S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/21/2015 - 04:20

న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 23.6 శాతం పెంచాలంటూ 7వ వేతన సంఘం చేసిన సిఫార్సు అమలుతో ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి రేటింగ్, బ్రోకరేజ్ ఏజెన్సీలు. అయితే ఆర్థిక లోటు లక్ష్యాలకు భంగం వాటిల్లకుండా, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర ప్రభుత్వం కనబరుస్తోంది.

11/21/2015 - 04:20

న్యూఢిల్లీ, నవంబర్ 20: సైబర్ నేరాలకు దేశంలో దాదాపు 11.3 కోట్ల మంది సగటున రూ. 16,558 మేర నష్టపోయారని, దీనికి తోడు వ్యక్తిగత ఆర్థిక వివరాలు బైటి వాళ్లకు లీక్ అయినందుకు మానసిక ఒత్తిడికి సైతం గురయ్యారని సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ఇండియా ఒక నివేదికలో వెల్లడించింది.

11/21/2015 - 04:19

విశాఖపట్నం, నవంబర్ 20: విశాఖలో జెట్ హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ సిఇఒ క్రేమర్ బాల్ తెలియచేశారు. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు కొత్త విమానాలను నడిపేందుకు ఉన్న అవకాశాలపై నగరానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన శుక్రవారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఢిల్లీ, ముంబయికి కొత్త విమాన సర్వీసులను నడపడానికి నిర్ణయించామన్నారు.

11/21/2015 - 04:19

విశాఖపట్నం, నవంబర్ 20: విశాఖ కంటైనర్ టెర్మినల్‌కు శుక్రవారం భారీ నౌక వచ్చింది. 318 మీటర్ల పొడవున్న ఎంవి మెర్క్స్ సీబార్క్ అనే నౌక ఇక్కడికి చేరుకుంది. విశాఖ పోర్టు చరిత్రలో ఇంత భారీ కంటైనర్ నౌక ఇప్పటి వరకూ రాలేదు. ఈ నౌక 6,648 కంటైనర్లను మోసుకు వెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా కంటైనర్ టెర్మినల్‌లో జరిగిన కార్యక్రమానికి ఐఆర్‌టిఎస్ అధికారి పిఎల్ హర్‌నాథ్ హాజరయ్యారు.

11/21/2015 - 04:18

ముంబయి, నవంబర్ 20: తమ పాపులార్ ‘బ్లాక్ ఫ్రైడే’ సేల్‌ను భారత్‌కు తెస్తున్నట్లు ఆన్‌లైన్ మార్కెటీర్ ఈబే శుక్రవారం తెలియజేసింది. అమెరికాలో క్రిస్‌మస్ సందర్భంగా హాలిడే షాపింగ్ సీజన్‌కు బ్లాక్ ఫ్రైడేతో ఈబే తెరతీస్తుంది. ఇందులో భారీ రాయితీలతో గొప్ప ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంది. అంతర్జాతీయంగా ఈ నెల 27న బ్లాక్ ఫ్రైడేను నిర్వహిస్తున్నారు.

11/21/2015 - 04:17

ముంబయి, నవంబర్ 20: ప్రైవేట్‌రంగ సంస్థ కొటక్ మహీంద్ర జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి బీమా వ్యాపారం చేయడానికి ఐఆర్‌డిఎఐ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా శుక్రవారం కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. దీంతో బీమా రంగ రెగ్యులేటర్ నుంచి తమకు రావాల్సిన అన్ని అనుమతులూ వచ్చాయంది.

11/21/2015 - 04:17

ముంబయి, నవంబర్ 20: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య మదుపరులు, రిటైలర్లు పెట్టుబడులపట్ల కాస్త ఆసక్తి కనబరిచారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు పడుతూ, లేస్తూ సాగిన పయనంలో చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.

11/21/2015 - 04:16

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఆహారోత్పత్తుల ధరలు ఒక్కొక్కొటిగా ఆకాశానికేసి పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం అదుపునకు తమవద్ద అద్భుత శక్తి ఏమీ లేదని కేంద్ర ఆహార, వినియోగదారుల సంబంధాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం అన్నారు.

03/14/2015 - 12:09

కొలంబో, మార్చి 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, శ్రీలంక శుక్రవారం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌కు వ్యూహాత్మక పొరుగుదేశంగా ఉన్న శ్రీలంకతో సంబంధాలను పెంపొందించుకునేందుకు చేపట్టనున్న పలు చర్యలను మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు.

Pages