S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/16/2016 - 23:59

వర్కా/బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ లేదా మొండి బకాయిలు)ను పెద్ద సమస్యేమీ కాదన్నారు సీనియర్ బ్యాంకర్ కెవి కామత్. ‘ఇప్పటికైతే తాను ఏమీ ఆందోళన చెందడం లేదు.’ అని మొండి బకాయిలపై కామత్ వ్యాఖ్యానించారు.

10/16/2016 - 23:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: బడా సంస్థల త్రైమాసిక ఫలితాలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

10/16/2016 - 23:57

విశాఖపట్నం, అక్టోబర్ 16: విశాఖపట్నం-చెన్నైల మధ్య పారిశ్రామిక నడవ (ఇండస్ట్రీయల్ కారిడర్) ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఆయా జిల్లాల పరిధుల్లో అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపించింది.

10/16/2016 - 23:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: భారతీయ రుణ మార్కెట్ల నుంచి ఈ నెల తొలి రెండు వారాల్లో విదేశీ మదుపరులు దాదాపు 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. సెప్టెంబర్‌లో పెట్టుబడులను తీసుకొ చ్చిన మదుపరులు.. అక్టోబర్‌లో మాత్రం వెనక్కి తగ్గారు. అయతే స్టాక్ మార్కెట్లలోకి మాత్రం పెట్టుబడులను కొనసాగించారు. అయనప్పటికీ 180 కోట్ల రూపాయలతోనే సరిపెట్టారు.

10/16/2016 - 23:54

ముంబయి, అక్టోబర్ 16: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాకు చెందిన హిందీ సినిమాల చానెల్ సోనీ మ్యాక్స్‌లో ప్రసారమైన సుల్తాన్ సినిమా ప్రకటనల ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా ఈ ఏడాది జూలై 6న విడుదలవగా, ప్రపంచవ్యాప్తంగా 585 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి విజయవంతమైనది తెలిసిందే. దేశీయ మార్కెట్ నుంచే 421 కోట్ల రూపాయలు వచ్చాయి.

10/16/2016 - 06:53

పనాజి, అక్టోబర్ 15: రష్యాకు చెందిన ప్రభుత్వరంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ నేతృత్వంలోని కూటమి.. శనివారం ఎస్సార్ ఆయిల్‌ను హస్తగతం చేసుకుంది. భారతీయ రెండో అతిపెద్ద ప్రైవేట్‌రంగ చమురు సంస్థ అయిన ఎస్సార్ ఆయిల్‌ను రాస్‌నెఫ్ట్ కూటమి దాదాపు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) ఈ డీల్‌నే అతిపెద్దది కావడం గమనార్హం.

10/16/2016 - 06:51

అనకాపల్లి, అక్టోబర్ 15: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి మార్కెట్‌లో బెల్లానికి కనీవినీ ఎరుగని రీతిలో రేటు పలుకుతోంది. ఆశించని, ఊహించని విధంగా బెల్లానికి పలుకుతున్న ధరలు చూసి రైతులు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. పది కిలోల మంచి రంగు బెల్లం గురువారం 455 రూపాయల రేటు పలికింది. నాసిరకం నలుపు రంగు బెల్లానికి సైతం 350 నుండి 370 రూపాయల వరకు ధర లభించింది.

10/16/2016 - 06:51

వర్కా/బెనౌలియమ్ (గోవా), అక్టోబర్ 15: భారత్‌కు సంబంధించి అంతా మంచే జరుగుతోందని, ఆసియా దేశాల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. ఆకస్మిక ప్రగతికి నాందిగా నిలుస్తుందని న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) అధ్యక్షుడు, సీనియర్ బ్యాంకర్ కెవి కామత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

10/16/2016 - 06:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ఇలా పెరగడం గడచిన రెండు నెలల్లో ఐదోసారి కావడం గమనార్హం. ఇక లీటర్ పెట్రోల్ ధర రూ. 1.34, డీజిల్ ధర రూ. 2.37 ఎగిసింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.05లకు చేరగా, డీజిల్ ధర రూ. 55.26లను తాకింది.

10/16/2016 - 06:50

వారాంతపు సమీక్ష

Pages