S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 23:15

కరీంనగర్, ఏప్రిల్ 29: సిఎం కెసిఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రాన్ని పాలిస్తూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.

04/29/2016 - 23:14

గంభీరావుపేట, ఏప్రిల్ 29: కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించనున్నట్లు టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో సింగిల్ విండొ ఆధ్వర్యంలో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కరువు నెలకొనివుందని రైతులు అధైర్యపడవద్దన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా కరువు నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

04/29/2016 - 23:14

మల్లాపూర్, ఏప్రిల్ 29: మండలంలోని రాఘవపేటలో రామసాగర్ చెరువును పోలీస్‌శాఖ దత్తత తీసుకోగా చెరువుల పూడికతీత పనులను జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు చెరువులు దత్తత తీసుకున్నామని అన్నారు. నెల రోజుల లోపల ఈ పనులను పూర్తి చేస్తామని అన్నారు. భారతదేశంలో మిషన్‌కాకతీయ పనులపై నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తాన్నారని అన్నారు.

04/29/2016 - 23:13

పెగడపల్లి, ఏప్రిల్ 29: ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయతో అడుగంటిన భూగర్భ జలాలను కాపాడుకోవడమే కాకుండా ఊర చెరువులకు మహార్దశ కలుగుతుందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం పెగడపల్లి మండలంలోని గ్రామాల్లో నర్సింహునిపేట, మ్యాకవెంకయ్యపల్లె, మద్దులపల్లె, సుద్దపల్లి మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు.

04/29/2016 - 23:13

లీగల్ (కరీంనగర్), ఏప్రిల్ 29: కరీంనగర్ బార్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది గోపు మదుసూధన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కొరివి వేణుగోపాల్‌పై 203 ఓట్ల తేడాతో విజయదుందుభి మోగించి అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో గోపు మదుసూధన్ రెడ్డికి 406 ఓట్లు పోలవ్వగా, తన సమీప ప్రత్యర్థి కొరివి వేణుగోపాల్‌కు 203 ఓట్లు పోలయ్యాయి.

04/29/2016 - 23:12

కరీంనగర్‌టౌన్, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటన పైన జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమిబసు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మే 1న రాత్రి కరీంనగర్‌కు చేరుకొని బస చేస్తారని, 2న ఉదయం కరీంనగర్ నుండి కాళేశ్వరం చేరుకుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

04/29/2016 - 23:12

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 29: నగరంలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరి వినియోగించాలంటూ గత నాలుగుమాసాలుగా అధికారులు జరిమానాలు విధిస్తూనే ఉన్నారు. అయితే, ఒకటి,రెండుసార్లు ప్రకటనలు మాత్రమే ఇచ్చిన అధికారులు.. సరైన ప్రచారం చేయకపోవటంతో ఇది తెలియని నగరవాసులు ట్రాఫిక్ పోలీసుల బారినపడి చలానాల రూపంలో జరిమానాలు చెల్లిస్తున్నారు.

04/29/2016 - 23:11

వేములవాడ, ఏప్రిల్ 29:శ్రీ రాజరాజేశ్వరస్వామిని హుండి ఆదాయం రూ.1.22కోట్లు సమకూరింది. శుక్రవారం ఆలయ ఆవరణలోని ఓపెన్ కాంప్లెక్స్‌లో ఇవో రాజేశ్వర్ పర్యవేక్షణలో ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలమైన శ్రీ నగేశ్వరాలయం, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాల హుండిలను లెక్కించారు. ఈ లెక్కింపు రూ.1.22కోట్లు ఆదాయం సమకూరింది. బంగారం 197 గ్రాములు, వెండి 13 కిలోలు వచ్చింది.
ఆలయంలో భక్తుల రద్దీ

04/29/2016 - 23:10

భీమదేవరపల్లి, ఏప్రిల్ 29: ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్‌ను తీర్చిదిద్దిన సహకార గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ మారుపాటి లక్ష్మారెడ్డి (65) అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందారు. గత కొద్ది కాలంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు అందించినప్పటికీ ఆయన మృతి చెందారు.

04/29/2016 - 22:20

ఆదిలాబాద్, ఏప్రిల్ 29: జిల్లాలో ముదురుతున్న ఎండల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి, రైతులు ఎదుర్కొంటున్న కరవు సమస్య శనివారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధాన ఏజెండాగా మారనుంది. ఈ వేసవిలో 280 గ్రామాలను నీటి ఎద్దడి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు ప్రజల దాహార్తిని తీర్చేందుకు 200 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

Pages