేవారికి థియేటర్ల లో హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గణేష్ థియేటర్‌లో బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. అభిమానులు బ్లాక్ టికెట్ల వ్యవహారంపై ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

07/22/2016 - 14:34

విజయవాడ: తమకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పోలవరం ప్రాజెక్ట్‌ సైట్‌ ఆఫీస్‌ దగ్గర ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఉద్యోగులు మూడు రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయి.

07/22/2016 - 14:29

మహబూబ్‌నగర్: మక్తల్ మండలం భూత్పూర్ నుంచి జలసాధన సమితి మహా పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే చేపట్టాలంటూ పాదయాత్రను చేపట్టారు. కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, బీజేపీ నేత మురళీధర్‌రావు, సీపీఐ నేత గుండా మల్లేష్, టీడీపీ నేతలు, రావుల, బక్కని, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

07/22/2016 - 14:27

హైదరాబాద్: కర్నూలులో కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు అవినాష్‌రెడ్డి, రఘురాంరెడ్డి శుక్రవారం సీఎస్ టక్కర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 874 అడుగుల నీరు చేరేవరకు కిందకు విడుదల చేయరాదని, తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని కోరారు.

07/22/2016 - 14:24

హైదరాబాద్: హైదర్‌గూడ‌లో అదృశ్యమైన చిన్నారులు మాధవి, వైష్ణవిలను శుక్రవారం పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి కొట్టడం వల్లే మాధవి తాతగారింటికి పారిపోయిందని, తానూ వస్తానని చెప్పడంతో వైష్ణవిని తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.

07/22/2016 - 14:22

విజయవాడ: కంచికచర్ల మండలం దొనబండ దగ్గర గ్రానైట్‌ క్వారీలో శుక్రవారం బ్లాస్టింగ్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

07/22/2016 - 14:14

విజయవాడ: 4,548 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఏపీ డీజీపీ రాముడు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేరుతో వెబ్‌సైట్‌‌ను ప్రారంభించారు. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డీజీపీ తెలిపారు.

Pages