S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/09/2017 - 00:20

కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 8: ఉల్లిగడ్డ ధర ఒక్కసారిగా పడిపోవడంతో కర్నూలులో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలు ఉల్లి ధర శుక్రవారం 400 రూపాయలే పలకడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఉల్లిగడ్డల్ని రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని కోడుమూరు, గూడూరు, పత్తికొండ, వెల్తుర్తి, ఉల్లిందకొండ, బేతంచర్ల తదితర ప్రాంతాల నుండి రైతులు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లి తరలిస్తున్నారు.

09/08/2017 - 01:00

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్.. దేశంలోనే తమ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఏర్పాటు చేసింది. నానాటికీ ఆన్‌లైన్ మార్కెటింగ్ గణనీయంగా పుంజుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు మరింత వేగంగా సేవలను అందించాలనే లక్ష్యంతో వెళ్తోంది అమెజాన్.

09/08/2017 - 00:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐకి చెందిన బీమా రంగ సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ).. ఈ నెల 15న రానుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ ఐపిఒ 19న ముగియనుంది. ఈ మేరకు గురువారం ఐసిఐసిఐ బ్యాంక్ తెలియజేసింది. షేర్ల ధరల శ్రేణి రూ. 651-661గా, 5,700 కోట్ల రూపాయల నిధుల సమీకరణ లక్ష్యంగా చెప్పింది.

09/08/2017 - 00:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మెక్‌డొనాల్డ్స్‌తో కుదుర్చుకున్న ఫ్రాంచైజ్ లైసెన్స్ ఒప్పందం రద్దునకు వ్యతిరేకంగా విక్రమ్ బక్షీ దాఖలు చేసిన పిటీషన్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులనూ జారీ చేయలేమని నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) గురువారం స్పష్టం చేసింది.

09/08/2017 - 00:57

ముంబయి, సెప్టెంబర్ 7: టెక్‌టెక్స్‌టైల్ ఇండియా 2017లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి అవుతోంది. రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడంలో భాగంగా మదుపరులను ఆకర్షించడానికే ఇందులో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తమ టెక్స్‌టైల్ విధానాలు, వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను తెలంగాణ సర్కారు ఆయా టెక్స్‌టైల్ సంస్థలకు వివరించనుంది.

09/08/2017 - 00:56

హైదరాబాద్, సెప్టెంబర్ 7: భారత వ్యవసాయ రంగం అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలన్నదే ఇంగ్లాండ్ ప్రభుత్వ లక్ష్యమని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. గురువారం ఇక్కడ వ్యవసాయ రంగ అధునాతన పరిజ్ఞాన ప్రదర్శనా వేదికైన ‘అగ్రిటెక్స్ 2017’ను ఫ్లెమింగ్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వార్షిక ఎగ్జిబిషన్‌లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతోపాటు పలు విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి.

09/08/2017 - 00:54

స్మార్ట్ఫోన్ల తయారీదారు వివో.. దేశీయ మార్కెట్‌కు గురువారం వి7ప్లస్ మోడల్ స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసింది.
ముంబయలో దీన్ని ప్రదర్శిస్తున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్. దీని ధర 21,990 రూపాయలు. 5.99 అంగుళాల స్క్రీన్,
4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ దీని సామర్థ్యం.
256జిబి వరకు మెమరీని పెంచుకోవచ్చు. 16 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 24 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా దీని సొంతం

09/08/2017 - 00:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పిఎమ్‌జికెవై) క్రింద 21 వేల మంది 4,900 కోట్ల రూపాయల విలువైన నల్లధనాన్ని బహీర్గతపరిచారని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. నిరుడు నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం పిఎమ్‌జికెవై పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పరిచయం చేసినది తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31న ఈ పథకం ముగిసిపోయింది.

09/08/2017 - 00:51

విజయవాడ, సెప్టెంబర్ 7: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాష్ట్రంలో 11.72 శాతం మేర వృద్ధిరేటు నమోదైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. గత ఏడాది ఇదే కాలానికి పోలిస్తే ఈసారి మెరుగైన వృద్ధిరేటు సాధించామని తెలిపారు.

09/08/2017 - 00:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వౌలిక, విద్యుత్, ఎగుమతి రంగాలపై దృష్టిపెడితేనే దేశ జిడిపి వృద్ధిరేటు పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. గురువారం ఇక్కడ తన పుస్తకం ‘ఐ డూ వాట్ ఐ డూ’ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థిరమైన జిడిపి వృద్ధిరేటు కోసం వౌలిక, విద్యుత్, ఎగుమతి రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Pages