S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/04/2017 - 00:58

అనకాపల్లి, సెప్టెంబర్ 3: అన్‌సీజన్‌లో సైతం బెల్లం ధరలు పెరగకపోగా తగ్గుతుండటంతో నిల్వలు వేసిన వ్యాపారులు అపార నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మార్కెట్‌లో గత సీజన్‌లో బెల్లానికి మంచి ధర పలికిన సమయంలో సైతం పెద్దమొత్తంలో నిల్వలు వేశారు. పదికిలోల మంచి రంగు కలిగిన బెల్లాన్ని 300 నుండి 450 రూపాయల వరకు ధర చెల్లించి కొనుగోలు చేశారు.

09/04/2017 - 00:56

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణలో పరిశ్రమల రంగానికి శుభవార్త. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను సముద్ర మార్గం ద్వారా చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా రెండు డ్రై పోర్టుల ఏర్పాటు ప్రదేశాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ గుర్తించింది. ఈ డ్రై పోర్టుల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.3700 కోట్లు. భువనగిరి-చౌటుప్పల్-చిట్యాల, జహీరాబాద్‌లో తొలి దశలో రెండు డ్రై పోర్టులను ఏర్పాటు చేస్తారు.

09/04/2017 - 00:54

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: ఈ ఏడాది కాఫీ పంట దిగుబడి మరింతగా పెరగనుంది. గిరిజన సహకార సంస్థ(జిసిసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదేళ్ళ కాఫీ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది దీనిని పెంచేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గత రెండేళ్ళ కంటే కూడా ఈసారి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. డిసెంబర్ నుంచి కాఫీ గింజలు సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

09/03/2017 - 01:04

ముంబయి, సెప్టెంబర్ 2: ఓ వైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం వరసగా మూడో వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధాన సూచీలయిన సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా గత వారం ఊపునే కొనసాగిస్తూ ఆల్‌టైమ్ హైకి చేరువయ్యాయి. డోక్లాంలో భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తత సద్దు మణిగిందంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది.

09/03/2017 - 01:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా యుబి ప్రవీణ్ రావు నియామకానికి వాటాదారుల ఆమోదాన్ని కోరింది. ఆయన తాత్కాలిక సిఈఓ, ఎండీ పదవిలో గరిష్ఠంగా అయిదేళ్లు లేదా కొత్త సిఈఓ, ఎండిని నియమించే వరకు కొనసాగుతారని ఇన్ఫోసిస్ తన పోస్టల్ బ్యాలెట్‌లో తెలియజేసింది.

09/03/2017 - 01:00

హైదరాబాద్, సెప్టెంబర్ 2: సాంకేతికంగా అత్యున్నత ఉత్పత్తులు అందించడంలో భాగంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ అమరాన్ బ్రూట్ హై లైఫ్ బ్యాటరీలను ఆవిష్కరించింది. లాజిస్టిక్స్ పరిశ్రమకు అవసరమయ్యే ఈ కొత్త బ్యాటరీలను ఆవిష్కరించడంతో సాటిలేని కస్టమర్ సేవలను అందించినట్లు అయ్యిందని ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, సిఎంఓ శ్రీనివాస్ గంగ తెలిపారు.

09/03/2017 - 01:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: జూలై నెల జిఎస్‌టి రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయని వ్యాపారులకు విధించే లేట్ ఫైన్ (జరిమానా)ను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీంతో దాదాపు 20 లక్షల మంది వ్యాపారులకు ఊరట లభించనుంది. జూలై నెల జిఎస్‌టి రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 25.

09/03/2017 - 00:58

విజయవాడ, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఫ్లగ్-ఇన్ హైబ్రీడ్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు టయోటా కిర్లోస్కర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకు అవసరమైన సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉండవల్లిలోని సిఎం నివాసంలో టయోటా మేనేజింగ్ డైరెక్టర్ అకిటో టకిబానా శనివారం చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు.

09/03/2017 - 00:56

హైదరాబాద్, సెప్టెంబర్ 2: రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడంలో కారు సీల్ట్ బెల్టు కీలక పాత్ర వహిస్తుంది. గతంతో పోలిస్తే సీట్ బెల్ట్ వినియోగిస్తూ కారు నడుపుతున్న వారు, ముందు సీట్లో కూర్చుని సీటు బెల్టు ధరించిన వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ కారణంగా భద్రత కోణంలో సీట్ బెల్టు వినియోగం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఈ అంశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన 2015 నివేదికలో వెల్లడించింది.

09/03/2017 - 00:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నల్లధనానికి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నల్లధనంపై భారత దేశం జరుపుతున్న పోరాటానికి మద్దతును కొనసాగించడానికి తమ దేశం కట్టుబడి ఉందని స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ అన్నారు.

Pages